ETV Bharat / sukhibhava

తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తోందా? కారణాలు ఇవే కావొచ్చు!

author img

By

Published : Nov 29, 2021, 10:17 AM IST

కొందరు అతిమూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ప్రతీ 30నిముషాలకు ఓసారి మూత్రానికి వెళ్తుంటారు. దీనివల్ల మానసికంగా ఇబ్బందులకు గురవుతుంటారు. ఇలా పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.

frequent urination
తరచుగా మూత్రం

తరచూ మూత్రవిసర్జన సమస్యతో బాధపడుతుంటారు కొందరు. దీనికి అనేక కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తరచూ మూత్ర విసర్జనను(ఫ్రీక్వెంట్ యూరినేషన్) మధుమేహ లక్షణంగా భావిస్తుంటారు చాలామంది. అయితే డయాబెటిస్ వల్లే ఇలా అతి మూత్ర విసర్జన సమస్య ఉంటుందనుకోవద్దు. అందుకు ఇతర కారణాలు కూడా చాలా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. యూరిన్ ట్రాక్ట్​లో ఇన్ఫెక్షన్, కిడ్నీ పనితీరు ప్రభావితం కావడం వంటివి ఈ సమస్యకు దారితీస్తాయి.

మూత్రం ఎక్కువగా రావడానికి కారణాలు..

  • మెదుడు నుంచి వచ్చే ఆదేశాలపై.. మూత్రం ఎంత రావాలి అనే అంశాన్ని నియంత్రించే వాసోప్రెస్సిన్ హార్మోన్ లోపం వల్ల కూడా అతి మూత్ర వ్యాధి సమస్య తలెత్తుతుంది.
  • మూత్రం సాధారణంగా వచ్చినట్లే అనిపించినప్పటికీ.. బ్లాడర్ సమస్యలు అంటే 'యురెత్రా'(లోవర్ యూరినరీ ట్రాక్ట్) వల్ల కూడా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావొచ్చు.
  • మధుమేహం సమస్యతో బాధపడేవారిలో మూత్రం ఎక్కువగా రావడం గమనించవచ్చు.
  • మహిళల్లో తరచుగా కనిపించే మూత్రంలో ఇన్​ఫెక్షన్​ వ్యాధి వల్ల కూడా అతగా మూత్రం వస్తుంది.
  • న్యూరోజెనిక్ బ్లాడర్ వల్ల..
  • కిడ్నీ వ్యాధుల వల్ల..

పైన పేర్కొన్న అంశాలు మూత్రం అధికంగా రావడానికి కారణమవుతాయని.. సరైన పరీక్షల ద్వారా నిర్ధరణ చేసి.. చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా తొలగించొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.