ETV Bharat / sukhibhava

మానసిక ఒత్తిడితో సెక్స్ సామర్థ్యంపై ప్రభావం - ఆక్సిడేటివ్ స్ట్రెస్​ అంటే ఏమిటి

మానసిక ఒత్తిడి వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం క్షీణిస్తోందని బనారస్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిస్థితికి కారణాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు. మానసిక ఒత్తిడి.. పురుషుల లైంగిక సామర్థ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? అందుకు కారకాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.

Psychological Stress develops Impotency in Men BHU Study

author img

By

Published : Apr 4, 2023, 1:45 PM IST

తనువులు, మనసులను ఏకం చేసే సృష్టి కార్యమే శృంగారం. ఈ కార్యంలో పురుషులకు అంగస్తంభన కాకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనినే ఇంపొటెన్స్​(నపుంసకత్వం/లైంగిక శక్తి క్షీణించడం) అని అంటారు. అయితే, మానిసిక ఒత్తిడి ద్వారానే పురుషులు ఎక్కువగా ఈ ఇంపొటెన్స్​కు గురవుతారని బనారస్​ హిందూ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.

పురుషుల ఇంపొటెన్స్​కు సంబంధించి 50 శాతం కేసులకు అనేక విషయాలు కారణమవుతాయి. వివిధ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. ఇటీవల కాలంలో జీవన శైలిలో మార్పు, మానసిక ఒత్తిడి, పోషకాహారం, ​జీవక్రియ లోపాలు ఇంపొటెన్స్​కు ముఖ్య కారణాలు. మానసిక ఒత్తిడి వల్ల లైంగిక శక్తి క్షీణించడం, ఇంపొటెన్స్​కు సంబంధించి సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇదే విషయమై బనారస్ హిందూ​ యూనివర్సిటీ బయాలాజికల్​ సైన్స్​ విభాగానికి చెందిన డాక్టర్​ రాఘవ్​ కుమార్​ మిశ్ర, పీహెచ్​డీ విద్యార్థి అనుపమ్​ యాదవ్​ పరిశోధన చేశారు. సబ్-క్రానిక్ సైకలాజికల్ స్ట్రెస్, పురుషుల్లో లైంగిక శక్తి, పురుషుల అంగస్తంభన.. లాంటి విషయాలు శరీరంపై చూపే ప్రభావాలను అధ్యయనం చేశారు. ఈ మేరకు పురుష​ ఎలుకలను 30 రోజుల పాటు.. ప్రతి రోజు 1.5 గంటల నుంచి 3 గంటల వరకు మానసిక ఒత్తిడికి గురి చేశారు. ఆ సమయంలో వాటి న్యూరోమోడ్యులేటర్లు, హార్మోన్లు, లైంగిక సామర్థ్యం, అంగస్తంభన లాంటి డేటా సేకరించారు. దానిని విశ్లేషించగా.. మానసిక ఒత్తిడి.. గోనాడోట్రోపిన్‌ హార్మోన్ల​(దీని ద్వారా వృషణాలు టెస్టోస్టిరాన్​ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి) ప్రసరణ తగ్గిస్తుందని వెల్లడైంది. దీని కారణంగా ఒత్తిడి హార్మోన్ల (కార్టికోస్టెరాన్) స్థాయిలు పెరుగుతాయి. దీని ద్వారా పురుష హార్మోన్ల (టెస్టోస్టెరాన్)పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

మానసిక ఒత్తిడి.. పురుషాంగ కణజాలంలో మృదువైన కండరం(కొల్లాజెన్) నిష్పత్తిని తగ్గిస్తుందని గుర్తించారు. దీంతోపాటు ఆక్సిడేటివ్​ ఒత్తిడిని (హానికరమైన అణువులు, యాంటీ-ఆక్సిడెంట్ ఎంజైమ్‌ల మధ్య అసమతుల్యత) పెంచడం ద్వారా పురుషాంగం హిస్టోమోర్ఫాలజీని(హిస్టోపాథాలజీ అంటే కణజాల వ్యాధుల నిర్ధరణ, అధ్యయనం. ఇందులో మైక్రోస్కోప్​ కింద కణాలను పరిశీలిస్తారు) మారుస్తుంది. ఇది పీనల్ ఫైబ్రోసిస్‌కి(పురుషాంగం ఉపరితలంపై మచ్చ ఏర్పడటాన్ని పీనల్ ఫైబ్రోసిస్ అంటారు. ఇది పురుషాంగం సాగే గుణం కోల్పోయేలా చేస్తుంది) కూడా దారి తీస్తుందని కనుగొన్నారు. వీరి అధ్యయనం ప్రకారం.. మానసిక ఒత్తిడి.. లైంగిక సంపర్కంలో పాల్గొనడం, లైంగిక సంపర్కంలో పాల్గొనే కాలం, స్ఖలనం ఫ్రీక్వెన్సీలను తగ్గిస్తుంది. దీంతో లైంగిక సంపర్కంలో అలసటను పొడిగిస్తుంది.

అయితే, మానిసికి ఒత్తిడి.. పురుషుల లైంగిక శక్తి, పురుషాంగంపై దాని ప్రభావాలపై చేసిన కొన్ని పరిశోధనల్లో ఇది ఒకటని డాక్టర్​ రాఘవ్​ కుమార్​ తెలిపారు. ఈ పరిశోధన.. మానసిక ఒత్తిడి, పురుషుల లైంగిక శక్తిపై కొత్త విశ్లేషణలకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. కాగా, ఈ పరిశోధన ఫలితాలు ప్రఖ్యాత మెడికల్​ జర్నల్​.. న్యూరోఎండోక్రినాలజీ జర్నల్​ ప్రచురితం అయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.