ETV Bharat / sukhibhava

అందం, ఆరోగ్యం మీ చేతుల్లోనే... ఇలా చేస్తే సరి!

సాధారణంగా అందం, ఆరోగ్యం అంటే ఇష్టం ఉండని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలనే కోరుకుంటారు. కానీ అందుకు తగ్గ జాగ్రత్తలు ఏవీ తీసుకోరు. కారణం సమయం లేదు అనే చెబుతారు. కొందరు ఆఫీసు పనుల్లో బిజీగా ఉండగా.. మరి కొందరు ఇంటి పనుల్లో తీరికే లేకుండా గడుపుతారు. అలాంటి వారు ఈ లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అందం, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకోండి మరి!

protect your beauty and health by using these tips
అందం, ఆరోగ్యం మీ చేతుల్లోనే సంరక్షించేయండి ఇలా!
author img

By

Published : Apr 14, 2020, 2:20 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

జుట్టు చూడు ఎలా జీవం లేకుండా ఉందో.. కాస్త హెయిర్​ప్యాక్​ వేయొచ్చుగా? సమాధానం.. టైం లేదు! చర్మం చూడు పొడిబారిపోయి ఎలా ఉందో.. కాస్త కేర్​ తీసుకోవచ్చుగా? సమాధానం.. టైం లేదు. ఇవే కాదు అందం, ఆరోగ్యం గురించి ఎవరేం చెప్పినా సమాధానం టైం లేదు అనే చెప్పాం. మరి ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది కదా! ఇక ఎందుకు ఆలస్యం ఈ జాగ్రత్తలు పాటించండి..

విటమిన్‌ డి సంగతేంటి?

మామూలుగానే మనకు విటమిన్‌-డి తక్కువగా ఉంటుంది. మరి బయటకు రావడానికి జంకుతున్న ఈ వేళ.. డి విటమిన్​ ఎలా అందుతుంది? కాల్షియం, ఫాస్ఫరస్‌ను శరీరం గ్రహించడానికి విటమన్‌-డి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ విటమిన్‌ ఎంత అవసరం. గుండె జబ్బులు, కుంగుబాటును తగ్గిస్తుంది. బరువు కూడా తగ్గిస్తుంది.

డి తగ్గితే వీటిని తీసుకోండి

చిన్నపనికే అలసిపోతూ ఉంటాం. కాస్త ఎక్కువ పనిపడితే ఒళ్లు, కండరాల నొప్పులు. నాలుగు మెట్లు ఎక్కితే అలసట. కింద కూర్చుని లేవడానికి కష్టపడుతుంటాం. ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజూ మనకు 600 ఇంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌-డి అవసరం. ఈ విటమిన్‌-డి సూర్యరశ్మి నుంచి అందుతుంది. మనకిప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి... ఆహార పదార్థాల నుంచి తీసుకోవచ్చు. చేప, గుడ్డులోని పచ్చసొన, లివర్‌లో ఉంటుంది. ప్రస్తుతం పాలల్లో కూడా విటమిన్‌-డిని జతచేస్తున్నారు.

జుట్టు సంరక్షణ

చాలామందిలో జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం తరచూ చూస్తూ ఉంటాం. ఉద్యోగినులు మామూలు రోజుల్లో ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోలేరు. కానీ ఈ సమయంలో జుట్టుపై కాస్త శ్రద్ధ పెట్టొచ్చు.

* కొబ్బరినూనెలో గోరువెచ్చని ఆముదం కలిపి తలకు పట్టించాలి. రాత్రంతా ఉంచి మర్నాడు తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

సహజ సిద్ధమైన హెయిర్‌ప్యాక్‌లు..

* అరచెంచా గ్రీన్‌టీ పౌడర్‌లో చెంచా కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

* రెండు గుడ్ల తెల్లసొనకు కొన్ని చుక్కల ఆలివ్‌నూనె, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

* చెంచా కలబంద గుజ్జులో, కొద్దిగా బాదంనూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వీటితోపాటు జుట్టు పెరగడానికి మంచి ఆహారం ఎంతగానో తోడ్పడుతుంది. జింక్‌, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-ఎ, సి, డి, ఈ... ఇవన్నీ సరిగ్గా తీసుకోవాలి.

విటమిన్‌ ఎ: క్యారెట్‌, పాలకూర, గుమ్మడికాయలు, చిలగడదుంపల్లో ఉంటుంది.

విటమిన్‌ బి: పొట్టు తీయని పప్పులు, మాంసం, ఆకుకూరల్లో లభిస్తుంది.

విటమిన్‌ సి: స్ట్రాబెర్రీ, నిమ్మకాయలు, క్యాప్సికమ్‌, జామకాయలు, మామిడిపండ్ల నుంచి అందుతుంది.

విటమిన్‌ డి: గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, పాలు, చేపలు

విటమిన్‌ ఈ: పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, బాదంపప్పు, పాలకూరలో ఉంటుంది.

ఐరన్‌: గుడ్లు, పాలకూర, పప్పుల్లో దొరుకుంది.

జింక్‌: పాలకూర, గుమ్మడి గింజల్లో, గోధుమ, పప్పుదినుసుల్లో లభిస్తుంది.

ప్రొటీన్‌: పప్పు, గుడ్లు, పాలు, చికెన్‌, మాంసాలు అందిస్తాయి.

చెమటకాయలుంటే...

వేసవికాలంలో చర్మాన్ని బాగా ఇబ్బందిపెట్టేవి చెమటకాయలు. వ్యాయామం చేసి స్నానం చేయకపోయినా ఇవి వస్తాయి.

* స్నానం చేసిన తర్వాత పౌడర్‌ రాసుకోవాలి. కేలమిన్‌ లోషన్‌ను రెండు, మూడుసార్లు రాస్తే తగ్గడానికి అవకాశం ఉంది.

* చల్లటి నీటిలో తువ్వాలును ముంచి, నీళ్లు లేకుండా పిండి దాంతో తుడవచ్చు. కలబంద జెల్‌ కూడా రాయొచ్చు.

* మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడాలి.

* చెమటకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. అందుకని రెండు పూటలా స్నానం చేసి పొడిగా తుడుచుకుని పౌడర్‌ రాసుకోవాలి.

ఇవీ పాటించండి

ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నెయిల్‌ పాలిష్‌, లిప్‌స్టిక్‌లకు విరామం ఇవ్వండి. లేకపోతే గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. గోళ్లను శుభ్రం చేసుకుని చక్కగా కట్‌ చేసుకోవాలి. మాయిశ్చరైజర్‌ రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి.

* లిప్‌స్టిక్‌ వేసుకోకుండా వైట్‌ పెట్రోలియం జెల్లీ, ఆలివ్‌ నూనె, బాదంనూనె, పాలమీగడ పెదాలకు రాసుకోవచ్చు.

* పాలల్లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాయడం వల్ల పొడిబారకుండా ఉంటాయి.

* లాక్‌డౌన్‌ సమయంలో ఖాళీ ఉంటుంది కాబట్టి మేకప్‌ బ్రష్‌లు శుభ్రం చేసుకోవచ్చు. చాలామంది వీటిని ఎంతో కాలంగా వాడుతున్నా శుభ్రం చేయరు. దీనివల్ల బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు, చర్మ సంబంధ ఎలర్జీలు వస్తాయి. గోరువెచ్చని నీటిలో బ్రష్‌లను నానబెట్టి శుభ్రం చేసుకుని నీళ్లు పిండేయాలి. తర్వాత తువ్వాలుతో తుడుచుకోవాలి.

ఇదీ చదవండి: మోదీ 'డొల్ల' ప్రసంగంలో ఉద్దీపన మాటేది?: కాంగ్రెస్

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.