మూత్రంలో ప్రోటీన్ పోతూ (protein in urine) ఉంటే కిడ్నీలు పాడై పోయాయని అర్థమా? దాని వల్ల జరిగే పరిణామాలపై ఆందోళన చెందుతున్నారా? కిడ్నీ అనారోగ్యంగా ఉందని చెప్పడానికి చేయాల్సిన పరీక్షలేంటో చూద్దాం.
ప్రశ్న: మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. దీనివల్ల ఏమైనా సమస్యలు ఏర్పడతాయా?
డాక్టర్ సమాధానం: మూత్రంలో ప్రోటీన్ పోవడమనేది కిడ్నీ పరంగా మంచిది కాదు. ఏదైనా ఒక అవయవం తాను బాగలేనని చెప్పడానికి కొన్ని సందర్భాలుంటాయి. మెదడు బాగలేనని చెప్పడానికి ఫిట్స్, గుండె అయితే.. గుండెలో దడ, ఊపిరితిత్తులు కష్టపడుతున్నప్పుడు ఆయాసం రూపంలో తెలుస్తుంది.
శరీరం లోపల ప్రశాంతంగా ముడుచుకుపోయి ఉన్న లివర్ గానీ, కిడ్నీ గానీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రం సులువుగా తెలియదు. అందుకోసం రక్త, మూత్ర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. జాండిస్ వచ్చినప్పుడు లివర్ బాలేదని తెలుస్తుంది. అదే మూత్రంలో కొంచెం నురగ లాగా వచ్చి, ప్రోటీన్ పోతుంటే కిడ్నీ బాగాలేదని అర్థం. కిడ్నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి చాలా తక్కువ పరీక్షలు అవసరం అవుతాయి.
కిడ్నీలు- అనారోగ్య లక్షణాలు..
మూత్ర పిండాలు పాడైనప్పుడు ప్రోటీన్ సహా ఎర్ర రక్త కణాలు మూత్రంలో పోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బీపీ కొంచెం పెరుగుతుంది. ఇవేవీ కాకుండా కిడ్నీ పెద్దమొత్తంలో పాడైతే క్రియాటిన్ అనే పదార్థం పోతుంది. ఎప్పుడైతే ఈ మార్పులు కనిపిస్తాయో అప్పుడు కిడ్నీ బాగాలేదని అర్థమవుతుంది.
అయితే తాత్కాలికంగా కొద్దిమొత్తంలో పోయే ప్రోటీన్ కిడ్నీ, శరీరానికి హానికరం కాదు. కానీ దీర్ఘకాలంలో సమస్య కొనసాగితే తప్పనిసరిగా పరీక్షలు చేయాల్సిందే. కిడ్నీ బయాప్సీ లాంటి టెస్టులతో కిడ్నీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానితో పాటు మనకు ఉన్న ఇతరత్రా రోగాల ఆధారంగా చికిత్స చేయించుకోవడం ఉత్తమం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: మూత్రాన్ని ఆపుకోలేకపోతున్నారా? సమస్య ఇదే..!