Pimples Removal Tips At Home : యుక్త వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలను వేధించే సమస్య మొటిమలు. సాధారణంగా శరీరంలోని వేడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, కాలుష్యం లాంటి కారణాల వల్ల మొటిమలు వస్తాయి. వీటి వల్ల ఏర్పడే మచ్చలు, గుంతలు ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. మొటిమలు వచ్చాక వాటిని పోగొట్టేందుకు ప్రయత్నించడం కంటే ముందే అవి రాకుండా జాగ్రత్తపడటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ మొటిమల సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం!
Pimples Remove Tips In Telugu : ప్రతి ఒక్కరికీ తాము అందంగా కనిపించాలని ఉంటుంది. పది మందిలో ఉంటే అందరి చూపూ తమ మీదే ఉండాలని, అందరికంటే తామే అందంగా కనిపించాలని ఉంటుంది. అందంతో ఆకట్టుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే దీనికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సౌందర్యపోషణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే అందాన్ని కాపాడుకోవచ్చు. సౌందర్యపోషణలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి మొటిమలు. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే..
ముఖాన్ని కడుగుతూ ఉండాలి
Pimples On Face : రోజులో రెండుసార్లు క్లెన్సర్ సాయంతో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. దీని వల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు, మలినాలు తొలగిపోతాయి. అయితే ముఖం కడిగితే మంచిదని చెప్పి.. రోజుకు రెండుసార్లకు మించి ఫేస్ వాష్ చేస్తే మొటిమలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోషకాహారాన్ని తీసుకోవాలి
Foods To Avoid Pimples : రోజూ పోషకాహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లతో పాటు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయులు అధికంగా ఉండే ఆహారాలు, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వల్ల కూడా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.
నీళ్లు అధికంగా తాగాలి
Water For Pimples : రోజూ సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. దీని వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలోని పేగులు, ఇతర అవయవాలు శుభ్రపడతాయి. అలాగే చర్మంలోని మురికి, కాలుష్యం, ట్యాక్సిన్స్ తొలిగిపోతాయి. దీంతో మొటిమల సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు అధికంగా తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి.. చర్మం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక రోజులో కనీసం ఏడెనిమిది గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు.
తరచూ ముట్టుకోవద్దు
Don't Touch Your Face To Avoid Pimples : ముఖాన్ని తరచూ ముట్టుకునే లేదా ముఖంపై తరచూ చేతులను పెట్టే అలవాటు కొందరిలో ఉంటుంది. కానీ ఇది సరికాదని నిపుణులు అంటున్నారు. శుభ్రం చేసుకోకుండా చేతులను ముఖంపై పెట్టడం వల్ల వాటి మీద ఉన్న బ్యాక్టీరియా కాస్తా ముఖంపైకి చేరుతుందని.. దీని వల్ల మొటిమలు మరింత ఎక్కువవుతాయని చెబుతున్నారు.
మేకప్‌ను తుడిచేయాలి
Clean Makeup To Avoid Pimples : బయటకు వెళ్లేటప్పుడు మేకప్ వేసుకునే అలవాటు కొందరికి ఉంటుంది. అలాంటి వారు ఎప్పటికప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్రష్, స్పాంజీల సాయంతో మేకప్‌ను క్లీన్ చేసుకోవాలి. తద్వారా ముఖంపై బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
వ్యాయామం తప్పనిసరి
Exercise For Pimples : తరచూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది చర్మకణాల్లో ఆక్సిజన్‌తో పాటు పోషకాల పంపిణీకి సాయపడుతుంది. వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మొటిమల సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒత్తిడికి చెక్ పెట్టాలి
Stress Pimples On Face : రోజువారీ పనులు, వ్యాపారాలు, ఇతర సమస్యల వల్ల ఒత్తిడికి గురవ్వడం సహజమే. అయితే ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలపై దృష్టి సారించాలి. అధిక ఒత్తిడికి గురయ్యేవారిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల మొటిమల సమస్య మరింత ఎక్కువవుతుంది. కనుక యోగా, ధ్యానం, దీర్ఘశ్వాస తీసుకోవడం లాంటి వాటిని సాధన చేస్తూ ఉండాలి.
సన్‌స్క్రీన్ వినియోగించాలి
Sunscreen For Pimples : ఎండ బారి నుంచి ముఖాన్ని రక్షించుకోవాలి. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మసౌందర్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ లోషన్స్ లాంటివి వాడొచ్చని సూచిస్తున్నారు.
ఏది పడితే అది వాడొద్దు!
Products To Buy For Skin Care : చర్మ సంరక్షణ కోసం చాలా మంది ఏది పడితే అది వాడేస్తుంటారు. కానీ ఇది సరికాదని నిపుణులు అంటున్నారు. నాన్-కామెడోజెనిక్ అనే లేబుల్ ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.
అలా అస్సలు చేయొద్దు!
Home Remedy For Face Pimples : మొటిమల సమస్యతో బాధపడేవారిలో కొందరు వాటిని పదే పదే ముట్టుకుంటారు. మొటిమల్ని గిల్లడం, గిచ్చడం లాంటివి చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల వాపు రావడం, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పై సూచనలు పాటిస్తూనే స్కిన్ కేర్ స్పెషలిస్ట్‌లను కలసి మందులను వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.