ETV Bharat / sukhibhava

పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి వస్తే పిల్లలు పుట్టరా? సెక్స్​కు వయోపరిమితి ఉంటుందా?

సాధారణంగా మహిళలకు గర్భం దాల్చడం, శృంగారంపై అనేక అనుమానాలు ఉంటాయి. పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి వస్తే పిల్లలు పుట్టరా? శృంగారం ఎంత సేపు చేయవచ్చు? సుఖప్రాప్తి పొందాలంటే ఏం చేయాలి? సెక్స్​కు వయోపరిమితి ఉంటుందా? అనే ప్రశ్నలకు నిపుణులు ఏమంటున్నారంటే?

periods time stomach pain
పీరియడ్స్ టైంలో కడుపునొప్పి
author img

By

Published : Feb 19, 2023, 10:24 AM IST

పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి వస్తే.. పిల్లలు పుట్టరా? శృంగారానికి వయోపరిమితి ఉంటుందా?

మహిళలకు పీరియడ్స్ సమయంలో అనేక అపోహలు ఉంటాయి. పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి వస్తే గర్భం దాల్చుతామా లేదా అనే అనుమానం ప్రస్తుతం ఎక్కువ మంది మహిళల్లో ఉంది. అలాగే శృంగారం ఎంతసేపు చేయవచ్చు? సుఖప్రాప్తి పొందేందుకు మహిళలు ఏం చేయాలి? శృంగారానికి వయోపరిమితి ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు మహిళల మదిలో ఉంటాయి. అయితే ఇలాంటి ప్రశ్నలకు నిపుణుల సమాధానాలు ఇవే?

పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తే పిల్లలు పుట్టరా?
మహిళలకు పీరియడ్స్ టైంలో కడుపునొప్పి రావడం సహజమని అంటున్నారు నిపుణులు. పిల్లలు పుట్టడానికి పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి రావడానికి సంబంధం లేదని చెబుతున్నారు. ఇవన్నీ అపోహలేనని అంటున్నారు. 'పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలకు కడుపు నొప్పి వస్తుంది. దీనిని డిస్మోనేరియా అంటారు. కొందరికి పీరియడ్స్ సమయంలో గర్భాశయం ముడుచుకోవడం వల్ల కడుపు నొప్పి రావచ్చు. అలాగే మరికొందని పీరియడ్స్ సమయంలో యోని భాగంలో రక్తం పెరగడం వల్ల కడుపునొప్పి రావచ్చు. అంతేగానీ కడుపునొప్పి రావడం వల్ల పిల్లలు పుట్టరు అనేది నిజం కాదు. పిల్లలు పుట్టడడానికి అండం విడుదలవ్వాలి అంతే' అని నిపుణులు తెలిపారు.

శృంగారానికి వయోపరిమితి ఉంటుందా?
శృంగారానికి వయోపరిమితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. 80 ఏళ్ల వయసులోనైనా ఆసక్తి ఉంటే సెక్స్ చేయవచ్చని అంటున్నారు. 'వయసు పెరుగుతున్న కొద్ది పురుషుల్లో టెస్టోస్టిరాన్​ హార్మోన్లు.. మహిళల్లో ఈస్ట్రోజెన్​ హర్మోన్లు తగ్గుతాయి. ఎప్పుడైతే హార్మోన్లు తగ్గుతాయో.. అప్పటినుంచి సెక్స్​పై ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సెక్స్​పై ఆసక్తి తగ్గుతుంది. మంచి ఆహారం, వ్యాయామం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాంటప్పుడు శృంగారం ఎన్నేళ్లు వరకు అయినా చేయవచ్చు. సెక్స్​కు వయోపరిమితి లేదు' అని నిపుణులు చెప్పారు.

సెక్స్ ఎంత సేపు చేస్తారు?
'సాధారణంగా 3-5 నిమిషాల్లో శృంగారం చేసేసరికి కొంతమంది పురుషుల్లో వీర్యం పడిపోతుంది. శృంగారం చేసేటప్పుడు వీర్యం పడిపోకుండా నిరోధించుకునే విధంగా మనసును కంట్రోల్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల వీర్యం వెంటనే పడిపోకుండా శృంగారంలో ఎంజాయ్ చేయవచ్చు' అని నిపుణులు వివరించారు.

సెక్స్​లో పాల్గొనేటప్పుడు మహిళలకు సుఖప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి?
'సెక్స్​లో పాల్గొనేటప్పుడు మహిళలకు సుఖప్రాప్తి కలగకపోవడానికి ముఖ్య కారణం శృంగారం పట్ల ఆసక్తి ఉండకపోవడమే. పురుషుడితో శృంగారం పాల్గొనాలనే ఆసక్తి మహిళ కలిగి ఉండడం వల్ల సుఖప్రాప్తి పొందవచ్చు. సెక్స్​లో పాల్గొనేటప్పుడు కోరిక, ఎక్సైజ్​మెంట్​ ఉండాలి. అప్పుడే రతిలో మహిళలకు సుఖప్రాప్తి కలుగుతుంది' అని డా.సమరం తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.