ETV Bharat / sukhibhava

పెడిక్యూర్​ కోసం పార్లర్​కు వెళ్తున్నారా? - పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోని పాదాల అందం పెంచుకోండి! - Pedicure at Home with Natural Ingredients

Best Tips for Smooth Feet : నేటి యువత.. అందంగా కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే చాలా మంది ముఖంపై పెట్టె శ్రద్ధ కాళ్లు, చేతుల మీద పెట్టరు. అదే సమయంలో కొంతమంది మాత్రం పాదాలు, చేతులు అందంగా కనిపించడానికి బ్యూటీ పార్లర్​ను ఆశ్రయిస్తారు. పెడిక్యూర్​తో డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తారు. అయితే ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో పాదాలు అందంగా కనిపించేలా చేసుకోవచ్చు.

Pedicure
Pedicure
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 10:00 AM IST

Pedicure for Beautiful Feet at Home : అందంగా ఉండాలని ఎవరికుండదు చెప్పండి? అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మంది ముఖ వర్చసును మెరుగుపరుచుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. కానీ, ముఖంతో పాటు చేతులు, కాళ్లు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే అందానికి పరిపూర్ణత చేకూరడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం పాదాల సంరక్షణకు పెడిక్యూర్​ విధానాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని బ్యూటీపార్లర్‌లలో వివిధ ట్రీట్‌మెంట్లతోపాటు పెడిక్యూర్‌లను అందిస్తున్నారు. అయితే వాటి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది..

ఇంకొందరైతే నల్లగా మారి అందవిహీనంగా కనిపించే పాదాల చర్మం మెరుపులీనడానికి మార్కెట్లో దొరికే ఏవేవో ఫుట్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఆ ప్రొడక్ట్స్ దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపే అవకాశం లేకపోలేదు. అంతేకాదు వీటికి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే కొన్ని సార్లు పాదాలకీ అంత ఖర్చెందుకు అనిపిస్తుంది. అలాంటి వారు ఇకపై పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చుని సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఫలితంగా మీ పాదాలు చూడడానికి అందంగా, మృదువుగా మారిపోతాయి.

పెడిక్యూర్​ అంటే ఏమిటి?: మసాజ్​ ద్వారా పాదాలను, గోళ్లను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడాన్నే పెడిక్యూర్‌ అంటారు. పెడిక్యూర్‌ అనేది లాటిన్‌ పదం. లాటిన్​లో పెడ్‌ లేదా పెస్‌ అంటే పాదము, క్యూర్‌ అంటే రక్షణ అని అర్థం. రోజంతా పని చేసి అలసిపోయిన మోకాళ్లు, పాదాలు, మడమలు, కాలి వేళ్లు, గిలకలకు సున్నితమైన మసాజ్‌ సాయంతో ఉపశమనం కలిగించడం పెడిక్యూర్‌లో ఒక భాగంగా ఉంటుంది.

ఇంట్లోనే పెడిక్యూర్​ ఎలా చేయాలి:

  • ముందుగా మీ కాలి గోళ్లకు ఏదైనా పాత నెయిల్ పాలిష్ ఉంటే రిమూవర్ సాయంతో పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తర్వాత గోళ్లను అనుకున్న రీతిలో కట్ చేసుకొని.. శుభ్రంగా పాదాలను కడగాలి.
  • ఇందుకోసం ఒక టబ్​లో అరబకెట్‌ గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో కాస్త ఉప్పు వేసి పాదాలను 20 నిమిషాలు అందులో ఉంచాలి. నీటిలో ఉప్పు వేయడం వల్ల పాదాల్లోని దుమ్మును దూరం చేసి చర్మాన్ని(Skin Care) మృదువుగా చేస్తుంది.
  • అలాగే మంచి ఫ్యూమిస్‌ స్టోన్‌తో మురికి వదిలేంత వరకూ రుద్దాలి. లేదా గరుకుగా ఉండే పిండితో మడమలు, అరికాళ్లను శుభ్రమయ్యేలా రుద్దాలి. ఇలా చేయడం ద్వారా పాదాల చుట్టూ పేరుకున్న మృతకణాలు, తెల్లనిపొర తొలగిపోయి మృదువుగా మారతాయి.
  • ఇప్పుడు స్క్రబ్‌ చేసుకోవడానికి ఒక గిన్నెలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని అందులో నాలుగు చెంచాల చక్కెర, స్పూన్‌ చొప్పున నిమ్మరసం, తేనెలను యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దానిని వేళ్లు, అరికాళ్లకు మసాజ్‌ చేసి.. ఆపై నీటితో కడిగేసుకోవాలి.
  • ఇక చివరిగా మీరు ఇంట్లో వాడే మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయి.

వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. ఇకపోతే పాదాలను మెరిపించడంలో అరటి తొక్కలు కూడా చక్కగా పనిచేస్తాయి. మనం తిని బయట పారేసే అరటి తొక్కలతో పాదాలపైన రుద్దితే మృతకణాలు, దుమ్మూ ధూళీ తొలగిపోతాయి. ఆ తర్వాత అరటి తొక్కలను ముక్కలుగా తరిగి కొద్దిగా తేనె వేసి పేస్టులాగే చేసుకోవాలి. అనంతరం ఈ పేస్టుని పాదాలకు అప్లై చేయాలి. అరగంట ఆగిన తర్వాత సాధారణ నీటితో పాదాలను కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు చేయడం ఈ విధంగా వల్ల మీ పాదాలు మృదువుగా మారడంతో పాటు, చక్కగా మెరుస్తాయి.

Tips For Glow Skin : పసుపు,పెరుగు, శెనగపిండితో ఈజీగా ఫేస్​ప్యాక్​.. మొటిమలు, ముడతలకు చెక్!​

ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే - పార్లర్​కు వెళ్లకుండానే మెరిసే అందం మీ సొంతం!

మృదువైన చర్మ సోయగానికి ఇంటి చిట్కాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.