ETV Bharat / sukhibhava

Memory Loss Disease Dementia : నడి వయస్సులో మతిమరుపు.. కారణాలు, నివారణ మార్గాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 10:32 AM IST

Memory Loss Disease Dementia : డిమెన్షియా అనే సమస్య.. ఒక్క మతిమరుపును కలిగించటమే కాదు, ఆలోచనా తీరునూ దెబ్బతీస్తుంది. కార్యకారణ వివేచననూ తగ్గిస్తుంది. ఫలితంగా ప్రవర్తన, మాట, కదలికలు అన్నీ మారిపోతాయి. సాధారణంగా ఇది వృద్ధాప్యంలోనే తలెత్తుతుంది. కానీ ఇటీవల చాలా మంది యుక్త, మధ్యవయస్సుల వారిలోనూ ఈ సమస్య పెరుగుతోంది. మరి దీనికి కారణం ఏమిటి? నివారణ మార్గాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Why Memory Loss Occurs Story In Telugu
Memory Loss Disease Dementia

Memory Loss Disease Dementia : మతిమరుపు (డిమెన్షియా) అనేది వ్యక్తుల ఆలోచనా తీరునూ దెబ్బతీస్తుంది. మన వివేచన పరిజ్ఞానాన్ని బాాగా తగ్గిస్తుంది. ఫలితంగా ప్రవర్తన, మాటతీరు అన్నీ మారిపోతాయి. వాస్తవానికి డిమెన్షియా సమస్య అనేది చాలా వరకు వృద్ధాప్యంలోనే తలెత్తుతుంది. కానీ అరుదుగా కొంత మంది మధ్య వయస్సు వారికి, యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా ఈ మతిమరుపు సమస్య వస్తూ ఉంటుంది. దీనిని ఫ్రాంటోటెంపోరల్‌ డిజార్డర్స్​ (ఎఫ్‌టీడీ) అంటారు. చాలా వరకు ఈ సమస్య 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సులో వస్తూ ఉంటుంది.

మెదడే మూలం!
Dementia Reasons : మనం చేసే పనులన్నింటినీ ఆజమాయిషీ చేసేది కేవలం మెదడు మాత్రమే. మెదడులో ఐదు భాగాలుంటాయి. నుదురు వెనుక భాగం (ఫ్రాంటల్​ లోబ్స్​) నడక, మాటలు, డ్యాన్స్‌ లాంటి ఉద్దేశపూర్వకంగా చేసే పనులను.. అలాగే భాషతో అభిప్రాయాల వ్యక్తీకరణ, అత్యధిక నైపుణ్యంతో కూడిన పనులను నియంత్రిస్తుంది. చెవి వెనుక ఉండే భాగాలు (టెంపోరల్‌ లోబ్స్‌) శబ్దాలను వినడం, జ్ఞాపకాలను స్థిరపరచుకోవటం, భావోద్వేగాల లాంటి వాటిని నియంత్రిస్తాయి. అందుకే వీటిల్లో ఎలాంటి సమస్య తలెత్తినా ఆయా పనులన్నీ దెబ్బతింటాయి. ఫ్రాంటోటెంపోరల్‌ డిజార్డర్స్‌లో సరిగ్గా ఇలాగే జరుగుతుంది.. అందుకే దీన్ని ఫ్రాంటోటెంపోరల్‌ డిమెన్షియా అనీ అంటారు.

డిమెన్షియా ఎందుకొస్తుంది?
Memory Loss Reasons : ఫ్రాంటోటెంపోరల్‌ డిజార్డర్స్ (ఎఫ్‌టీడీ)కు కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. కొందరికి వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులతో ఈ సమస్య రావచ్చు. అందుకే కొన్ని కుటుంబాల్లో మతిమరుపు సమస్య తరతరాలుగా కనిపిస్తూ ఉంటుంది. దీని బారినపడ్డవారి మెదడు కణాల్లో కొన్నిరకాల ప్రొటీన్లు పోగుపడి, మెదడు కణాలు దెబ్బతింటాయి. చివరికి ఆ కణాలు మరణిస్తాయి కూడా.

నిర్ధరణ కష్టం!
How To Detect Dementia : ఎఫ్‌టీడీని నిర్ధరించటం కష్టమనే చెప్పుకోవచ్చు. తొలిదశలో లక్షణాలు స్థిరంగా ఉండవు. మతిమరుపు లక్షణాలు వస్తూ, పోతూ ఉంటాయి. కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తించవచ్చు. కొద్ది నెలలు, వారాల తర్వాత మళ్లీ మామూలుగా కావచ్చు. పైగా డిమెన్షియా లక్షణాలు ఇతర జబ్బుల మాదిరిగా కనిపిస్తాయి. జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల బాధితులు అలా ప్రవర్తిస్తున్నారని.. మనం పొరపాటుపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్లూ వీరిని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పుగా ప్రవర్తిస్తున్నారనో, కావాలని చేస్తున్నారనో అనుకోవచ్చు. దీనితో కుటుంబసభ్యుల, స్నేహితుల ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. రక్త పరీక్షలు.. ఎంఆర్‌ఐ, పెట్‌ స్కాన్‌ లాంటివి కొన్నిరకాల సంకేతాలను గుర్తించటానికి తోడ్పడవచ్చు. కానీ ఎఫ్‌టీడీ మామూలుగా ఉన్నవారిలో పెద్దగా మార్పులేవీ ఉండవు. అందువల్ల మతిమరుపు సమస్య ఉందని అనుమానం కలిగితే.. అనుభవజ్ఞులైన నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

పూర్తిగా నయం కాదు!
Dementia Treatment : వాస్తవానికి మధ్య వయస్సులో వచ్చే మతిమరుపు పూర్తిగా నయమయ్యేది కాదు. కానీ కొన్ని లక్షణాలను మాత్రం నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఉదాసీనత, నిర్లక్ష్యం, నిరాశ, చిరాకు లాంటి మానసిక లక్షణాలు ఉంటే.. వాటిని యాంటీ డిప్రెసెంట్లు ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇవి అనుచిత ప్రవర్తనలు తగ్గించడానికి తోడ్పడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వంశపారంపర్యంగా మతిమరుపు జబ్బుతో బాధపడుతున్నవారు.. వ్యాయామాలు చేస్తే చాలా వరకు డిమెన్షియా తగ్గుతుందని ఓ అధ్యయనంలో రుజువైంది. ఎందుకంటే శారీరకంగా చురుకుగా ఉండేవారిలో మతిమరుపు సమస్య అంత త్వరగా రాదు. వచ్చినా అంత త్వరగా ముదరదు. అయితే మతిమరుపు సమస్య ఉన్నవారికి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. సమస్యతో బాధపడుతున్నవారి ప్రవర్తనను అర్థం చేసుకొని.. ఇంట్లో పరిసరాలు సురక్షితంగా ఉండేలా కుటుంబ సభ్యులు, స్నేహితులు చూసుకోవాలి.

లక్షణాలేంటి?
Memory Loss Symptoms :

  • మెదడు దెబ్బతిన్న భాగాన్ని అనుసరించి మతిమరుపు లక్షణాలు మారుతూ ఉంటాయి.
  • తరచూ కనిపించే లక్షణాలు - ప్రవర్తన, వ్యక్తిత్వం మారిపోవటం.
  • ముందు చేయాల్సిన పనిని తరువాత, తర్వాత చేయాల్సిన పనిని ముందు చేస్తుంటారు.
  • తొందర పడటం, అనుచితంగా మాటలు మాట్లాడటం, అనవసర పనులు చేయటం.
  • అవే పనులను పదే పదే చేయటం.
  • అవే పదాలను మళ్లీ మళ్లీ వాడటం.
  • కుటుంబం మీద, అంతకు ముందు ఆనందం కలిగించిన పనుల మీద ఆసక్తి లేకపోవటం.
  • మాట్లాడటంలో ఇబ్బంది పడటం.
  • పదాలను అర్థం చేసుకోలేకపోవటం (ఆపేసియా).
  • చెప్పదలచుకున్న విషయానికి సరిపడిన పదాలు గుర్తుకు రాకపోవటం.
  • పనుల నిర్వహణ ప్రణాళిక లోపించటం.
  • లక్ష్యాలను చేరుకోలేక ఇబ్బంది పడటం.
  • ఇతరుల మీద దయ, కరుణ, సానుభూతి చూపలేకపోవటం.
  • ఒకప్పుడు ఇష్టమైన ఆహార పదార్థాలకు బదులు వేరే తినటం.
  • నడవటానికి ఇబ్బంది పడటం, తూలిపోవటం మొదలైనవి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.