ETV Bharat / sukhibhava

చలి తీవ్రతతో హఠాత్తుగా గుండెపోటు.. వచ్చే ఛాన్స్​ వీరికి ఎక్కువ! - గుండెజబ్బుల బాధితుల్లో 40 ఏళ్ల లోపు వారు

Severity of heart attacks: ఎముకలు కొరికే చలి గుండెనూ పిండేస్తుంది. హృదయ రక్తనాళాల్లో ఒక్కసారిగా విస్ఫోటం జరగడానికి చలికాలంలో అవకాశాలెక్కువ. ఇప్పటికే కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, హైదరాబాద్‌, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పడిపోయే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Severity of heart attacks
Severity of heart attacks
author img

By

Published : Nov 12, 2022, 7:01 AM IST

Severity of heart attacks: సాధారణంగా ఎదురయ్యే గుండెపోటు తీవ్రత కంటే ఈ కాలంలో ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. చలిగా ఉందనే కారణంతో నడక సహా ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లను వాయిదా వేయకుండా, సమయాల్లో మార్పు చేసుకొని కొనసాగించాలని సూచిస్తున్నారు.

గుండెపోటు ముప్పు ఎక్కువ
-డాక్టర్‌ రామక శ్రీనివాస్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, వరంగల్‌

..

చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం చిక్కబడుతుంది. శ్వాస నాళాలు కుదించుకుపోయినట్లే.. గుండెలోని రక్తనాళాలు కూడా ముడుచుకుపోతాయి. రక్తపోటులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా రక్తసరఫరా కోసం గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. రక్తంలో ‘కెటాకెలోమిన్స్‌’ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. దీంతో గుండె రక్తనాళాల్లో అప్పటికే పూడికలుంటే.. ఆ పూడికలపై రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారితీసే ప్రమాదముందని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.

గుండెజబ్బుల బాధితుల్లో 40 ఏళ్ల లోపు వారిలో ఈ ముప్పునకు ప్రధాన కారణం పొగాకు వాడకమేనని ఒక అధ్యయనంలో వెల్లడైంది. చలిని తట్టుకొనేందుకు కొందరు స్మోకింగ్‌, ఆల్కహాల్‌ను మోతాదుకు మించి తీసుకుంటుంటారు. గుండె వేగాన్ని, లయను నియంత్రించే నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడడం వల్ల గుండె స్పందనల్లో లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకొంటుంది. దీన్ని ‘అర్రిథ్‌మియా’ అని అంటారు.

ఈ పరిస్థితుల్లో చాలామంది తెలియకుండానే నిద్రలోనే చనిపోతుంటారు. యువతతో పోల్చితే వృద్ధుల్లో చలికాలంలో ఆకస్మిక మరణాలు ఎక్కువ. మహిళల కంటే పురుషుల్లో అధికంగా గుండెపోటు మరణాలను చూస్తున్నాం. కొందరిలో పొగమంచు, వాతావరణ కాలుష్యం కారణంగా ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవుతుంది. వీరిలోనూ గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయి.

గుండెపోటు రాకుండా ఉండాలంటే ధూమపానం ఆపేయాలి. మద్యాన్ని మోతాదుకు మించి తీసుకోవద్దు. చలికాలంలో కొలెస్ట్రాల్‌ స్థాయి కూడా పెరుగుతుంది. స్వల్ప మోతాదులో ఎక్కువసార్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. రక్తంలోని చక్కెరస్థాయుల్లోనూ హెచ్చుతగ్గులుంటాయి. గుండెజబ్బు, మధుమేహం, అధిక రక్తపోటుకు ఇప్పటికే మందులు వాడుతున్నవారు. డోసు హెచ్చుతగ్గులపై వైద్యుణ్ని సంప్రదిస్తే మంచిది.

వ్యాయామాన్ని మానేయొద్దు
-డాక్టర్‌ ప్రవీణ్‌ కులకర్ణి, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, కిమ్స్‌

..

శీతాకాలంలో రాత్రి పూట ప్రయాణాలు చేయొద్దు. రాత్రి 7 గంటలు దాటిన తర్వాత ఎక్కువ చలిగా ఉండే ఆహారాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోకపోవడమే మంచిది. ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీర్ఘకాలిక అలర్జీలు, ఆస్తమా, సైనసైటీస్‌లు ఎక్కువవుతాయి. జలుబు ఉన్న వారికి దూరంగా ఉండడం మేలు. మాస్కు తప్పనిసరిగా ధరించాలి.

ఈ కాలంలో కండరాలు, ఎముకలు, కీళ్లు బిగుసుకుపోతాయి. దీంతో కండరాలు, కీళ్లనొప్పులు ఎక్కువవుతాయి. చలికాలంలో రక్తనాళాలు కూడా సంకోచిస్తాయి. తద్వారా గుండె, మెదడుల్లో ఉన్నట్టుండి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర జబ్బుల బారినపడే ప్రమాదం పొంచి ఉంది. చలి తీవ్రతకు మధుమేహుల్లో వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు విజృంభిస్తాయి.

మహిళల్లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. చలి ఎక్కువగా ఉంటే మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచడానికి జీవక్రియలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆకలి ఎక్కువవుతుంది. ఒకవైపు చలి కారణంగా వ్యాయామాన్ని తగ్గించడం.. మరోవైపు ఎక్కువగా తినడం వల్ల బరువూ పెరుగుతారు. చలి సమయంలో కాకుండా ఇతర అనుకూల సమయాల్లో వ్యాయామం చేయాలి.

వీరు అప్రమత్తంగా ఉండాలి

..
  • ఇప్పటికే గుండెపోటు వచ్చి చికిత్స పొందుతున్నవారు
  • మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు
  • రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిసరైడ్‌లు ఎక్కువగా ఉన్నవారు
..
  • ధూమపానం చేసేవారు
  • శారీరక వ్యాయామానికి దూరంగా ఉండేవారు
  • నిల్వ ఆహారాలు, వేపుళ్లను ఎక్కువగా తినేవారు
  • స్థూలకాయులు
  • నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనేవారు
  • నిద్రలేమితో బాధపడుతున్నవారు
  • కుటుంబంలో గుండెజబ్బుచరిత్ర ఉన్నవారు

లక్షణాలను గుర్తించడమెలా?

  • ఛాతీ మధ్య, పై భాగంలో నొప్పి
  • దవడ లాగినట్లుగా ఉండడం
  • ఛాతీ నుంచి ఎడమ, కుడి చేతుల వైపు, గొంతు వైపు నొప్పి వ్యాపించడం
  • చెమటలు పట్టడం
  • శ్వాస తీసుకోవడం కష్టమవడం
  • ఛాతీ పట్టేసినట్లుగా బరువుగా ఉండడం
  • ప్రమాదకర జాబితాలోకి వచ్చే వారిలో చలికాలంలో ఈ లక్షణాలు స్వల్పంగా ఉన్నా సరే.. అత్యవసరంగా వైద్యుణ్ని సంప్రదించాల్సిందే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.