Lose Weight : కోరి తెచ్చుకోవడమో.. "కొనుక్కొని" తెచ్చుకోవడమోగానీ.. మొత్తానికి XL.. XXL సైజులు ఒంటి మీదికి తెచ్చిపెట్టుకుంటున్నారు జనం. తోటి వాళ్లు చెప్తేనో.. లేదంటే షాపింగ్ ట్రయల్ రూమ్ అద్దాలు చెప్తేనో గానీ.. అసలు సంగతి అర్థంకాదు. కంగారు అప్పుడు మొదలవుతుంది. ఏం చేసైనా సరే పొట్టమీద బరువు దించేసుకోవాలని ఆరాటపడతారు. పార్కులో జాగింగ్ లు, జిమ్ లో వర్కవుట్లు అంటూ నానా హడావిడి చేస్తారు. ఈ ఆవేశం వారం పదిరోజుల్లో చప్పున చల్లారిపోతుంది. పొట్టమాత్రం ఇంచు కూడా తగ్గదు. మళ్లీ మూడ్ వచ్చే వరకూ ఇదే పరిస్థితి! ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత.. పొట్టపై యుద్ధం చేయడం అనుకున్నంత ఈజీ కానట్టుంది అనుకొని.. ప్రయత్నమే వదిలేస్తుంటారు కొందరు. అయితే.. బరువు తగ్గడానికి ఇంతగా కుస్తీలు పట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ వారీ చేసే పనులతోనే పొట్టను "పొడి" చేయొచ్చు అంటున్నారు. మరి, ఆ వివరాలేంటో చూద్దామా..!
ఫోన్ పట్టుకోవద్దు :
Don't Use Phone : పక్కమీద కళ్లు తెరవగానే.. మంచం కూడా దిగకుండా మెజారిటీ జనం చేసే పని ఫోన్ పట్టుకోవడం. డేటా ఆన్ చేసి వాట్సాప్ తో మొదలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియా ప్రపంచంలో రౌండ్లు మొదలు పెడతారు. ఈ పని పక్కనపెట్టి.. జస్ట్ 5 నుంచి 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. మీరు కేటాయించే ఇంత తక్కువ సమయం.. మీకు రోజంతా ఉల్లాసాన్ని ఇస్తుందంటే నమ్మండి. అంతేకాదు.. రోజూవారి పనుల్లో వచ్చే ఒత్తిడి నుంచి మనసుకు రిలీఫ్ ఇవ్వడంలో సహాయపడుతుంది. (Weight Loss Tips) మైండ్ ఫ్రీ అయితే.. శరీరం లైట్ గా మారుతుందనే విషయం మీకు తెలుసా..? బాడీ లైట్ గా మారితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం తగ్గిపోవడం మొదలవుతుంది. అంత చిన్నపని ఎంత ఎఫెక్ట్ చూపుతుందో గమనించారా..!
Daytime Sleepiness Avoid Tips in Telugu : లంచ్ తరువాత నిద్రొస్తోందా బుజ్జీ..! ఇలా ట్రై చేయ్
లెమన్ వాటర్ :
Lemon Water : పక్కమీద నుంచి దిగిన తర్వాత లెమన్ జ్యూస్ తాగాలి. నిమ్మరసం అనగానే ముఖం చిట్లించాల్సిన పనిలేదు. గోరు వెచ్చని గ్లాసు నీటిలో.. సగం నిమ్మ రసం పిండి.. అందులో రుచికోసం ఓ స్పూన్ తేనె వేసి తాగేయండి. పులుపు + తీపి కలిసిన సూపర్బ్ టేస్ట్ గొంతు దిగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంత మేలు చేస్తుందో తెలుసా? మనిషి ఆరోగ్యానికి తినడం ఎంత ముఖ్యమో.. తిన్నదాన్ని బయటకు పంపడం అంతకన్నా ముఖ్యం. మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఇది చక్కటి మందు. (Tips for Weight Loss) రెస్ట్ రూమ్ లో పని ముగించడానికి.. బ్రేక్ ఫాస్ట్ కోసం జీర్ణవ్యవస్థను సిద్ధం చేయడానికి.. రెండిటికీ లెమన్ జ్యూస్ చక్కగా పనిచేస్తుంది.
Eno Good Or Bad : 'ఈనో' తాగడం మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారు?
బ్రేక్ ఫాస్ట్ :
Brake Fast : ఆలస్యంగా నిద్రలేచి.. ముఖ్యమైన టైమ్ మొత్తం సోషల్ మీడియాలో దుబారాచేసి.. చివరగా హడావిడిగా టిఫెన్ తినకుండా డ్యూటీకి వెళ్లిపోతుంటారు కొందరు. ఇది ఎంత ప్రమాదమో వారికి తెలియదు. భోజనానికీ భోజనానికీ మధ్య ఐదారు గంటలకు మించకూడదు. లేదంటే.. పొట్టలో రిలీజైన యాసిడ్స్.. పేగుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. రాత్రి ఎప్పుడో 8 గంటలకు తిన్నారని అనుకుందాం. టిఫెన్ చేయకుండా మధ్యాహ్నం 1 గంటకు లంచ్ చేస్తారని అనుకుందాం. అంటే.. కడుపులో భోజనం పడక 17 గంటల సమయం అవుతుందన్నమాట. పొట్టలోని యాసిడ్స్ పై పెట్రోల్ చల్లినట్టు టీ,కాఫీలు వేసేస్తుంటారు. ఇలాచేస్తే.. గ్యాస్ట్రిక్, అల్సర్ వంటివి రాకుండా ఎలాఉంటాయి? లోపల పరిస్థితి ఇలా ఉంటే.. పైకి మనిషి ఉల్లాసంగా ఎలా ఉంటాడు? కడుపులో జీవక్రియలు, ఇన్సులిన్ స్థాయిలు దెబ్బతినడంతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతాయి. ఈ పరిస్థితి లాంగ్ టైమ్ కొనసాగితే.. మెటబాలిక్ సిండ్రోమ్ కూడా వస్తుంది. ఈ భయంకరమైన సమస్యలకు సింపుల్ మెడిసిన్.. టిఫెన్ తినడం. చూశారా.. ఎంత సింపులో..? ఈ బ్రేక్ ఫాస్ట్ లో.. జీర్ణక్రియను హ్యాపీగా పనిచేసుకునేలా చూసే ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకుంటే మరింత మంచిదని సూచిస్తున్నారు.
జుట్టు, చర్మ సమస్యలకు ఉసిరితో చెక్! ఇమ్యూనిటీతో పాటు ప్రయోజనాలెన్నో
లంచ్ అండ్ డిన్నర్ :
Lunch And Dinner : మధ్యాహ్నం, రాత్రివేళ చేసే భోజనాన్ని.. ఒకే సమయానికి చేసేలా చూసుకోండి. కుదరట్లేదు అని మాత్రం అనకండి. కుదుర్చుకోవాలంతే. పని చేసేదే తిండికోసం.. తినడానికి టైమ్ లేదంటే ఎలా? నిత్యం ఒకే సమయానికి భోజనం చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్.. ఆ టైమ్ కు అలవాటు పడిపోతుంది. ఆ విధంగా.. పొట్టకు సైతం మనం క్రమశిక్షణ నేర్పిస్తాం. దీనివల్ల.. ఇతర సమయాల్లో అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరికలు కలగవు. (Healthy Tips for Weight Loss) శరీర బరువు పెరగడానికి ప్రధాన శత్రువు జంక్ ఫుడ్డే. టైమ్ కు భోజనం చేయకపోవడం వల్లే.. ఇవి తినాలనే కోరిక కలుగుతుంది. సో.. టైమ్ మెయింటెయిన్ చేస్తే.. ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్.
ఎక్సర్ సైజ్:
Exercise : ఒంట్లో కొవ్వు తగ్గడానికి వ్యాయామానికి మించిన దివ్య ఔషధం లేదని అందరికీ తెలిసిందే. అయితే.. ఆలోచన వచ్చిందే తడవుగా మొదలు పెట్టి, "ఆరంభ శూరత్వం"లా ముగించొద్దు. ఉదయం నిద్రలేవడానికి ఇబ్బంది పడేవారు.. వ్యాయామం చేయడానికి బద్ధకిస్తుంటారు. అసలు బద్ధకానికి కారణం ఏమంటే.. పైన చెప్పుకున్న పనులన్నీ సక్రమంగా చేయకపోవడం. ఇదంతా ఓ సైకిల్. అందుకే.. ముందుగా డైలీ రొటీన్ ను ఆర్డర్ లో పెట్టండి. ఆ తర్వాత ఉత్సాహంగా వ్యాయామం స్టార్ట్ చేయండి. సాయం కాలం కన్నా.. ఉదయం చేసే ఎక్సర్ సైజ్ శరీరంపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
Vitamin D Foods In Telugu : విటమిన్-డి లోపమా?.. ఈ ఫుడ్‌తో చెక్!
Heartburn VS Heart Attack : గ్యాస్ నొప్పికి, గుండెపోటుకి మధ్య తేడాలు ఏంటి? డాక్టర్లు ఏం అన్నారంటే..