ETV Bharat / sukhibhava

ఈ దినుసులతో రోగనిరోధక శక్తి మీ సొంతం..! - రోగనిరోధక శక్తి

కరోనా విజృంభణ తర్వాత ప్రజల ఆహార అలవాట్లలో భారీ మార్పులే వచ్చాయి. రోజూ తీసుకునే ఆహారంలో ఔషధ గుణాలున్న సుగంధద్రవ్యాల వాడకం పెరిగింది. మనం నిత్యం ఇంట్లో వాడే వంట దినుసులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని.. నిపుణులు చెబుతున్నారు. మరి ఆ దినుసుల వల్ల ఏమేమి ఉపయోగాలున్నాయో చూద్దామా..?

immunity boosting spices
రోగనిరోధక శక్తిని పెంచే దినుసులు
author img

By

Published : Aug 9, 2021, 6:19 PM IST

వంటిల్లే.. వైద్యశాల అని పూర్వీకులు చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనం నిత్యం వాడే వంట దినుసులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. వైరస్​లకు అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవి ఏంటో తెలుసుకుందాం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అల్లం: అల్లం అజీర్తికి మంచిది. కఫానికి దివ్య ఔషధం.

జీలకర్ర: జీలకర్రతో జీర్ణక్రియ వేగవంతమవుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

ఆవాలు: ఆవాలు శరీరంలోని కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

మిరియాలు: మిరియాలు శరీరంలోని కణాలను తాజాగా ఉంచుతాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. ఆకలిని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

మెంతులు: మెంతులలో రక్తాన్ని పలుచన చేసే గుణం వుంది. కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తాయి. మూత్రనాళ సంబంధిత సమస్యల్ని, శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి.

వాము: అజీర్ణం, కఫం, అధిక రక్తపోటుతో బాధపడే వారికి వాము అద్భుతంగా పనిచేస్తుంది.

పసుపు: పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ మందుగానూ పనిచేస్తుంది.

దాల్చినచెక్క: దాల్చినచెక్కతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది.

యాలకులు: యాలకుల్లో రక్తాన్ని పలుచన చేసే గుణం ఉంది. ఉబ్బసం, దగ్గు నుండి ఉపశమనాన్నిస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

లవంగాలు: లవంగాలు రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కఫం, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

వెల్లుల్లి: వెల్లుల్లి అనేక రుగ్మతలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తకణాల్లో కొలెస్ట్రాల్​ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఇదీ చదవండి: అమ్మాయిలూ ఒత్తిడికి గురవుతున్నారా.. అయితే ఇవి తినండి!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.