సైక్లింగ్ ద్వారా కణాల సామర్థ్యం పెరుగుతుంది. కణాల పనితీరు మెరుగైతే మరింత ఉత్సాహంగా తయారవుతారు. వార్ధక్యపు ఛాయలు కూడా దూరం అవుతాయి. మెదడు సామర్థ్యం పెరిగి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకూ కూడా దూరంగా ఉండొచ్చు.
- గంటసేపు సైకిల్ తొక్కడం వల్ల 400 నుంచి 1000 కాలరీల శక్తి ఖర్చవుతుంది. జీవక్రియల వేగం పెరిగి ఉత్సాహంగా ఉంటాం. కండరాలను దృఢంగా చేసి కొవ్వును కరిగిస్తుంది.
- అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి. శరీరావయవాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె కండరాలు బలంగా మారుతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
- మానసిక ఆనందం కూడా సొంతమవుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
- రోజూ అరగంట సైకిల్ తొక్కేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. పేగు, రొమ్ము క్యాన్సర్ కూడా దరిచేరవట.
ఇదీ చదవండి: జీవన శైలిని చక్కబెట్టుకో.. ఆరోగ్యాన్ని ఒడిసిపట్టుకో...