ETV Bharat / sukhibhava

వర్షాకాలంలో మీ చిన్నారుల ఆరోగ్యం జాగ్రత్త ఇలా!! - పిల్లల పెంపకం

వర్షాకాలం వచ్చిందంటే ఎండలవేడి తగ్గి కాస్త సేదతీరుతాం.. కానీ చల్లదనంతో పాటే వానలు రకరకాల ఆరోగ్య సమస్యల్ని కూడా వెంట తెస్తాయి. చిన్నారుల విషయంలోనైతే మరీనూ. ఈ సీజన్‌లో చిన్నపిల్లల్లో మలేరియా, కలరా, కామెర్లు, వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు.. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఈ సమయంలో చాలామంది పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనికి తోడు అసలే ఎక్కడ చూసినా కరోనా విజృంభిస్తోంది. కాబట్టి ఈ వర్షాకాలంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకీ ఉంది. మరి ఈ సీజన్‌లో చిన్నారులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఏంచేయాలో తెలుసుకోండి..

keeping your kids healthy during monsoon in telugu
వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం జాగ్రత్త!!
author img

By

Published : Jul 20, 2020, 1:41 PM IST

వర్షాకాలంలో ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటుంటారు. ఏదైనా కొంచెం మురికిగా ఉన్నా సరే.. క్రిములు శరీరానికి అంటుకుని రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దోమలు రాకుండా కిటికీలకు మెష్‌లు, ఇంటి చుట్టూ స్ప్రేలు.. లాంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే పిల్లల బెడ్ చుట్టూ దోమతెరలు కట్టడం మర్చిపోవద్దు.

మరిగించిన నీరే మేలు!

వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఎక్కువగా నీళ్ల వల్లే వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలకు ఏ నీళ్లు పడితే అవి ఇవ్వకుండా.. బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్న నీటిని అందించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల్ని బయట దొరికే నీరు, జ్యూసులు.. లాంటి పానీయాలకు దూరంగా ఉంచడం మంచిది.

బాగా కడగాలి..

వర్షాకాలంలో పిల్లలకు కూరగాయలు ఎక్కువగా పెట్టడం మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్రిములను, బ్యాక్టీరియాను నాశనం చేయడంలో తోడ్పడతాయి. అలాగే ఆకుకూరల్లో ఆకు పురుగులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకుకూరలైనా, కూరగాయలైనా.. వండే ముందు పరిశుభ్రంగా కడగటం చాలా ముఖ్యం.

వేడివేడిగా..

ఏ పూటకాపూటే వేడివేడిగా, శుభ్రంగా వండిన ఆహార పదార్థాలే పిల్లలకు పెట్టడం మంచిది. ఫ్రిజ్‌లో ఉంచాం కదా అని రెండు రోజుల కిందట తయారు చేసిన ఆహారం తింటే పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది.

దుస్తుల విషయంలో..

వర్షాకాలంలో పిల్లల శరీరాన్ని నిరంతరం పొడిగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వాళ్లు ఆడుకునేటప్పుడు వచ్చే చెమటను గ్రహించడానికి వదులుగా, పొడిగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి. ఒకవేళ పిల్లలు వానలో తడిస్తే.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తడి బట్టలను తీసేయాలి. ఎందుకంటే తడి బట్టల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో ఎప్పుడూ పొడిగా ఉండే దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే చర్మం కూడా పొడిగా ఉండేలా చూడటం ముఖ్యం. ఇంకా పిల్లల చెప్పులు, సాక్సులు, రెయిన్‌కోట్, గొడుగు శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టాలి.

గోళ్లు కొరుకుతున్నారా??

బయట ఎక్కువగా ఆడటం వల్ల పిల్లలకు గోళ్లలో మురికి చేరిపోతుంటుంది. వర్షాకాలంలో అయితే మరీనూ!! కాబట్టి పిల్లలు చేతులు నోట్లో పెట్టుకోకుండా, గోళ్లు కొరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఎందుకు చేయకూడదో ఒకటికి రెండుసార్లు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే బయటి నుంచి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్ని శుభ్రంగా కడగాలి.

అవసరమున్నప్పుడే..

కొంతమంది కట్ చేసిన పండ్లను ఎక్కడపడితే అక్కడ పెడుతుంటారు. పైగా వాటిపై కనీసం మూతలు కూడా పెట్టరు. దీంతో వాటిపై ఈగలు వాలి రకరకాల రోగాలను వ్యాపింపజేస్తాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం అంత మంచిది కాదు. కాబట్టి అవసరమున్నప్పుడే పండ్లను కట్ చేసుకోవడం మంచిది. అలాగే వండిన పదార్థాలపై నిండుగా మూతలు పెట్టడం చాలా ముఖ్యం.

ఆలస్యం చేయకుండా..

ఈ కాలంలో పిల్లలకు ఏదైనా జలుబు, జ్వరం.. లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి తాత్కాలిక ఉపశమనానికి సొంత వైద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది. అందులోనూ కరోనా విజృంభిస్తున్న వేళ- ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి సరైన వైద్యం చేయించి, చిన్నారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.