Sexually Transmittd Desease: కొంతమందికి సిఫిలిస్, గనేరియా లాంటి సుఖవ్యాధులు వస్తుంటాయి. వాటి కోసం పలు రకాల మందులు వాడుతూ ఉంటారు. ఒకవేళ దంపతులు సుఖవ్యాధుల బారిన పడితే వారికి పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని చాలామంది అనుకుంటుంటారు. దీనిపై డాక్టర్ల విశ్లేషణ ఎలా ఉందంటే..
సుఖవ్యాధుల కారణంగా పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యం రాదు. అంగవైకల్యానికి కారణం ప్రధానంగా జన్యుపరమైన కారణాలే ఉంటాయి. కొన్నిసార్లు వాడే మందులు కూడా ఇందుకు కారణం కావొచ్చు. ఫొలిక్ యాసిడ్, జింక్ లోపం వల్ల కూడా అంగవైకల్యం రావొచ్చు. అందుకే డాక్టర్ల సలహా లేకుండా గర్భిణీలు ఎలాంటి మందులు వాడొద్దు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:అలా చేస్తే సుఖ వ్యాధులు మాయమవుతాయా?