మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే పీసీఓఎస్ ఉందన్నారని చెప్పారు. పిల్లలు పుట్టకపోవడానికి పీసీఓఎస్ ఒక ముఖ్యమైన కారణం. మీరు మీ బరువెంతో రాయలేదు. సాధారణంగా బరువు పెరిగినప్పుడు పీసీఓఎస్ సమస్య ఇంకా ఎక్కువవుతుంది. అందుకని మీరు పూర్తిగా హార్మోన్ పరీక్షలు, వివరంగా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని పీసీఓఎస్‌కి చికిత్స మొదలుపెట్టండి. బరువు కనుక ఎక్కువగా ఉంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా అవసరం. పీసీఓఎస్‌లో ముఖ్యంగా అండం విడుదల కాదు కాబట్టి మీకు పిల్లలు కావాలనుకుంటే అండం విడుదల కోసం డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది.
పీసీఓఎస్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
హలో మేడం. నా వయసు 22. నాకు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. రెండేళ్ల క్రితం గర్భం ధరించినా.. వద్దనుకొని అబార్షన్ చేయించుకున్నా. అయితే నాకు గత కొన్ని రోజులుగా పిరియడ్స్ సరిగ్గా రావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు పీసీఓఎస్ ఉందని చెప్పారు. దీనివల్ల పిల్లలు పుడతారో లేదోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి