ETV Bharat / sukhibhava

గడ్డం, మీసాలు రాని వారు.. హస్త ప్రయోగం చేస్తే వస్తాయా?

హస్తప్రయోగం విపరీతంగా చేస్తే.. గడ్డం, మీసాలు రావా? అలా చేయడం అపేస్తే గడ్డం, మీసాలు వస్తాయా? అది నిజమైతే.. ఎన్ని నెలల పాటు హస్త ప్రయోగం ఆపేస్తే.. గడ్డాలు, మీసాలు వస్తాయి?

Is masturbation related to the absence of beards and mustaches?
గడ్డ, మీసాలు రాని వారు.. హస్త ప్రయోగం చేస్తే వస్తాయా?
author img

By

Published : Jun 26, 2022, 7:03 AM IST

హస్త ప్రయోగానికి సంబంధించి సమాజంలో ఇలా ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మంది తమ యుక్త వయసులోనే హస్త ప్రయోగానికి అలవాటు పడుతుంటారు. కొందరికి గడ్డం, మీసాలు రావడం ఆలస్యమవుతుంది. కొందరికి ఆరోగ్య కారణాల వల్ల అసలే రాకపోవచ్చు. ఈ క్రమంలో అలా గడ్డం, మీసాలు రాని వారు కొందరు.. హస్త ప్రయోగం వల్లేకు తమకు అవి రావడం లేదనే బాధతో డాక్టర్లు సంప్రదిస్తున్నారు. అయితే అందులో నిజమెంత? హస్త ప్రయోగానికి గడ్డాలు, మీసాలకు సంబంధం ఉందా? హస్త ప్రయోగం విపరీతంగా చేసుకుంటే.. గడ్డాలు, మీసాలు రావా? ఎన్ని నెలల ఆది చేయడం ఆపేస్తే.. అవి వస్తాయి?

హస్త ప్రయోగం నేపథ్యంలో వచ్చే అపోహలు పూర్తిగా అవాస్తవమని.. దాని వల్ల లాభాలే కాని.. నష్టాలు లేవని డాక్టర్లు, అధ్యయనాలు, నిపుణులు చెబుతున్నారు. గడ్డాలు, మీసాలు రావడానికి హస్త ప్రయోగానికి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన సమస్యల వల్లే.. గడ్డాలు, మీసాలు రాకపోవడానికి కారణమని వెల్లడించారు. గడ్డాలు, మీసాలు రావడానికి ఎలాంటి మందులు లేవని, దాని గురించి ఆలోచించించవద్దని సలహా ఇస్తున్నారు.

  • హస్త ప్రయోగం వల్ల వీర్య పల్చగా అవుతుందా? అలా అయితే పిల్లులు పుట్టరా? చిక్కగా కావాలంటే ఏం చేయాలి?

వీర్యం పల్చగా ఉన్నా.. చిక్కగా ఉన్నా పిల్లలు పుట్టడంలో ఇబ్బంది ఉండదని అంటున్నారు నిపుణులు. వీర్యం చిక్కగా కావడానికి ఎలాంటి మందులు ఉండవని చెబుతున్నారు. హస్త ప్రయోగానికి వీర్యం పల్చగా కావడానికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. అయితే బాగా పల్చగా ఉంటే మాత్రం సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారు డాక్టర్లను సంప్రదించాలని సలహా ఇచ్చారు.

గడ్డం, మీసాలు రాని వారు.. హస్త ప్రయోగం చేస్తే వస్తాయా?

ఇదీ చదవండి: కలయిక కుదరకపోతే మహిళ సర్జరీ చేయించుకోవాలా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.