యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకు హస్త ప్రయోగం చేసుకునే అలవాటు ఉంటుంది. ఇది అందరిలో ఉండకపోవచ్చు. అయితే.. స్త్రీలు కూడా భావప్రాప్తితో తృప్తి పడుతుంటారు. ఇలాంటప్పుడు వారికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా అబ్బాయిలు హస్త ప్రయోగం చేసుకునేటప్పుడు ఎన్నిసార్లు చేసుకోవాలి. వీర్యం ఎక్కువగా పోతే ప్రమాదమా?(Is Masturbation Harmful) అనే సందేహాలు కలుగుతుంటాయి. అసలు ఇలాంటివి చేయడం ప్రమాదమా(Is Masturbation Wrong)?, చేయకపోతే ఏదైనా లోపం ఉన్నట్లా? అనే సందేహాలు వస్తుంటాయి. వీటన్నింటికీ సమాధానమే ఈ స్టోరీ.
లోపమేంటి?..
హస్తప్రయోగం అనేది దాదాపు అందరు మగాళ్లూ చేస్తారు. యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు మరింత ఎక్కువగా చేస్తుంటారు. అయితే దీని వల్ల ఎలాంటి హాని జరగదు. ఆకలేసినప్పుడు అన్నం తినడం ఎంత సహజమో, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం ఎంత సహజమో, హస్త ప్రయోగం కూడా అంతే సహజం.
హార్మోన్ డిఫెక్ట్ లేదా మెదడు పనిచేయకపోవడం వంటి సమస్యలున్నవారు మాత్రమే హస్త ప్రయోగం చేయకుండా ఉంటారు. నూటికి 70 శాతం మంది ఆడవాళ్లు కూడా హస్తప్రయోగంతో తృప్తి పడుతుంటారని ఓ పరిశోధనలో తేలింది. పురుషుల్లోనూ నూటికి 98 శాతం మంది హస్త ప్రయోగం చేస్తుంటారని వెల్లడైంది.
ఇదీ చదవండి: