ETV Bharat / sukhibhava

కరోనా వేళ జిమ్​లు ఎంత సురక్షితం? - IS IT SAFE TO GOT GYM

లాక్​డౌన్​తో మూతపడ్డ వ్యాయామశాలలను అన్​లాక్​-3.0తో తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది. మరి దేశాన్ని కరోనా వైరస్​ పట్టపీడిస్తున్న తరుణంలో జిమ్​లకు వెళ్లడం సురక్షితమేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

Is it safe to go to the gym during the coronavirus pandemic?
కరోనా వేళ జిమ్​లు ఎంత సురక్షితం?
author img

By

Published : Jul 27, 2020, 5:30 PM IST

కరోనా కారణంగా వ్యాయామశాలలు దాదాపు నాలుగు నెలల క్రితం మూతపడ్డాయి. అయితే ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న అన్​లాక్​-3.0తో జిమ్​లు తెరుచుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో వైరస్​ కేసులు బయటపడుతున్న తరుణంలో జిమ్​కు వెళ్లడం మంచిదేనా?

వాటిపైనే ఆధారపడి ఉంది..

మీరు నివసిస్తున్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న జిమ్​లో సిబ్బంది తీసుకునే జాగ్రత్తలపైనే అంతా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నియంత్రణ చర్యలు సరిగ్గా లేని ప్రాంతాల్లోని ప్రజలు జిమ్​కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు. అయితే వైరస్​ కట్టడి చర్యలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు వ్యాయామశాలలకు వెళ్లొచ్చని చెబుతున్నారు.

ఇదీ చూడండి:- అన్‌లాక్‌ 3.0: ఆంక్షల 'తెర' తొలగుతోంది!

జిమ్​ ఇలా ఉంటే హాయే...

ప్రతి ఒక్కరు కనీసం 6 అడుగుల దూరం పాటించేందుకు వీలుగా జిమ్​ సిబ్బంది ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే ప్రత్యేక పరికరాలతో కదలికలను పరిమితం చేయాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రజలను లోపలకు అనుమతించాలి. వ్యాయామాలకు సంబంధించిన పరికరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

జిమ్​లో రద్దీపై వ్యక్తిగతంగా కాకుండా ఆన్​లైన్​లో చూసుకునేందుకు వ్యవస్థను ఏర్పాటు చేస్తే మంచిదని అమెరికాలోని రోగ నియంత్రణ, నివారణ కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా సాధ్యమైనప్పుడల్లా జిమ్​ లోపల కాకుండా ఆరుబయట వ్యాయామాలు చేయాలని సూచించింది.

మీరు చేయాల్సినవి...

లాకర్ రూమ్స్​ వాడకపోవడం, సొంతంగా నీళ్ల సీసా తీసుకెళ్లడం, శానిటైజర్లను వాడటం వల్ల వైరస్​ సోకే ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. జిమ్​ లోపల కూడా మాస్కులు ధరించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. అవి చెమటతో తడిసిపోయే అవకాశముండటం వల్ల మరో మాస్కును వెంటతీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జిమ్​లు ప్రమాదకరమేనని అంటున్నారు నిపుణులు. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం కష్టమని చెబుతున్నారు. అందువల్ల జిమ్​కు వెళ్లకుండానే.. ఇంటి బయట చమటోడ్చటం శ్రేయస్కరమన్నది వారి మాట.

ఇవీ చూడండి:- టైటానిక్ ప్రేమికులు పెట్టుకున్నారు మాస్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.