ETV Bharat / sukhibhava

Diabetes: షుగర్‌ వ్యాధిగ్రస్థులకు తియ్యటి వార్త!... ఎలుకలపై విజయవంతం - హైదరాబాద్​ జిల్లా వార్తలు

మధుమేహ వ్యాధిగ్రస్థులకు కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ పరిశోధకులు తీపి కబురు తెలిపారు. ఇన్సులాక్‌’ మాలిక్యూల్‌తో గడ్డకట్టని ఇన్సులిన్​ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎలుకలపై ప్రయోగించి విజయం సాధించినట్లు తెలిపారు. దీనిని రిఫ్రిజిరేటర్​లో పెట్టకుండానే నిల్వ చేసుకోవచ్చని...వ్యయం సైతం తగ్గుతోందని ఐఐసీటీ పరిశోధకులు పేర్కొన్నారు.

Diabetes
Diabetes
author img

By

Published : Oct 7, 2021, 10:30 AM IST

మధుమేహం (చక్కెర వ్యాధి) తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్‌ తీసుకోవడం సర్వసాధారణం. ఇన్సులిన్‌ పాడవకుండా రిఫ్రిజరేటర్‌లో భద్రపర్చాలి. లేదంటే కొన్ని గంటల తర్వాత గడ్డకట్టి పనికిరాకుండా పోతుంది. ఈ సమస్య పరిష్కారానికి కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ(ఐఐసీబీ) పరిశోధకులు ఓ సరికొత్త మాలిక్యూల్‌ని గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతలోనూ ఇన్సులిన్‌ని గడ్డకట్టకుండా ఉంచే ఈ మాలిక్యుల్‌కు ‘ఇన్సులాక్‌’ అని పేరు పెట్టారు. దీనిని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ)లో న్యూక్లియర్‌ మాగ్నటిక్‌ రెసోనెట్స్‌(ఎన్‌ఎంఆర్‌) ల్యాబ్‌లో పరీక్షించారు. ఇన్సులిన్‌లో ఇన్సులాక్‌ కలిపిన తర్వాత దాని నిర్మాణాన్ని త్రీడీలో పరీక్షించి సాధారణ ఉష్ణోగ్రతలోనూ గడ్డకట్టడంలేదని గుర్తించారు. అనంతరం కోల్‌కతాలోని ఐఐసీబీలో ఎలుకలపై ప్రయోగించారు. ఆ పరీక్షలు విజయవంతం కావడంతో.. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ప్రఖ్యాత జర్నల్‌ ‘ఐసైన్స్‌’లో ఇటీవల ప్రచురితమైంది.

ధరలు తగ్గే అవకాశం

‘ఔషధ కంపెనీలు ముందుకొస్తే అన్ని అనుమతులు తీసుకుని క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయ్యి అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతుంది. ఆ కొత్త ఇన్సులిన్‌ను ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చు. వ్యయం తగ్గుతుంది’ అని ఐఐసీటీ నుంచి పరిశోధనలో పాలుపంచుకున్న ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.జగదీశ్‌, మరో శాస్త్రవేత్త డాక్టర్‌ జితేందర్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: Camphor uses : కర్పూరం ప్రయోజనాలేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.