ETV Bharat / sukhibhava

Immunity Increase Food In Telugu : మీ రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్​ ఫుడ్స్'​ ఇవే!

Immunity Increase Food In Telugu : తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారంటే రోగ నిరోధక శక్తి సరిగ్గా లేదని అర్థం. మరి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Immunity Increase Food In Telugu
Immunity Increase Food In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 9:57 AM IST

Immunity Increase Food In Telugu : ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు శరీరం తట్టుకొని నిలబడాలి. ఇందుకు రోగనిరోధక శక్తి ఎంతో కీలకం. మరి రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏటువంటి ఆహారాలు తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఇవి మన ఒంట్లో రోగనిరోధక శక్తి పెంచుతాయి. మరి మన శరీరంలో ఇమ్యునిటీ పవర్​ను పెంచే 'సూపర్​ ఫుడ్స్'​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అవగాహన కలిగి ఉండాలి..!
ఆహారమే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే సమతుల ఆహారం వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కలిగినా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏయే ఆహారాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అనేదానిపై అవగాహన కలిగి ఉండాలి.

సమతుల ఆహారం తీసుకోవాలి..!
వర్షాకాలం వచ్చిందంటే చాలామంది తరచుగా జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. ఇలాంటి వ్యాధులు రాకుండా, ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకోవాలంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం సమతుల ఆహారం తీసుకోవాలి.

సహజ పద్ధతుల్లో విటమిన్లు తీసుకోవాలి..!
విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చాలామంది జలుబు చేసినప్పుడు సి-విటమిన్ టాబ్లెట్​లు వేసుకుంటారు. ఇందుకు కారణం సి-విటమిన్ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదే సహజసిద్ధమైన పద్ధతుల్లో సి-విటమిన్​ను ఆహారం ద్వారా తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలుంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు..!
నిమ్మ, ద్రాక్ష, నారింజ, ఎరుపు రంగు క్యాప్సికంలో సి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఎరుపు రంగు క్యాప్సికంలో బీటా కెరోటిన్ అనే పోషకం కూడా ఉంటుంది. దీనిని మన శరీరం ఏ విటమిన్​గా మార్చుకుంటుంది. బ్రకోలీలో కూడా ఏ, సి, ఈ విటమిన్లు లభిస్తాయి. ఇందులోని పీచు పదార్థాసు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పసుపు..!
పసుపులోని కర్క్యుమిన్​కు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంటుంది. ఇది రోగకారక సూక్ష్మజీవులను చంపే మైక్రోబియల్ లక్షణం కలిగి ఉండటం వల్ల వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

నిమ్మకాయ..!
మన శరీరం సి-విటమిన్​ను సొంతంగా తయారు చేసుకోలేదు. అలాగే శరీరంలో నిల్వ కూడా చేసుకోలేదు. కాబట్టి రోజూ తీసుకునే ఆహారంలో సి-విటమిన్​ ఉండేలా చూసుకోవాలి. ఉదయం వేడినీళ్లు, లెమన్ వాటర్, నిమ్మకాయ నీళ్లల్లో​ తేనె, మిరియాలు కలుపుకుని తాగితే కూడా సత్ఫలితాలు ఉంటాయి.

అల్లం-వెల్లుల్లి..!
వెల్లుల్లిలోనూ ఇన్ఫెక్షన్​లపై పోరాడే గుణం ఉంటుంది. ఇవి రక్తనాళాలను గట్టి పడకుండా, మృదువుగా ఉంచుతుంది. అలాగే శరీరంలో వాపు, మంట లాంటి లక్షణాలపై పోరాడే గుణం అల్లంలో ఉంటుంది. ఇది గొంతు నొప్పి రాకుండా కూడా చూస్తుంది. అలాగే పాలకూర, గ్రీన్ టీ, బొప్పాయిలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పెరుగు-పండ్లు..!
మాంసాహారులైతే వారానికోసారి చేప, చికెన్ తీసుకోవచ్చు. పెరుగులోనూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంటుంది. పెరుగులో పండ్లు, తేనె కలుపుకొని తింటే మరింత రుచికరంగా ఉంటుంది. పెరుగులో డి-విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

ఆహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతా ముఖ్యమే..!
బాదం పప్పులో ఇన్ఫెక్షన్లపై పోరాడే గుణం ఉంటుంది. అవకాడో, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, కివీ పండ్లు, చికెన్, పీతలు ఆహారంగా తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే ఆహారం కూడా వేడివేడిగా తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోనూ ఇన్ఫెక్షన్లు, వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు. తగు జాగ్రత్తలు, సముతుల ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. ఏదైనా అనారోగ్యం కలిగినా త్వరగా కోలుకోవచ్చు.

మీ రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్​ ఫుడ్స్'​ ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.