How To Use Dragon Fruit For Skin Health : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్‌కు డిమాండ్ పెరిగిపోయింది. దీనికి రేటు ఎక్కువగా ఉన్నా కూడా జనాలు కొనేందుకు ముందుకొస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్(Dragon Fruit) ఒక ఉష్ణమండల పండు. ఈ పండు రుచికరమైనదే కాకుండా చాలా పోషకాలున్నది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వంటివి అధికంగా ఉంటాయి. ఈ పండు శరీరం లోపలి నుంచి శక్తిని అందించడంతోపాటు.. బయట నుంచి అందాన్ని పెంచడంలోనూ తోడ్పడుతుందట! మరి ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ముఖానికి ఎలా ఉపయోగించాలి? దాని వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Dragon Fruit Benefits for Skin : డ్రాగన్ ఫ్రూట్ ఒక అద్భుతమైన సహజ చర్మ సంరక్షణ పదార్ధమని నిపుణులు చెబుతున్నారు. ఇది ముడతలు తగ్గించడానికి, చర్మపు రంగును మెరుగుపరచడానికి, యాంటీఆక్సిడెంట్ రక్షణను అందించడానికి ఎంతో సహాయపడుతుందట. మీ బ్యూటీ రొటీన్‌లో ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని జోడించడం వల్ల మీ చర్మాన్ని అందంగా చేసుకోవచ్చని చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్(Dragon Fruit Face Pack) అనేది మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి.. తేమను పునరుద్ధరించడానికి ఒక సహజ మార్గంగా చెబుతున్నారు. దీనిలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
Dragon Fruit Benefits in Telugu : డ్రాగన్ ఫ్రూట్ యాంటీ ఏజింగ్(anti ageing) లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ఫేస్ ప్యాక్‌కి అద్భుతంగా పనిచేస్తుందట. అలాగే చర్మంపై మంటను తగ్గించడంలో.. ఆయిలీ స్కిన్‌ను నియంత్రించడంలోనూ సహాయపడుతుందట. మొటిమల బారినపడే చర్మానికి డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ.. ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Pimples Removal Tips : మొటిమల సమస్యా?.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్!
Follow These Steps to Using Dragon Fruit for Skin Care :
చర్మ సౌందర్యం కోసం డ్రాగన్ ఫ్రూట్‌ను ఎలా ఉపయోగించాలంటే..?
- మొదట మీరు పండిన డ్రాగన్ ఫ్రూట్‌ని ఎంచుకోవాలి.
- ప్రకాశవంతమైన గులాబీ లేదా ఎరుపు రంగును కలిగి ఉన్న.. స్పర్శకు మృదువుగా అనిపించే పండు అయితే బెటర్.
- ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్‌ను సగానికి కట్ చేసి లోపలి భాగాన్ని తీయండి. దీనిపైన పొట్టు, లోపలి విత్తనాలను పక్కకు పెట్టండి.
- అనంతరం డ్రాగన్ ఫ్రూట్ లోపలి భాగాన్ని పేస్ట్‌గా చేసుకోవాలి.
- ఇప్పుడు ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి.
- ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగి, శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి.
- డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్ ఉపయోగించిన తర్వాత మీ ముఖానికి మాయిశ్చరైజర్ లేదా సహజ నూనెను రాయాలి.
అయితే.. మీరు డ్రాగన్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్‌కి(Dragon Fruit Face Pack) అదనపు ప్రయోజనాలను అందించడానికి ఇతర పదార్థాలను కూడా యాడ్ చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొన్ని చుక్కల బాదం లేదా కొబ్బరి నూనె లాంటివి ఉపయోగించొచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగిస్తే మంచిదట. రెగ్యులర్ వాడకంతో మీ స్కిన్ టోన్ మారిపోవడం గమనిస్తారని చెబుతున్నారు. ఇలా.. డ్రాగన్ ఫ్రూట్‌ని వాడి మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
Tips For Glow Skin : పసుపు,పెరుగు, శెనగపిండితో ఈజీగా ఫేస్‌ప్యాక్.. మొటిమలు, ముడతలకు చెక్!
క్వీన్ ఆఫ్ ద నైట్.. డ్రాగన్ ఫ్రూట్...
Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్‌కు డోకా ఉండదు!