Homemade Mouthwash for Good Oral: శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే నోటి పరిశుభ్రత విషయంలో కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అయితే చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ సమస్య వల్ల నలుగురిలోకి వెళ్లాలన్న వెళ్లలేని పరిస్థితి. దీంతో నోరును ప్రెష్‌గా ఉంచుకోవడానికి బయటి మార్కెట్లో లభించే మౌత్ వాష్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మౌత్ వాష్‌లు అందరికీ ఒకే లాంటి ఫలితాలను ఇవ్వవు. అలాంటి సందర్భాల్లో టెన్షన్ పడకుండా.. కేవలం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో నేచురల్‌గా మౌత్ వాష్‌లు రెడీ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇవి అందరికి ఉపయోగకరంగానే ఉంటాయంటున్నారు. మరి అవి ఏంటి..? ఈ మౌత్‌వాష్‌ల వల్ల కలిగే లాభాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
ఇంట్లోనే మౌత్వాష్లను ఎలా రెడీ చేసుకోవాలంటే..
పసుపు: ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. దీంతో తయారు చేసిన మౌత్ వాష్ ఉపయోగిస్తే నోటి పూత, అల్సర్ వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ మౌత్ వాష్‌ను ఎలా తయారు చేయాలంటే..
- ముందుగా 4 లవంగాలను కప్పు నీటిలో నానబెట్టాలి.
- దానిలో పసుపు, అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి.
- అంతే మౌత్ వాష్ ఉపయోగించేందుకు సిద్ధమైంది. దీనిని నోట్లో వేసుకుని కనీసం 30 సెకన్లు పుక్కిలించి.. ఊసేయాలి.
- ఇలా రెగ్యూలర్‌గా చేస్తే నోటి అల్సర్ సమస్య దూరమవుతుంది.
సాల్ట్ వాటర్: నోటి శుభ్రతలో ఉప్పు నీరు ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. ఇది నొప్పి, చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉప్పులోని సోడియం కంటెంట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. దంతాల నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. ఈ వాటర్ ఎలాగంటే..
- ఒక టీస్పూన్ ఉప్పును.. గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలపితే మౌత్‌వాష్ రెడీ.
- ఈ నీటిని నోట్లో పోసుకుని కనీసం అరనిమిషం పుక్కిలించి.. ఊయాలి.
- ఇలా రోజుకు 2-3 సార్లు చేయవచ్చు. అయితే రెగ్యులర్‌గా కాకుండా వారంలో రెండు రోజులు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
మీ పిల్లలు రోజూ బ్రష్ చేస్తున్నారు కరక్టే - ఇలా చేస్తున్నారా? - లేదంటే పుచ్చిపోవడం ఖాయం!
ఆపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్ చెడు బ్యాక్టీరియాతో పోరాడి దంత క్షయాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఉంటాయి. ఇది నోటి ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ఈ మౌత్‌వాష్ కోసం..
- ఒక గ్లాస్ నీటిలో.. రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి.
- తర్వాత నోట్లో పోసుకుని.. ఓ నిమిషం పాటు పుక్కిలించి.. ఊసేయాలి.
- ఈ మౌత్‌వాష్‌ని వారంలో మూడు సార్లు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..
ఎన్ని నెలలకు బ్రష్ మార్చాలి?.. ఎంతసేపు పళ్లు తోముకోవాలి?
కొబ్బరి నూనె: నోటి ఆరోగ్యానికి కొబ్బరి నూనె కూడా చాలా మంచిది. ఆయిల్ పుల్లింగ్ అంటూ ఎన్నో ఏళ్లుగా కొబ్బరి నూనె నోటి సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. కానీ దీనికోసం మీరు ప్యూర్ కొబ్బరి నూనె వాడితే బెస్ట్ రిజల్ట్ లభిస్తుంది. ఈ మౌత్ వాష్ కోసం..
- ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను నోటిలో పోసుకుని ఓ పది నిమిషాలు పుక్కిలించాలి.
- తర్వాత నూనెను ఊసి.. నీళ్లతో నోరు క్లీన్ చేసుకోవాలి.
- రోజూ బ్రష్ చేసేముందు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.
How To Avoid Teeth Stains : మీ దంతాలు పాలలా తెల్లగా మెరవాలా? ఈ చిట్కాలు మీకోసమే!
సోడా, సాల్ట్: నోటి దుర్వాసన తగ్గించడానికి, చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి ఉపశమనం అందిస్తుంది. దీని కోసం..
- అర టీస్పూన్ బేకింగ్ సోడా, అర చెంచా ఉప్పును ఓ గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలపాలి.
- తర్వాత నోటిలో పోసుకుని ఓ నిమిషం పుక్కిలించి ఊయాలి.
- రోజుకు 3-4 సార్లు ఇలా చేయవచ్చు.
- అయితే ప్రతిరోజూ కాకుండా వారంలో రెండు సార్లు చేయవచ్చు.
చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!
పుదీనా: పుదీనా ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ మౌత్ వాష్ కోసం..
- కొన్ని పుదీనా ఆకులను ఓ గ్లాస్ నీటిలో ఉడకబెట్టాలి.
- చల్లారిన తర్వాత ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవచ్చు. లేదా కొన్ని పుదీనా ఆకులను నమలడం కూడా మంచిదే.
నిమ్మకాయ రసం: నిమ్మకాయలోని విటమిన్ సి నోటిలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కానీ ఇది కొంచెం ఎసిడిక్ కాబట్టి నీటితో కలిపి నోటిలో పుక్కిలించాలి. ఒక టీస్పూన్ నిమ్మకాయ రసాన్ని గ్లాస్ నీటిలో కలిపి, నోరు శుభ్రం చేసుకోవాలి. అయితే, రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు చేయకూడదు.
హోమ్మేడ్ మౌత్ వాష్ వల్ల కలిగే ప్రయోజనాలు :
- ఫ్లాసింగ్, బ్రషింగ్ వంటివి నోటి శుభ్రతకు దోహదం చేస్తాయి.
- కావిటీస్ తగ్గించడంలో సహాయపడుతుంది.
- దంతాలు ,చిగుళ్లను బలపరుస్తుంది. శ్వాసను ఫ్రెష్‌గా చేస్తుంది.
- పళ్ల పై ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది.
- నోటి పుండ్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
పంటి నొప్పితో బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్కు చెక్!
బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి!