ETV Bharat / sukhibhava

'తీపి' యావను దూరం పెట్టే.. తియ్యటి కబురు! - replacement for sweet items

స్వీట్లు చూస్తే చాలు నోరూరిపోతుంది. తియ్యటి శీతల పానీయాలు, టీ, కాఫీలు కనిపిస్తే డైటింగ్​ కట్టుబాట్లన్నీ తెంచుకుని తాగేయాలనిపిస్తుంది. ఇక మధుమేహం ఉన్నవారు ఎంత వద్దనుకున్నా పదే పదే తీపి పదార్థాల ధ్యాసే మదిలో మెదులుతుంది. ఫలితంగా అనారోగ్యం తలుపుతడుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? కచ్చితంగా ఉందంటున్నారు డాక్టర్​ దివ్యా గుప్తా. అదేంటో తెలుసుకుందాం రండి...

How to curb sugar cravings during lockdown
'తీపి' యావను దూరం పెట్టే.. తియ్యటి కబురు!
author img

By

Published : Jun 8, 2020, 9:24 AM IST

లాక్​డౌన్​ వేళ ఆరోగ్యకరమైన జీవనశైలివైపు అడుగులు వేస్తున్న సమయంలో తీపి యావ(షుగర్​ క్రేవింగ్స్​ను) తగ్గించుకునే మార్గాన్ని సూచిస్తున్నారు.. ప్రముఖ న్యూట్రీషనిస్ట్​ డాక్టర్​ దివ్యా గుప్తా. చక్కెర పదార్థాలను తినాలనే కోరికకు ఎలా చెక్​ పెట్టాలో ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

నీటితో తీపికి చెక్​​..

నీటిని పదే పదే తాగుతుండడం వల్ల శరీరం హైడ్రేట్​ అవుతుంది. దీంతో తీపిపై వ్యామోహం తగ్గుతుంది.

ప్రోటీన్ ఉండగా చక్కెరేలా?

అధికంగా ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. పనీర్, ఉడకబెట్టిన గుడ్లు, టోఫూ, పెరుగు, చికెన్​ వంటి పదార్థాలు తినడం వల్ల శరీరానికి చక్కెర పదార్థాల అవసరం తగ్గుతుంది.

యాపిల్ సైడర్​ తాగితే... ​

యాపిల్ సైడర్​ వెనిగర్​.. రోజూ కొద్ది మోతాదులో తీసుకుంటే, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. పెద్ద బాటిల్​ నిండా నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల యాపిల్​ సైడర్ వేసుకుని సమయానుకూలంగా తాగాలి. ఇలా చేయడం వల్ల షుగర్​​ క్రేవింగ్ కొంతమేర​ తగ్గుతుంది.

పండుతో తృప్తిపడు..

షుగర్​ క్రేవింగ్​ ఎక్కువగా ఉన్నవారు వీలైనన్ని ఎక్కువ పండ్లు తీసుకోవాలి. దీంతో శరీరానికి విటమిన్లు, మినరల్స్​ లభిస్తాయి. తీపి పదార్ధాలు తినాలనిపించినప్పుడు ఓ తియ్యటి పండును తినేయండి. దీంతో మీ కోరిక తీరుతుంది, ఆరోగ్యమూ చేకూరుతుంది. సీజనల్​ పండ్లను తీసుకుంటే మరీ మంచిది.

ఆ చిరుతిళ్లు మేలు..

నిజానికి చిరుతిళ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనం రోజూ ప్రోటీన్లు, ఫైబర్​, కొవ్వు పదార్థాలు ఎన్ని తీసుకున్నా.. చక్కెర పదార్థాలున్న చిరుతిళ్లు తినడం వల్ల ఫలితం లేకుండా పోతుంది. అయితే, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినడం మాత్రం మంచిదేనంటున్నారు డా. దివ్యా. స్నాక్స్​లో చాక్లెట్​, చిప్స్​ బదులు.. వేరు శనగలు, డ్రైఫ్రూట్స్​, మఖానాలు, తాజా పండ్లు, పేలాలు వంటి హెల్తీ ఫుడ్​ తింటే మంచిది.

పీచు తిను.. తీపి వీడు

పీచు పదార్థాలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో, చక్కెర పదార్థాలపై మనసు లాగదు. పళ్లు, కూరగాయలు, ఓట్స్, చపాతీలు తీసుకోవడం మంచిది. వాటితో పాటు హెల్తీ సూప్​, సలాడ్​లు తీసుకుంటే షుగర్​ క్రేవింగ్స్​ చాలా వరకు అదుపులోకి వస్తాయి.

ఇదీ చదవండి: హెర్బల్​ చాయ్..​ ఆరోగ్యానికి ఎంతో హాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.