How To Control Hiccups In Telugu : మనుషులకు సాధారణంగా అప్పుడప్పుడు వెక్కిళ్లు వస్తూ ఉంటాయి. కాసిన్ని నీళ్లు తాగినా లేదంటే గుక్కతిప్పుకోకుండా నీళ్లు తాగినా తగ్గిపోతాయి. అయితే కొంతమందికి మాత్రం అంత సులభంగా తగ్గకపోవచ్చు. కాగా వెక్కిళ్లు ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి? వస్తే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలను ఇక్కడ వివరంగా చర్చిద్దాం.
వెక్కిళ్లు ఎందుకు వస్తాయి?
Why Hiccups Occur Frequently : మానవ శరీరంలోని ఊపిరితిత్తుల కింద ఉండే డయాఫ్రం అనే కండరం సంకోచించడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి చేరుతుంది. దీంతో స్వరపేటిక హఠాత్తుగా మూసుకుపోయ వెక్కిళ్లు వస్తాయి.
వెక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి?
Reasons For Hiccups : మనం తినే ఆహారం, ఆరోగ్య సమస్యలు వెక్కిళ్లు రావడానికి కారణాలు కావచ్చు. అధికంగా తీసుకునే మసాలాలు, అధిక మొత్తంలో ఆల్కహాల్, ఎసిడిటీ సమస్య, వేగంగా తినడం, ఎక్కువ కారం తినడం లాంటివి వెక్కిళ్లకు కారణం కావచ్చు. కొంతమందికి పేగుల వల్ల అరుదుగా వెక్కిళ్లు వస్తుంటాయి.
వెక్కిళ్లు తగ్గడానికి ఏం చేయాలి?
What To Do When Hiccups Keep Coming Back : వెక్కిళ్లు వచ్చినప్పుడు మోకాలిని పైకి ఎత్తి ఛాతి వరకు తీసుకువచ్చి, ముందుకు వంగి కాసేపు ఊపిరిని బిగబట్టడం చేస్తే అవి తగ్గుతాయి. అలాగే చిటికెడు పంచదారని నాలుక మీద వేసుకొని 5-10 సెకన్లు అలాగే ఉంచుకొని తర్వాత మింగాలి. ముక్కు మూసుకొని నీళ్లు తాగడం కూడా వెక్కిళ్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక చేతి బొటన వేలితో మరో చేయి అరచేతిని నొక్కడం, నిదానంగా గోరు వెచ్చటి నీటిని తాగడం, చల్లని నీటితో పుక్కిలించడం, నాలుక కొనను బయటకు లాగడం లాంటి వాటి వల్ల కూడా వెక్కిళ్లు తగ్గుతాయి.
వెక్కిళ్ల నుండి జాగ్రత్తగా ఉండటానికి చర్యలు..
How To Control Hiccups Naturally : కారం లేదంటే మసాలాలను చాలా వరకు తగ్గించాలి. నిమ్మకాయ రసాన్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.