ETV Bharat / sukhibhava

వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తున్నారా? - helath tips

చిన్న వయసులోనే మీరు పెద్ద వయసున్న వ్యక్తిలా కనిపిస్తున్నారా? దానిని మార్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే.

how to change premature age look
హెల్త్ టిప్స్
author img

By

Published : Aug 26, 2021, 7:03 AM IST

కొందరు తమ వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. అందుకు కారణాలు ఏంటి? ఆ సమస్యను ఎలా అధిగమించాలి అంటే?

* ఒత్తిడి.. దీని ప్రభావం మొదట పడేది ముఖం (చర్మం) మీదే. ఆందోళన ఎక్కువైతే కార్టిసోల్‌ అదే పనిగా విడుదలై ప్రీమెచ్యూర్‌ ఏజింగ్‌కు కారణమవుతుంది. అధిక ఆందోళన, ఒత్తిడి వల్ల చర్మంపై గీతలు, ముడతలు త్వరగా వస్తాయి. యోగా, వ్యాయామం, నడక, స్నేహితులతో సరదగా గడపడం వంటివి చేయాలి.

* సబ్బు.. దీంట్లోని గాఢ రసాయనాలు చర్మంలోని సహజ నూనెలను పీల్చేస్తాయి. దాంతో చర్మం నిర్జీవంగా మారి గీతలు, ముడతలు కనిపిస్తాయి. అప్పుడూ పెద్దవారిలా కనిపిస్తారు. అందుకే తక్కువ గాఢత ఉండే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం తాజాగా ఉంటుంది.

* నిద్రలేమి.. తగినంత నిద్రపోయినప్పుడు మాత్రమే శక్తిని పుంజుకోగలుగతాం. మనం నిద్రపోతున్న సమయంలో చర్మం మరమ్మతులు చేసుకుంటుంది. నిద్రలేమి వల్ల అది తనను తాను రీజెనువేట్‌ చేసుకోలేదు. ఫలితంగా ముఖంపై ముడతలొస్తాయి. రోజుకు కనీసం ఏడెనిమిది గంటలపాటు కంటినిండా నిద్రపోవాలి.

* ఎక్కువగా చక్కెరలు.. కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌లు చర్మానికి స్థితిస్థాపకతను కలిగించి యౌవ్వనంగా ఉండేలా చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చక్కెర, గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకున్న వారిలో ఈ రెండింట్లో అమైనో ఆమ్లాలు కలిసి వాటిని దెబ్బతీస్తాయి. ఫలితం శరీరం సహజ మరమ్మతులకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి తీపిని తగ్గించడం మంచిది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.