ETV Bharat / sukhibhava

పండ్లు, కూరగాయలు తాజావే ఇలా కొందాం..! - Latest news in Telangana

కొంత మందికి మార్కెట్లో పండ్లు, కూరగాయల్ని ఎలా ఎంచుకోవాలో తెలియదు.  అమ్మే వ్యక్తి ఏం ఇస్తే అవి తీసేసుకుంటారు. తీరా ఇంటికి వెళ్లి చూస్తే వాటిల్లో కొన్ని పాడైపోయుంటాయి. మరి కొందరేమో చకచకా ఏరేస్తారు. మరి వాళ్లకెలా తెలుస్తుంది అంటారా? ఇదిగో ఇలా..

How to buy fresh fruits, vegetables
How to buy fresh fruits, vegetables
author img

By

Published : Apr 23, 2021, 12:11 PM IST

పండ్లు... పుచ్చకాయ తీసుకునేటప్పుడు దాని పైన తట్టండి. డొల్ల శబ్దం వస్తే సరి. గట్టి శబ్దం వస్తే తీసుకోవద్దు. యాపిల్‌ తొక్క మృదువుగా, మచ్చలు లేకుండా ఉండాలి. అలానే నిమ్మ, నారింజ, కమలా వంటివి తాజా వాసన ఉండాలి. కర్భూజ తీసుకునేటప్పుడు దాని తొడిమ భాగంలో నొక్కితే మెత్తగా ఉన్నా లేక తీపివాసన వస్తున్నా బాగా పండినట్లు లెక్క. ద్రాక్షా కుళ్లిన దశలో ఉన్నవి మాత్రమే రాలిపోతుంటాయి. కాబట్టి గుత్తులనే ఎంచుకోవాలి.

దుంపలు... చిలగడదుంప, క్యారెట్‌, బీట్‌రూట్‌, బంగాళదుంప, ముల్లంగి.. మొదలైన దుంపల్ని ఎంచుకునేటప్పుడు వాటిని చేతిలోకి తీసుకుని బరువు చూడాలి. అవి తేలికవైతే పక్కన పెట్టేయండి. బరువుగా ఉండి, తొక్క కూడా మృదువుగా ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోండి. ముఖ్యంగా బంగాళదుంపలు ఏరేటప్పుడు ఆకుపచ్చరంగు ఉన్నా, మొలకలు ఉన్నా తీసుకోవద్దు. ఎందుకంటే వాటిల్లో సొలనైన్‌ అనే హానికర రసాయనం ఉంటుంది.

ఆకు కూరలు, కూరగాయలు... పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర.. మొదలైన ఆకుకూరల విషయానికి వస్తే ఆకుపచ్చరంగులో ఉన్నవి, తాజాగా కనిపించేవే తీసుకోవాలి. ఆకుల మీద రంధ్రాలున్నా, వాడినా, ఎండినా కూడా వద్దు. క్యాబేజీ అయితే దాని పొరలు టైట్‌గా అతుక్కుని ఉండాలి. బెండకాయల సంగతి తెలిసిందే! చివర విరుస్తాం. అలాగే మరీ పెద్ద బెండకాయలు రుచిగా ఉండవు. కనుక చిన్నవి మంచివి.

ఉల్లిపాయలు... తడిగా ఉండి రంగు మారినవి కొనకూడదు. పట్టుకున్నప్పుడు సులువుగా పొట్టు వచ్చేలా ఉండేవి ఎంచుకోవడం మంచిది.

ఇదీ చూడండి: చెమట వాసనను పోగొట్టే 15 సులభ మార్గాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.