ETV Bharat / sukhibhava

విటమిన్​ 'డి' మనకు ఎంత అవసరం..? - విటమిన్​ డీ సూర్య రశ్మి

మనిషి శరీరానికి కావాల్సిన అత్యవసరమైన వాటిల్లో డి విటమిన్​ ఒకటి. సహజంగా.. సూర్యరశ్మి శరీరానికి తాకితే విటమిన్​ డి లభించినట్టే అని అంటుంటారు. అయితే ఎంత సేపు మనిషికి సూర్యరశ్మి తగలాలి? విటమిన్​ డి లోపం ఉంటే సమస్యలు వస్తాయా? వంటి ప్రశ్నలకు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు పీవీ రంగనాయకులు ఇచ్చిన సమాధానాలు మీకోసం..

vitamin DHow Much Time We Need In Sun For Vitamin D Reserve?
విటమిన్​ 'డీ' మనకి ఎంత అవసరం..?
author img

By

Published : Apr 13, 2021, 10:52 AM IST

విటమిన్​ డి.. చిన్నప్పటి నుంచి దీని గురించి ఎన్నో విశేషాలు, వివరాలు తెలుసుకునే ఉంటాం. మనిషి ఆరోగ్యం దీనిపై ఆధారపడిన తీరు అలాంటిది. సూర్యరశ్మి తాకితే విటమిన్​ డి పెరుగుతుందన్నది తెలిసిన విషయమే. అయితే.. సూర్యరశ్మి ఎంత సేపు మనిషిని తాకితే.. సరిపడా విటమిన్​ డి శరీరంలోకి చేరుతుంది?

ఎంత సేపు?

తగిన మోతాదులో డి విటమిన్​ లభించాలంటే వారంలో రెండు నుంచి మూడు గంటలైనా శరీరానికి ఎండ తగలాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ 30 నిమిషాల పాటు ఎండలో ఉంటే చర్మం.. వెయ్యి యూనిట్ల డి విటమిన్​ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.

అంతేకాకుండా.. రోజుకు కనీసం 10 నిమిషాలైనా ఎండలో గడపాల్సిన అవసరం ఉంది.

డి విటమిన్ పుట్టగొడుగులు, చేప, పాలు, గుడ్లలో కూడా లభిస్తుంది. ఈ డి విటమిన్​.. కాల్షియమ్​ మెటబాలిజమ్​ వృద్ధికి మాత్రమే కాక.. మెదడులో ఉండే సెరోటొనిన్​ అనే రసాయనం పనితీరునూ మెరుగుపరుస్తుంది. దీని ద్వారా ఒత్తిడి తగ్గడం సహా మనసు ఉల్లాసంగా ఉంటుంది.

విటమిన్​ డి లోపంతో..

ఈ విటమిన్​ లోపం వల్ల లివర్​, కిడ్నీ సమస్యలతో పాటు కేన్సర్​ కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు ఔట్​డోర్​ కన్నా ఇండోర్​లో పని చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీని వల్ల సూర్యరశ్మి సరిగ్గా తాకకపోవడం, ఇతర కారణాల వల్ల అనేకమంది ఈ విటమిన్​ లోపంతో సతమతమవుతున్నారు. జాగ్రత్తలు తీసుకుని శరీరానికి తగిన విటమిన్​ డిని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే సమయంలో.. ఎక్కువగా ఎండలో గడపడం వల్ల డి విటమిన్​ సహా రోగనిరోధక శక్తి పెరిగినా.. చర్మం రంగుపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:- సరిగ్గా నిద్రపట్టడం లేదా.. అయితే ఇది ట్రై చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.