Best Tips to Get Pregnancy : మహిళల జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది చాలా సున్నితమైన అంశం. మాతృత్వాన్ని అనుభవించాలని అందరూ ఆరాటపడతారు. కానీ.. కొంతమంది పెళ్లి అయిన కొద్ది కాలానికే గర్భందాలుస్తారు. మరికొంతమందికి మాత్రం సంవత్సరాలు గడిచినా సంతానం కలగకదు. ఈ పరిస్థితికి నేటితరం జీవన శైలి ఒక కారణమైతే.. తెలియక చేసే పొరపాట్లు మరో కారణం. వీటిని సరిచేసుకుంటే ఈజీగా ప్రెగ్నెన్సీ(Pregnancy) పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Relationship Tips for Pregnancy : ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతోందని డాక్టర్ని కలిసే ముందు.. కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి.. అనారోగ్య సమస్యలు లేకపోతే.. తల్లిదండ్రులు కావడానికి భార్యాభర్తలు కలవడం ఒక్కటే సరిపోతుందని అంటున్నారు. ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. దంపతులు ఎంత తరచుగా శృంగారంలో పాల్గొంటున్నారన్నదానికీ.. గర్భాధారణ అవకాశాలకీ సంబంధం ఉందని తేలింది. కాబట్టి పిల్లలు కావాలనుకునే దంపతులు కచ్చితంగా.. సెక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?
అది అపోహే : రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు శారీరక సంబంధం కలిగి ఉంటేనే.. త్వరగా తల్లిదండ్రులు కావొచ్చని కొందరు భావిస్తారనీ.. కానీ అది అపోహ మాత్రమేనని అంటున్నారు నిపుణులు. వాస్తవానికి.. తరచుగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆరోగ్యకరమైన స్పెర్మ్ సంఖ్య తగ్గుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న దంపతులు.. ప్రతీరెండు రోజులకు ఒకసారి సంభోగంలో పాల్గొనడం మంచిదంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా.. గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
నెలలో ఏది సరైన సమయం?
స్త్రీ శరీరం గర్భం ధరించడానికి నెలలో కొన్ని రోజులే అనువుగా ఉంటాయి. ఓవులేషన్ (ovulation) ప్రక్రియ జరగడానికి ఐదు రోజుల ముందు నుంచి, ovulation జరిగే రోజు వరకు గర్భధారణకు అనువైన సమయంగా చెబుతున్నారు. ఈ రోజుల్లో సంభోగంలో పాల్గొనటం వల్ల మీ ప్రయత్నం ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో కలిసేందుకు తప్పక ప్రయత్నించాలని, పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఓవులేషన్(ovulation) ప్రక్రియ ఇలా..
ఓవులేషన్ (అండోత్సర్గము) సమయంలో మీ ఓవరీ పరిపక్వమైన ఎగ్‌ని ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భసంచికి పంపిస్తుంది. అలాగే.. స్పెర్మ్ అనేది స్త్రీ శరీరంలో ఐదు రోజుల వరకు ఉంటుంది. కాబట్టి.. స్త్రీ ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఓవులేషన్ జరిగే సమయానికి.. స్పెర్మ్ మహిళ శరీరంలో ఉండేటట్లు చూసుకోవాలి. పిల్లలకోసం ప్రయత్నించే దంపతులు ఈ విషయం గుర్తుంచుకోవాలని.. అప్పుడే వారు అనుకున్న ఫలితాలు పొందుతారని చెబుతున్నారు.
ఓవులేషన్ గురించి ఎలా తెలుస్తుంది..?
మహిళ గర్భంలో ఓవులేషన్ ప్రక్రియ ఎప్పుడు జరుగుతోందో.. మనకు ఎలా తెలుస్తుంది? అనే సందేహం రావొచ్చు. దీనికోసం ఓ చిన్న పని చేయాలి. క్యాలెండర్లో మహిళ ఋతుక్రమాన్ని నోట్ చేయాలి. పీరియడ్స్ మొదలైన రోజు నుంచి.. మళ్లీ వచ్చే నెల పీరియడ్స్ మొదలయ్యే ముందు రోజు వరకూ ఒక నెల రోజులు అనుకోండి. పీరియడ్స్ మొదలైన రోజును.. వచ్చే నెల పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు రోజును తీసేస్తే.. మధ్యలో 28 రోజులు ఉంటాయి. ఇందులో పద్నాలుగో రోజున ఓవులేషన్ ప్రక్రియ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే.. ప్రెగ్నెన్సీ తప్పక వస్తుందని చెబుతున్నారు.
Pregnancy Diet In Telugu : పండంటి బిడ్డకు జన్మనివ్వాలా?.. ఈ ఫుడ్ డైట్ ఫాలో అయిపోండి!
బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. చిన్నారికి పాల కోసం ప్రత్యేక ఏర్పాటు!