ETV Bharat / sukhibhava

రోజులో ఎన్నిసార్లు సెక్స్​లో పాల్గొనవచ్చు? ఎక్కువైతే ఇబ్బందా? - samaram videos youtube

రోజులో ఎన్నిసార్లు రతిలో పాల్గొనవచ్చనే అనుమానం కొందరిలో కలుగుతుంటుంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే?

how many times sex in a day is healthy
రోజులో ఎన్నిసార్లు సెక్స్​లో పాల్గొనవచ్చు? ఎక్కువైతే ఇబ్బందా?
author img

By

Published : Jul 6, 2022, 7:02 AM IST

How many times sex in a day is healthy: సెక్స్​లో పాల్గొంటే వచ్చే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. అయితే రోజులో ఎన్నిసార్లు సెక్స్​లో పాల్గొంటే మంచిదో అనే అనుమానం మీలో ఉందా? వైద్యుల సమాధానం ఏంటో తెలుసుకోండి.

రోజులో ఎన్నిసార్లు సెక్స్​లో పాల్గొనవచ్చు? ఎక్కువైతే ఇబ్బందా?

"సెక్స్​లో పాల్గొనడానికి ఇన్నిసార్లు అని లిమిట్ ఏమీ ఉండదు. కోరిక, సామర్థ్యం ఉంటే ఎన్నిసార్లైనా పాల్గొనవచ్చు. కొత్తగా పెళ్లి అయినవారైతే రోజులో మూడు-నాలుగు సార్లు పాల్గొంటుంటారు. నిజంగా మనసు పడి రతిలో పాల్గొంటే దంపతులు పొందే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా పాల్గొనవచ్చు. సెక్స్​లో పాల్గొనడం వల్ల ఎవరూ నీరసపడరు. ఇంకా చెప్పాలంటే రతి వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆరోజు చాలా ఫ్రెష్​గా అనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే సెక్స్​ వల్ల ఫీల్​ గుడ్ హార్మోన్స్​ విడుదలవుతాయి." అని అంటున్నారు నిపుణులు. శృంగార జీవితానికి సంబంధించిన మరిన్ని ప్రశ్నలకు వారి జవాబులు ఇలా ఉన్నాయి..

శృంగార జీవితం మెరుగయ్యేందుకు ఏం తినాలి?

  • సోయా, చేపలు వంటివి సెక్స్‌ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.
  • పలుచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిలో టైరోసైన్‌, ఫినైల్‌ అలనైన్‌ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి.
  • తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటివాటిలో కొలైన్‌ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే.
  • పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్‌, ఐనోసిటాల్‌ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.

పగటిపూట సెక్స్​ చేస్తే పిల్లలు పుట్టరా?

  • పిల్లలు పుట్టాలంటే ఏ సమయంలో సెక్స్ చేయాలి? గర్భధారణకు పగలు సరైన సమయమేనా? పగలు చేస్తే పుట్టే పిల్లల్లో లోపాలు ఏర్పడతాయా?.. కొందరి అనుమానాలివి.
  • ఇవన్నీ అపోహలే. రతికి ఓ సమయం అంటూ ఏదీ లేదు. వారికి నచ్చినప్పుడు, ఏ సమయంలోనైనా శృంగారంలో పాల్గొనవచ్చు.
  • పగటిపూట రతి చేస్తే.. సంతానంలో అవలక్షణాలు రావడమనేది భ్రమ మాత్రమే.
  • ఒకే రాత్రి రెండోసారి రతి చేస్తే మహిళలు గర్భం దాల్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

శృంగారంలో చెమట ఆ బలహీనతకు సంకేతమా?

  • కలయిక వేళ ఒళ్లంతా చెమటలు పట్టడం నరాల బలహీనత అని, శృంగారంపై ప్రభావం చూపుతుందని కొందరు భయపడుతుంటారు.
  • అయితే, చెమట ఎక్కువగా వస్తే నరాల బలహీనత అనుకోవడం అపోహ మాత్రమే.
  • నరాల బలహీనతకు, రతికి అస్సలు సంబంధం లేదు, కంగారు, ఆందోళన, హైపర్​ థైరాయిడ్​ ఉన్నవాళ్లకు ఎక్కువగా చెమట పడుతుంది. కొందరికి సహజంగానే అలా జరుగుతుంది.
  • చెమట ఎక్కువగా వచ్చే వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇన్​ఫెక్షన్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

శృంగార జీవితానికి సంబంధించి ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.