Pre Ejaculation Problem : శీఘ్రస్కలనం.. శృంగారానికి సంబంధించిన ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. అనేక మంది దీన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా దంపతులిద్దరూ అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్య పరిష్కారానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. హోమియోపతి, ఆయుర్వేదం తదితర మందులు వాడే వారూ లేకపోలేదు. కానీ ఎలాంటి మందులు వాడకుండా, చికిత్స లేకుండా సహజ సిద్ధంగా దీని నుంచి బయట పడవచ్చు.
ఈ సమస్య గురించి తెలియని వారు చాలా మంది దీన్ని అనేక రకాలుగా అనుకుంటారు. కొంతమంది దీన్ని పెద్దదిగా, పరిష్కరించలేనిదిగా చూస్తారు. మరికొంత మంది నరాల బలహీనత కారణంగా వచ్చిందని అనుకుంటారు. కానీ రెంటింట్లో ఏదీ నిజం కాదు. ఇదొక మానసికమైన బలహీనత మాత్రమే. శృంగార సమయంలో భాగస్వామిని తృప్తి పరచాలనే కోరిక, కంగారు, ఆందోళనలో తొందరగా వీర్యం బయటికి వస్తుంది.
ఈ సమస్య ఉత్పన్నమవడానికి ప్రధాన కారణం ఆందోళన. భాగస్వాములిద్దరూ శారీరకంగా కలుసుకున్నప్పుడు మనసులో ఆతృత, కంగారు, ఆందోళన (యాంగ్జైటీ), గాబరా పడితే దాని ఫలితం శృంగారంపై ఉంటుంది. సెక్స్ సమయంలో మనసులో ఎక్సైట్ గా ఫీలయితే సంబంధిత హార్మోన్లు తొందరగా స్టిమ్యులేట్ అయి తొందగా వీర్యం పడిపోతుంది. దాని వల్ల ఎదుటివారు అసంతృప్తితో ఉంటారు. ఈ ప్రభావం ఇతర వాటిపైనా పడి గొడవలు జరుగుతాయి.
మరి అలా జరగకుండా, ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అంటే.. దీనికి ఒక మార్గం ఉంది. శృంగారం చేసేటప్పుడు మీ మనసును నియంత్రించుకుంటే దీనికి పరిష్కారం లభించినట్లే. మనసును అదుపులో ఉంచుకుని అభ్యాసం చేస్తే అంటే యాంగ్జైటీని కంట్రోల్ చేసుకుంటే సమస్య తీరినట్లే. రెండోదిగా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే సమస్య నుంచి బయట పడవచ్చు. సెక్స్ చేసే సమయంలో పురుషులకు వీర్యం పడుతుంది అని అనిపించినప్పుడు కాసేపు ఆగి, ఆ ఫీలింగ్ తగ్గాక మళ్లీ కొనసాగించాలి. ఇలా చేస్తే తొందరగా వీర్యస్కలనం అవ్వకుండా ఆపవచ్చు. 4 నుంచి 6 వారాల పాటు ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.
మందులేమైనా ఉన్నాయా?
Pre Ejection Medicine : ఈ సమస్యకు మందులేవైనా ఉన్నాయా అంటే.. ఉన్నాయి. యాంటీ డిప్రెసివ్ మందులు వాడవచ్చు. ఇవి కాకుండా డెపాక్స్టిన్ అనే డ్రగ్ ను ప్రత్యేకంగా శీఘ్రస్కలన సమస్య నివారణకు వాడతారు. ఇవి 30 ఎంజీ, 60 ఎంజీ పరిమాణాల్లో దొరుకుతాయి. సెక్స్ లో పాల్గొనే గంట నుంచి మూడు గంటల ముందు వేసుకుంటే ఇది కంగారును, న్యూరలాజికల్ ఎక్సైట్ మెంట్ని కంట్రోల్ చేస్తుంది. కానీ సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైన రీతిలో అనగా మనసును నియంత్రించుకోవడం లేదా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నివారణకు ప్రయత్నించాలి.