ETV Bharat / sukhibhava

రూ.30వేల సర్జరీతో 'కన్యత్వం' వాపస్! భవిష్యత్​లో సమస్యలు రావా?

Virginity Surgery: కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలు రూ.30 వేలలోనే దానిని తిరిగిపొందగలిగే మార్గం.. హైమెనోప్లాస్టీ. ఈ సర్జరీనే ప్రస్తుత ట్రెండ్​. పెళ్లిళ్ల సీజన్​ కావడం వల్ల దానికి మరింత డిమాండ్ పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. మరి ఈ ఆపరేషన్ చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? అసలు హైమెనోప్లాస్టీ చేసుకోవాలని కొందరు మహిళలు ఎందుకు భావిస్తున్నారు?

Virginity Surgery
hymenoplasty
author img

By

Published : Apr 13, 2022, 6:56 PM IST

Virginity Surgery: సర్జరీలతో కన్యత్వాన్ని తిరిగి పొందాలనుకుంటున్న వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. మెట్రో ప్రాంతాల్లోనే కాక చిన్న నగరాల్లోనూ ఇలాంటివి ఊపందుకున్నాయని మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని కాస్మొటిక్ సర్జన్​ డా.అశ్విన్ దాశ్​ తెలిపారు. "ఎలాంటి సంకోచం లేకుండా 'హైమెనోప్లాస్టీ' కోసం మహిళలు, బాలికలు నా వద్దకు వస్తున్నారు. కన్యత్వాన్ని తిరిగిపొందడానికి చేసే శస్త్రచికిత్స అది. వీరిలో చాలామంది త్వరలో పెళ్లిచేసుకోబోతున్నవారే " అని డా.అశ్విన్ వెల్లడించారు.

Virginity Surgery
.

కన్యత్వం అనేది భారత్​లో చాలా సున్నితమైన అంశం. మహిళ తను వివాహం చేసుకున్న వ్యక్తితోనే శృంగారంలో పాల్గొని జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని మన దేశంలో నమ్ముతారు. పెళ్లికి ముందు సన్నిహిత సంబంధాలను ఆమోదించరు. ఇది మహిళ వ్యక్తిగత వ్యవహారమైనప్పటికీ.. భారతీయుల ఆలోచనలు మాత్రం అందుకు భిన్నం!

ఇందుకు విరుద్ధంగా.. పెళ్లికి ముందు పురుషులు లైంగిక సంబంధాలు కలిగి ఉంటే ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. అయితే ఇది సమాజం గురించి మాత్రమే కాదు. తమ నైతిక ప్రమాణాలతో సంబంధం లేకుండా చాలా మంది పురుషులు కూడా కన్యత్వం కలిగిన యువతినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరో రకంగా చెప్పాలంటే.. పెళ్లి కోసం 'సరైన అమ్మాయి'ని ఎంచుకునే ప్రక్రియలో కన్యత్వం అనేది కూడా ప్రామాణికంగా ఉంటోంది. ఇలాంటి నియమాల మధ్య ఉండే ఏ అమ్మాయి అయినా.. సమాజం చేత ఆమోదం పొందాలనే భావిస్తుంది. హైమెనోప్లాస్టీ చేయించుకునేవారి సంఖ్య పెరగడానికి కారణం అదే.

Virginity Surgery
.

ఏమిటీ హైమెనోప్లాస్టీ?: ఆడవారిలో హైమెన్ (కన్నెపొర)​ అనే భాగాన్ని పునరుద్ధరించడాన్నే హైమెనోప్లాస్టీ అంటారు. యోని ద్వారాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పి ఉంచే సన్నని మ్యూకస్ పొర ఇది. తొలిసారి లైంగిక కలయిక వల్ల, కొన్నిసార్లు ఇతర కారణాలతో ఈ పొర చీలిపోతుంది. దీనిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకువస్తారు. 30 నిమిషాలలోపే పూర్తయ్యే ఈ సర్జరీకి సగటున రూ.50 వేల వరకు ఖర్చవుతుంది.

ఎందుకు ఇంత డిమాండ్?: "ఖర్చు పరంగా చాలామందికి ఈ సర్జరీ అందుబాటులో ఉండటం, త్వరగా పూర్తవడం కారణంగా దీనిని చేయించుకునే ముందు మహిళలు మరో ఆలోచన చేయడం లేదు. ఆస్పత్రిని బట్టి రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు దీనికి ఖర్చవుతుంది. ఈ శస్త్రచికిత్స చాలా సింపుల్. పెద్దగా జాగ్రత్తలు తీసుకునే పని లేదు. ఆపరేషన్ జరిగిన రోజే పేషెంట్ ఇంటికి వెళ్లిపోవచ్చు. అయితే అధిక బరువులు మోయడం, కొన్ని వారాల పాటు వ్యాయామం లాంటివి చేయొద్దని వీరికి సూచిస్తాం" అని డా.అశ్విన్ తెలిపారు.

Virginity Surgery
.

ఎంతవరకు సబబు?: పెళ్లిళ్ల సీజన్​కు ముందు సర్జరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని డాక్టర్​ తెలిపారు. "మహిళ శరీరంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని ఈ సర్జరీ ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. జీవితాంతం అబద్ధంతో బతకడం సవాలుతో కూడినది. తమ భాగస్వామితో నిజాయితీగా లేమనే అపరాధభావం కూడా వారిని కుంగదీయవచ్చు. ప్రస్తుతానికి హైమెనోప్లాస్టీ అనేది ట్రెండ్​గా మారినా.. మహిళలు దానిని చేయించుకునే ముందు సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా, లోతుగా ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోవాలి." అని డా.అశ్విన్ సూచించారు.

ఇవీ చూడండి:

కన్యత్వ పరీక్షలో విఫలం- ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్తలు

కన్యతో శృంగారమే థ్రిల్లింగ్‌ ఎందుకు...?

ఇకపై వర్జినిటీ టెస్ట్ లేకుండానే ఆ సైన్యంలోకి మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.