How to Get Rid of Pimples and Dark Spots in Telugu: అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొనే సౌందర్య సమస్యలలో మొటిమలు ఒకటి. కొందరిలో ముఖంపై మొటిమలు తగ్గినా.. మచ్చలు అలానే ఉంటాయి. వీటి కారణంగా ముఖం అందవిహీనంగా మారుతుంది. మొటిమల మచ్చలను తొలగించడానికి విపరీతంగా ఖర్చు పెట్టి.. క్రీమ్‌లు, లేజర్ ట్రీట్మెంట్‌లు చేయించుకుంటూ ఉంటారు. అయితే వాటి ప్రభావం ఎంత మేర ఉంటుందనేది చెప్పలేము. కాగా, మొటిమల కారణంగా వచ్చిన మచ్చలను మన ఇంట్లో సహజసిద్ధంగా దొరికే వస్తువులతో సులభంగా తొలగించవచ్చు.
అమ్మాయిలకు టీనేజ్‌లో మొటిమలు రావడం సహజం. శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు కూడా వీటికి కారణమవుతుంటాయి. అయితే అధిక మొత్తంలో నీళ్లు తాగడం, చర్మం జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. ముందుగా ముఖంపై మొటిమలను నివారించి, ఆ తర్వాత మచ్చలను దూరం చేయాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!
మొటిమలు తగ్గేందుకు ప్యాక్:
- చెంచా ముల్తానీ మట్టి తీసుకొని అందులో జీలకర్ర పొడి, దాల్చినచెక్క పొడి, లవంగం పొడి చిటికెడు చొప్పున వేసి.. తగినన్ని రోజ్‌వాటర్ జత చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి.
- తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఇలా వారానికి మూడుసార్లు చొప్పున రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
నల్ల మచ్చలు తగ్గేందుకు ప్యాక్:
- ఓట్స్ పౌడర్, బార్లీ పౌడర్ అరచెంచా చొప్పున తీసుకొని అందులో రోజ్‌వాటర్ వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.
- ఈ ప్యాక్‌ని నల్ల మచ్చలు ఉన్న చోట అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి.
- తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఇలా వారానికి మూడుసార్లు చొప్పున నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే నల్ల మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
- అయితే ఈ ప్యాక్‌ని మొటిమలు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది.
మీ ఫేస్ గ్లాస్ స్కిన్‌లా మెరవాలా?- ఈ రెండు ఐటెమ్స్ ఉంటే చాలు, గ్లో అదిరిపోద్ది!
బంగాళదుంపతో:
- బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
- ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల పాటు ఆరనివ్వండి.
- ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోండి.
- ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మచ్చలు మాయం అవుతాయి.
గమనిక: ఈ ప్యాక్‌లలో పాలను ఉపయోగించకూడదు.. దానివల్ల చర్మం తిరిగి జిడ్డుగా మారి, మొటిమల సమస్య పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి దానికి బదులుగా రోజ్‌వాటర్‌ని ఉపయోగించడం శ్రేయస్కరం. ఈ ప్యాక్‌లను వేసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో నూనె, మసాలా సంబంధిత పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా పండ్ల రసాలు, నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
పీరియడ్స్ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్‌తో రిలీఫ్ పొందండి!
ముఖంలో అప్పుడే వృద్ధాప్య ఛాయలా? అర్జెంటుగా ఇవి తినడం స్టార్ట్ చేయండి - నిగనిగలాడిపోద్ది!