ETV Bharat / sukhibhava

వరల్డ్​ ఎయిడ్స్ డే ​: హెచ్​ఐవీ ఎన్ని మార్గాల్లో సోకుతుందో మీకు తెలుసా? - హెచ్​ఐవీ ఎయిడ్స్

HIV AIDS Myths and Facts: మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. అయితే.. దీని గురించి పూర్తిగా ఎంత మందికి తెలుసో తెలియదుగానీ.. దీని చుట్టూ పుట్టుకొచ్చిన అనుమానాలు మాత్రం అందరి మెదళ్లలో తిష్ట వేశాయి! మరి.. హెచ్​ఐవీ-ఎయిడ్స్ గురించి మీకు ఎంత వరకు తెలుసు? "వరల్డ్ ఎయిడ్స్ డే" సందర్భంగా.. అపోహలు-వాస్తవాలను చూద్దాం.

hiv aids myths and facts
hiv aids myths and facts
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 11:27 AM IST

HIV AIDS Myths and Facts in Telugu: హెచ్‌ఐవీ కంటే భయంకరమైన.. అంతకంటే ప్రాణాంతకమైన వ్యాధులు ఎన్నో ఉన్నాయి. కానీ.. వాటి పట్ల లేనంత భయం, అపోహలు, అంతకుమించిన వివక్ష.. HIV పట్ల ఉన్నాయి. నిజానికి హెచ్‌ఐవీకి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం. కానీ.. వైరస్​ను అదుపుచేస్తూ.. ఇతర దీర్ఘకాలిక రోగుల మాదిరిగా మందులు వాడుతూ ఎక్కువ కాలం సాధారణ జీవితం గడపవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాగే.. ఈ వ్యాధిపై మెజారిటీ జనానికి పూర్తిగా అవగాహన లేదు. నేడు "ప్రపంచ ఎయిడ్స్ డే" సందర్భంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పట్ల ఉన్న అనేక అపోహలు-వాస్తవాలపై ఈటీవీ భారత్​ కథనం..

చలికాలంలో చన్నీటి స్నానం చేస్తున్నారా! ఈ ప్రమాదాలు తెలుసా?

World AIDS Day 2023: హెచ్​ఐవీ-ఎయిడ్స్.. ఇవి రెండూ ఒకటి కాదు అనే విషయమే చాలా మందికి తెలిదు. HIV అంటే.. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయడం మొదలు పెడుతుంది. ఇది క్రమంగా శరీరంలో విస్తరిస్తూ అన్ని వ్యవస్థల్నీ ధ్వంసం చేస్తూ వెళ్తుంది. దీంతో.. శరీరం సహజంగా ఎదుర్కొనే రోగాలను కూడా అడ్డుకోలేకపోతుంది. ఈ క్రమంలో.. చాలా రోగాలు ఒంటిపై దాడిచేస్తాయి. ఫలితంగా శరీరం కృశించుకుపోతూ ఉంటుంది. ఈ పరిస్థితి తీవ్రమైన చివరి దశనే AIDS (అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్) అంటారు. ఈ దశలో శరీరానికి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే శక్తి ఉండదు. ఈ పరిస్థితి మరింతగా ముదిరినప్పుడే మరణం సంభవిస్తుంది. అయితే.. హెచ్ఐవీ సోకిన తర్వాత.. అది ఎయిడ్స్ వ్యాధిగా మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పట్ల ఉన్న అనేక అపోహలూ, వాస్తవాలను తెలుసుకుందాం.

బాణపొట్ట ఎబ్బెట్టుగా ఉందా? ఉదయాన్నే ఇలా చేస్తే చాలు - ఐస్​లా కరిగిపోతుంది!

అపోహలు - వాస్తవాలు:

అపోహ: ముట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది.

వాస్తవం: ఎయిడ్స్ రోగులను హత్తుకున్నా, వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ వ్యాధి రాదు. కేవలం అసురక్షిత సెక్స్​, వ్యాధి సోకిన వారి రక్తం ఎక్కించడం ద్వారా మాత్రమే ఇది వ్యాపిస్తుంది.

అపోహ: హెచ్‌ఐవీ సోకినవారికి ఇక జీవితం శూన్యం.

వాస్తవం: హెచ్‌ఐవీని తొలినాళ్లలో మాత్రమే ఈ పరిస్థితి ఉండేది. కానీ .. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. హెచ్‌ఐవీపై నియంత్రణ సాధించగల యాంటీ రెట్రోవైరల్ మందులు కనుగొన్న తర్వాత.. హెచ్‌ఐవీ రోగులు సైతం అందరిలాగే దీర్ఘకాలం బతుకుతున్నారు. ఎప్పటిలాగే తమ పనులు తామే చేసుకోవడం, అందరిలాగే జీవించడం సాధ్యమైంది. హెచ్‌ఐవీ వైరస్‌ను కలిగి ఉండటం తప్ప.. ఇంక వారి సామాజిక జీవితంలో ఎలాంటి అవరోధమూ లేనంత నార్మల్‌గా బతకడం సాధ్యమే.

చలికాలంలో కూడా వేడి చేస్తోందా? కారణాలు ఇవేనట!

అపోహ: హెచ్‌ఐవీ-పాజిటివ్ మహిళలకు పుట్టే పిల్లలకు ఖచ్చితంగా హెచ్‌ఐవీ ఉంటుంది.

వాస్తవం: యాంటీరెట్రోవైరల్ చికిత్స, సి-సెక్షన్, ఇతర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. నవజాత శిశువులకు వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని 2% కంటే తక్కువకు తగ్గించవచ్చు.

అపోహ: కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదు..

వాస్తవం: హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరిస్తే చాలు.. ఆ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శృంగారం సమయంలో కండోమ్ చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం వంటివి జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అవతలి వారికి హెచ్ఐవీ లేదు అనుకొని కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనాలనుకున్నా.. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమందికి హెచ్‌ఐవీ సోకినా తాము ఆ వ్యాధితో బాధపడుతున్నామన్న సంగతి తెలియట్లేదని కొన్ని గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?-అయితే మీకు IQ ఎక్కువ ఉన్నట్లే!

అపోహ: హెచ్ఐవీ సోకితే ఎయిడ్స్ వచ్చినట్లే..

వాస్తవం: హ్యూమన్ ఇమ్యునో డెఫీషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో భాగమైన సీడీ4 అనే కణాలను నాశనం చేస్తుంది. ఇవి శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని కాపాడతాయి. ఈ కణాలు నాశనం కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి.. పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా హెచ్ఐవీ సోకిన తర్వాత ప్రారంభంలో గుర్తించకుండా అలాగే దీర్ఘకాలం పాటు వదిలేస్తే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది.

అపోహ: సంభోగానికి ముందు తీసుకునే మందులు HIV సంక్రమణను నిరోధించగలవు.

వాస్తవం: సంభోగానికి ముందు తీసుకునే మందులు HIV సంక్రమణను నిరోధించగలవనదే కేవలం అపోహ. ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కానీ ప్రమాదాన్ని పూర్తిగా నివారించదు.

అలర్ట్ - మీరు ఈ ఆహారం తింటున్నారా? - ఆ సామర్థ్యం డౌన్​!

అపోహ: హెచ్‌ఐవీ సోకిన రోగితో ఆహారం, పానీయం, వంట పాత్రలను పంచుకోవడం వల్ల హెచ్‌ఐవీ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

వాస్తవం: హెచ్ఐవీ చాలా సున్నితమైన వైరస్. ఇది మన రక్తంలో కాకుండా బయట ఏమాత్రం జీవించలేదు. బాహ్య వాతావరణంలోకి వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ వైరస్ మరణిస్తుంది. అందుకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులతో కలిసి ఆహారం తిన్నా, వారిని తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందదు. అంతేకాదు.. చెమట, విసర్జితాలు.. వంటి వాటి ద్వారా కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. కాబట్టి ఎయిడ్స్ బాధితులు ఉపయోగించిన వస్తువులను ఎవరైనా నిరభ్యంతరంగా వినియోగించవచ్చు.

అపోహ: ఓరల్ సెక్స్ సురక్షితం. కాబట్టి దాని ద్వారా హెచ్‌ఐవీ రాదు.

వాస్తవం: ఓరల్ సెక్స్ ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించడానికి అవకాశాలు తక్కువే అయినా, పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. ఎందుకంటే వ్యాధి సోకిన వారిలోగాని లేదా వారి పార్ట్‌నర్‌లో గానీ నోటిలో ఏవైనా గాయాలున్నా, ఎదుటివారి రహస్యాంగాల్లో ఏవైనా కనిపించనంత చిన్న గాయాలు, పుండ్లు ఉన్నా.. వాటి ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించడానికి అవకాశాలు ఉన్నాయి.

మొటిమల సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్​కు వెళ్లాలి!

అపోహ: హెచ్‌ఐవీ ఉన్న రోగిని కుట్టిన దోమ మళ్లీ మనల్ని కుడితే మనకు వ్యాధి వస్తుంది.

వాస్తవం: ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. నిజానికి ఒక హెచ్‌ఐవీ రోగిని దోమ కుట్టాక, అది మనల్ని కుడితే, అది తాగిన రక్తాన్ని మనలోకి ఎంతమాత్రమూ ఎక్కించదు. అది మన రక్తాన్ని పలచబార్చడం కోసం కేవలం తన లాలాజలాన్ని మాత్రం ఎక్కించి, ఆ తర్వాత మళ్లీ మన రక్తం తాగుతుంది. ఇలా దోమ ద్వారా ఎయిడ్స్ వ్యాపించిన కేసు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు.

హెచ్​ఐవీ ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది?

హెచ్​ఐవీ/ఎయిడ్స్​.. మూడు పద్ధతుల ద్వారా వ్యాపిస్తుంది. ఒకటి సురక్షితం కాని సెక్స్ వల్ల, రెండోది ఆ వ్యాధిబారిన పడ్డ వారి రక్తాన్ని ఎక్కించడం వల్ల, మూడోది తల్లి నుంచి కడుపులో ఉన్న బిడ్డకు. ఈ మూడు మార్గాల ద్వారా తప్ప.. మరే ఇతరత్రా మార్గాల ద్వారా హెచ్​ఐవీ వ్యాపించదు.

కుక్కలకు పచ్చి మాంసం తినిపిస్తున్నారా? మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.