ETV Bharat / sukhibhava

High Protein Diet Health Benefits : హై ప్రోటీన్ ఫుడ్​తో.. స్థూలకాయం సహా.. బీపీ, షుగర్​లకు చెక్​! - protein rich foods

High Protein Diet Health Benefits In Telugu : బరువు తగ్గాలనుకునే వారు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ఒకటి. అయితే, దీని వ‌ల్ల కొన్ని న‌ష్టాలున్నాయ‌ని కొంద‌రు న‌మ్ముతారు. మ‌రి ఇందులో నిజ‌మెంత? వైద్యులు ఏం చెబుతున్నారు? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

High Protein Diet Health Benefits
ప్రోటీన్ ఫుడ్​ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 4:04 PM IST

High Protein Diet Health Benefits : అధిక బ‌రువు వ‌ల్ల అనేక న‌ష్టాలున్నాయి. బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది అనేక ప్ర‌య‌త్నాలు చేస్తారు. వాటిల్లో హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవ‌డం కూడా ఒక‌టి. ప్రోటీన్ ఎక్కువగా​ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలా వరకు ఆకలి తగ్గుతుంది. ఫలితంగా మరలా వెంటనే ఆహారం తీసుకునే అవసరం ఉండదు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. అయితే చెడు కొవ్వు తక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం.

స్థూలకాయానికి కారణం
Obesity Causes : రిఫైన్ చేసిన పదార్థాలు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకునే వాళ్లకు స్థూలకాయం వస్తుంది. ఇలాంటి పదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శక్తి తగినంత వినియోగం కాకుండా పోతుంది. ఫలితంగా అది కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఇది ఇలాగే కొనసాగడం వల్ల క్రమంగా బరువు పెరుగుతాం. కార్బోనేటెడ్ బేవరేజెస్, జ్యూసులు, స్వీట్లు, కేక్స్, పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారికి, బాగా పాలిస్​ చేసిన అన్నం తినేవాళ్లకి స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఈ కార్బోహైడ్రేట్స్​ మోతాదును తగ్గిస్తూ.. హై ప్రోటీన్ ఆహారం తీసుకుంటే.. బరువు తగ్గడం సులువు అవుతుంది.

స్థూలకాయంతో వచ్చే సమస్యలు
Over Weight Diet Plan : అధిక బరువు ఎన్నో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా దీని వల్ల డయాబెటిస్, బీపీ, జీర్ణ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. వయస్సుకు, ఎత్తుకు తగినంత బరువు ఉండటం వల్ల శరీర అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడానికి మన ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే (హై ప్రోటీన్ ఫుడ్) పదార్థాలను చేర్చుకోవాలి. ప్రోటీన్ల వల్ల కలిగే ఉపయోగాల్లో బరువు తగ్గించడం కూడా ఒకటి. హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి.. చాలా సమయం వరకు ఆకలేయదు.

హై ప్రోటీన్ ఉండే ఆహార ప‌దార్థాలివే..!
Protein Rich Foods : ప్రోటీన్లు ఉన్న ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు అవసరం. అయితే, వీటిని మన శరీరం తనంతట తాను తయారు చేసుకోలేదు. కనుక ఆహారం ద్వారానే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి దొరికే పదార్థాలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నప్పటికీ.. మాంసాహారం ద్వారా ప్రోటీన్లు చాలా వరకు అందుతాయి. చేపలు, కోడిమాంసం, మేక మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ప్రోటీన్లను పూర్తి స్థాయిలో పొందగలుగుతాము.

High Protein Non veg foods
మాంసాహారంలో అధిక మొత్తంలో ప్రోటీన్స్​

ప్లీజ్.. ఇవి తినవద్దు
నూనెలో వేయించిన పదార్థాలను, ​బటర్, చీజ్​లను అతిగా తినటం మానేయాలి. వీటికి బదులుగా బాదాం, పిస్తా, వాల్ నట్స్, నువ్వుల గింజలు తీసుకోవాలి. ఇందులో మంచి ప్రోటీన్స్​తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇలాంటి వాటిని తినటం వల్ల ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, మంచి కొవ్వులతో పాటు అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

అదంతా అపోహ మాత్రమే..
అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయని అంటారు. కానీ ఇందులో నిజం లేదు. అదంతా అపోహ మాత్రమే. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్, నేషనల్ హెల్త్ సర్వే కలిపి చేసిన పరిశోధనల్లో.. డైటీషియన్స్​ సిఫారసు చేసిన ప్రకారం, హై ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని తేలింది.

proteins in fruits and vegitables
పండ్లలోనూ అధిక మొత్తంలో ప్రోటీన్స్​

ప్రోటీన్ ఆహారం వల్ల కలిగే ఉపయోగాలు
High Protein Food Health Benefits : ప్రోటీన్​ ఫుడ్​ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతారు. పైగా రక్త ప్రసరణ, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల కండరాలు క్షీణించి పోకుండా ఉంటాయి. ఎముకలు సైతం బలంగా ఉంటాయి. వయస్సు పెరుగుతున్న వారికి కండరాల ఆరోగ్యం కోసం ప్రోటీన్లు మరింత అవసరం. మహిళలు ఈ ఆహారం తీసుకున్నప్పుడు సర్జరీ లేదా ఏదైనా ప్రమాదం వల్ల అయిన గాయాలు తొందరగా తగ్గుతాయి.

proteins in dairy products
పాలతో తయారైన పదార్థాలు, నట్స్​లో ప్రోటీన్స్​

పరిమితికి మించి వద్దు!
ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకునేటప్పుడు అందులో క్యాలరీలు మరీ ఎక్కువ ఉండకుండా జాగ్రత్తపడాలి. ప్రోటీన్స్​ ఎక్కువ సార్లు తీసుకోవాలనుకునే వారు, మూత్రపిండ వ్యాధులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్​ను ఒక్కసారిగా కాకుండా.. కొద్ది మొత్తంలో తీసుకోవడం మొదలు పెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

అధిక బరువును తగ్గించే హై ప్రోటీన్​ డైట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.