ETV Bharat / sukhibhava

బరువు తగ్గాలనుకుంటున్నారా? బ్రేక్​ఫాస్ట్​లో ఈ కాంబినేషన్స్​ ట్రై చేయండి! - వెయిట్​లాస్ టిప్స్​

Breakfast Combinations for Weight Loss: అధిక బరువుతో బాధపడేవారు వెయిట్​లాస్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తినే తిండిని చాలా వరకు తగ్గిస్తారు. అంతేకాకుండా రకరకాల వ్యాయామాలు చేస్తారు. అయితే బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆహారాలను కలిపి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Breakfast Combinations for Weight Loss
Breakfast Combinations for Weight Loss
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 10:56 AM IST

Breakfast Combinations for Weight Loss: ప్రస్తుత రోజుల్లో అధిక బరువు ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఓవర్​ వెయిట్​తో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి కారణాలు అంటే.. ఒక్కటని ఏమి లేదు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే వెయిట్ తగ్గడం కోసం చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు తగ్గేడమే లక్ష్యంగా చాలా మంది కష్టపడుతుంటారు. చివరకు ఆశించిన ఫలితం రాక బాధపడతారు. అలాంటి వారు ఇకపై టెన్షన్​ పడనవసరం లేదు. మనం డైలీ తినే బ్రేక్​ఫాస్ట్​లో ఈ కాంబినేషన్​ ఫుడ్స్​ ట్రై చేయమంటున్నారు నిపుణులు. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఓట్స్​ విత్​ పెరుగు: ఓట్స్​ను చాలా మంది డైలీ బ్రేక్​ఫాస్ట్​ లాగా చేసుకుంటారు. అయితే ఓట్స్​ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఇందులోని అధిక ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. ఇది అతిగా తినడం, బరువు పెరుగుటకు దారితీసే స్నాక్స్‌పై ఆసక్తిని తగ్గిస్తుంది. దీనిని పెరుగుతో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీవక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి ఈ రెండింటిని కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అదనపు రుచి కావాలంటే.. బెర్రీలను ఇందులో కలుపుకుని తినవచ్చు. బెర్రీల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి.

నెల రోజులు గుడ్లు తినడం మానేస్తే - మీ బాడీలో జరిగేది ఇదే!

పోహా, మొలకలు: పోహాను తినడం వలన వెయిట్ లాస్ కావచ్చంటున్నారు నిపుణులు. పోహాలో క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా చాలా ఈజీగా జీర్ణమవుతుంది. పోహా తినడం వలన మీ గట్ హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఐరన్​, ఫైబర్​ అధికంగా ఉంటుంది. పోహాలో మొలకలు కలిపి తింటే ఈజీగా వెయిట్​లాస్​ అవ్వొచ్చు. ఎందుకంటే.. మొలకల్లో ప్రోటీన్, విటమిన్లు ఉన్నాయి.

చట్నీ-సాంబార్‌తో ఇడ్లీ: చాలా మంది సాంబార్​ ఇడ్లీని తమ బ్రేక్​ఫాస్ట్​లో భాగం చేసుకుంటారు. ఇడ్లీలు ఆవిరిలో వండుతారు. అలాగే ఇవి తక్కువ కొవ్వు, కేలరీలను కలిగి ఉంటాయి. ఇక సాంబార్​ను పప్పు, కూరగాయలతో తయారు చేస్తారు. కాబట్టి.. అందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ రెండు కూడా బరువు తగ్గడానికి సాయపడతాయి..

ఈజీగా బరువు తగ్గాలా? రోజూ ఆ పాలు తాగితే బెస్ట్!

వెజిటేబుల్​ దాలియా: దాలియా అనేది చాలా ఫేమస్ ఇండియన్ వంటకం. ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ లెవల్స్ ఉంటాయి. కావున దీనిని తీసుకోవడం చాలా మంచిది. దాలియాను మనకు ఇష్టం వచ్చిన విధంగా స్వీట్ గానైనా లేదా సాల్టీగానైనా చేసుకోవచ్చు. దాలియాను ఎలా తీసుకోవాలన్నది మీ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే బరువు తగ్గించుకోవాలని చూస్తున్నపుడు దాలియాను కూరగాయలతో కలిపి ఉడికించుకోవడం మంచిది. ఇది మీ శరీర బరువును పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. వెజిటెబుల్ దాలియాలో అనేక రకాల పోషక పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా దాలియా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

కండరాల బరువు పెంచుకోవాలనుకుంటున్నారా? వాటికి స్వస్తి పలికి ఈ పద్ధతులు ట్రై చేయండి!

ఎగ్ వైట్​ ఆమ్లెట్ విత్​ హోల్​ వీట్​ బ్రెడ్​: గుడ్డులోని తెల్లసొన బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఎందుకంటే అవి తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఫలితంగా, అవి మిమ్మల్ని ఎక్కువసేపు ఫుల్‌గా ఉంచుతాయి. అలాగే ఆకలిని నియంత్రిస్తాయి. ఇక.. హోల్ వీట్ బ్రెడ్.. ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.

క్వినోవా, ఉప్మా: క్వినోవా అనేది ప్రోటీన్, ఫైబర్, కీలకమైన అమైనో ఆమ్లాలతో నిండిన సూపర్ ఫుడ్. క్వినోవా, కూరగాయలతో వండిన ఉప్మా ఒక పోషకమైన, గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయం. ఇది తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఇతర ఆహారాలను తీసుకోము. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

అధిక కొలెస్ట్రాల్​ వెన్నలా కరగాలా? మార్నింగ్​ ఈ డ్రింక్స్​ ట్రై చేయండి!

డిప్రెషన్​ సమస్యా? మందులు లేకుండా ఈ పద్ధతులు ఫాలో అవ్వండి!

మీకు 'గ్రీన్ టీ' అలవాటుందా? - ఇలా తాగితే చాలా డేంజర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.