ETV Bharat / sukhibhava

Healthy Food: చెడు కొలెస్ట్రాల్​ తగ్గాలా?.. రోజూ వీటిని తినండి!

author img

By

Published : Sep 5, 2021, 4:01 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్​ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Health tips to reducing bad cholesterol
చెడు కొలెస్ట్రాల్​ తగ్గడానికి చిట్కాలు

అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్‌(LDL) అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్‌(HDL) అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన ఒంటలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై వైద్యులు ఏమంటున్నారు.

చెడు కొవ్వు తగ్గడానికి చిట్కాలు

  • ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి.
  • ఎల్​డీఎల్​ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్​కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు. ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.
  • మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అపోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక పాటించాలి.
  • మంచి కొలెస్ట్రాల్​ (HDL).. డెసిలీటర్​కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి.
  • ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • తిండిని అదుపులో ఉంచుకోవాలి.
  • కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే నాన్​వెజ్​ ఫుడ్​ను పరిమిత స్థాయిలో తీసుకోవడం మంచిది లేదా నాన్​వెజ్​ ఫుడ్​ను పూర్తిగా తినకపోవడం మేలు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: యుక్త వయసులో గుండెపోటు.. కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.