ETV Bharat / sukhibhava

నెలసరి క్రమం తప్పుతోందా.. కారణమిదే కావచ్చు? - రుతుస్రామం సమస్యలు

మహిళలను నెల నెలా రుతుక్రమం పలకరిస్తూనే ఉంటుంది. సాధారణంగా 28 రోజులకు ఒకసారి నెలసరి వస్తుంటుంది. కానీ కొందరికి 24 రోజులకే రావొచ్చు, కొందరికి 35 రోజులకు రావొచ్చు. అందుకు గల కారణలేంటో చూద్దాం.

Periods
నెలసరి
author img

By

Published : Aug 12, 2021, 9:02 AM IST

కొందరిలో నెలా నెలా ఠంచనుగా వచ్చే రుతుచక్రం ఒక్కోసారి ముందుగానే వచ్చేయడమో లేదా మరీ ఆలస్యంగా రావడమో జరుగుతుంది. ఇలా అవడానికి కారణాలేంటంటే?

గర్భం.. ధరించిన మహిళల్లో నెలసరి ఆగిపోవడం మొదటి సంకేతం.

మాత్రలు: గర్భనిరోధక మాత్రలు వాడినప్పుడు కూడా అప్పుడప్పుడూ నెలసరి అదుపు తప్పుతుంది.

పాలిచ్చే తల్లులు: బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో కూడా నెలసరి చాలా రోజుల పాటు ఆగిపోతుంది. బిడ్డ ఎప్పుడైతే పాలు తాగడం ఆపేస్తాడో అప్పుడే నెలసరి మొదలవుతుంది.

అనారోగ్యాలు: థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కూడా ఇది ఆలస్యంగా లేదా తొందరగా రావడం జరుగుతుంది. పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌), మూత్రాశయంలో రాళ్లు, బుడగల్లాంటివి ఉండటం, ఎండోమెట్రియాసిస్‌ లాంటి అనారోగ్యాల వల్ల క్రమం తప్పుతుంది.

ఒత్తిడి: దీని వల్ల కూడా అండం విడుదల అవదు. దాంతో నెలసరి మొదలు కాదు.

మెనోపాజ్‌: సాధారణంగా 45, 50 ఏళ్లు వచ్చే సరికి మెనోపాజ్‌ మొదలవుతుంది. కొందరిలో అటూ ఇటూ ఉండొచ్చు. ఇది మొదలవుతున్నప్పుడు కూడా నెలసరి క్రమం తప్పుతుంది.

బరువు: అకస్మాత్తుగా బరువు పెరగడం/ తగ్గడం కూడా నెలసరి మీద ప్రభావాన్ని చూపుతుంది.

వ్యాయామాలు: మితి మీరిన వ్యాయామాల వల్ల కూడా పీరియడ్స్‌ ఆర్డర్‌ మారొచ్చు.

మందులు: అనారోగ్యాలకు వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా నెలసరి ఆలస్యంగా రావడమో, ముందు వచ్చేయడమో జరుగుతుంది.

వీటిలో మీకేది వర్తిస్తుందో చూడండి. అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించండి.

ఇవీ చూడండి: నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.