పురుషాంగానికి సంబంధించి చాలా మంది మగవారిలో ఎలాంటి సమస్య లేకపోయినా అనవసర భయాలు ఉంటాయన్నారు నిపుణులు. అవగాహన లోపం కారణంగా తాము సెక్స్‌కు (Sex diseases) పనికి వస్తామా అనే సందేహాలు వస్తుంటాయని తెలిపారు. పురుషాంగం వద్ద ఎలాంటి ఎముక (Penis diseases) లేకపోవడమే అంగం కాస్త వంకరగా ఉండటానికి కారణమని చెప్పుకొచ్చారు. దీనిని అంగం వంకరగా ఉండటం కింద పరిగణించరు అని స్పష్టం చేశారు. ఒకవేళ ఇంకా అనుమానంగా ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలని సూచించారు.
వారికి మాత్రమే..
కార్డీ అనే సమస్య ఉన్న వారిలో మాత్రమే పురుషాంగం పూర్తిగా వంకరగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్య ఉన్న వారు శృంగారంలో పాల్గొనలేరని.. శస్త్రచికిత్సే ఇందుకు పరిష్కారమని స్పష్టం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : తొడ భాగంలో కొవ్వు పేరుకుపోయిందా? ఈ చిట్కాలు మీకోసమే..