ETV Bharat / sukhibhava

గోరువెచ్చని నీరు తాగే అలవాటుందా? లేదా? - అయితే తప్పకుండా చదవండి! - Hot Water Health Benefits in Telugu

Drinking Hot Water Health Benefits : మనలో చాలా మంది డే టైమ్ లోనే సరిగ్గా వాటర్ తాగరు. ఇక గోరువెచ్చని వాటర్ అంటారా.. అబ్బే వేడిచేసుకునేంత టైమ్ మాకెక్కడిదండీ అంటారు. కానీ, వేడి నీటిని తాగడం ద్వారా శరీరంలో జరిగే మార్పులేంటో తెలిస్తే.. మాత్రం రేపటి నుంచి తప్పక ఫాలో అవుతారంటే నమ్మండి!

Hot Water
Hot Water
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 11:59 AM IST

Health Benefits of Drinking Hot Water : మన జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి రోజూ ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరానికి సరిపడా నీరు తాగడం అంతే ముఖ్యం. తగిన మొత్తంలో డైలీ వాటర్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను మన దరిచేరకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఎక్కువగా చల్లని నీటిని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ, అదే ప్లేస్​లో గోరువెచ్చని నీరు(Hot Water) తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించి అనేక ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఆయుర్వేదం కూడా వేడినీటి తీసుకుంటే బోలెడు లాభాలున్నాయని తెలుపుతుంది. కానీ, చాలా మందికి ఈ విషయం తెలియదు. అయితే, ఇంతకీ హాట్ వాటర్ తాగడం ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : మీరు భోజనం తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకున్నారంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. తిన్నాక వేడి నీటిని తాగితే వేగంగా ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు బాడీకి తగిన పోషకాలను ఈజీగా పంపిణీ చేస్తుంది. అలాగే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే మరో ప్రయోజనమేంటంటే.. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

డీహైడ్రేషన్ సమస్య ఉండదు : మనం బాడీ జీర్ణక్రియ సమయంలో కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో హాట్ వాటర్ బాగా పనిచేస్తుంది. అలాగే వేడి నీరు ఎప్పుడూ టాక్సిన్లకు వ్యతిరేకంగా పనిచేస్తూ.. శరీరాన్ని డీహైడ్రేషన్ కు లోనుకాకుండా కాపాడుతుంది. బాడీ టెంపరేచర్​ను నియంత్రించడంలోనూ ఇది తోడ్పడుతుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది : భోజనం తర్వాత వేడి నీటిని తాగాలని చాలా మంది నిపుణులు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు 32 శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అలాగే కడుప్పు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది.

నెలసరి నొప్పిని తగ్గిస్తుంది : భోజనం చేసిన తర్వాత వేడి నీటిని తాగడం వల్ల మహిళలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డైలీ గోరువెచ్చని నీటిని తాగితే గర్భాశయంలోని గట్టి కండరాలు సడలింపుతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే పిరియడ్స్ టైమ్ లో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!

మెరుగైన రక్త ప్రసరణ : వేడి నీటిని వాసోడైలేటర్ అంటారు. అంటే ఇది రక్త కేశనాళికలను విస్తరించి బాడీలోని రక్త ప్రవాహాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. అలాగే కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

జలుబు నుంచి ఉపశమనం : చలికాలంలో వేడి నీరు చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీరు తాగితే బద్ధకం తగ్గి బాడీ ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా వింటర్ లో వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.

ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది : రోజూ తగినంత నీరు తాగడం వల్ల తేలికగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా వేడినీరు ఒత్తిడిని తగ్గించడంలో, విశ్రాంతిని ప్రోత్సహించడంలోనూ సహాయపడతుంది. కాబట్టి రోజూ వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే డైలీ టీ, కాఫీలకు బదులు వేడినీరు తీసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

దంత సమస్యలు దూరం : వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలలో మరొకటి మెరుగైన దంత ఆరోగ్యం. గోరువెచ్చని నీరు పంటి నొప్పిని తాత్కాలికంగా తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిగుళ్ళలో రక్త ప్రవాహాన్ని ప్రేరేపించి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇకపోతే పళ్ల మీద టార్టార్ తొలగించడంతో పాటు మొత్తం దంత ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

జనరేషన్​ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!

Weight Loss Tips At Home : హెల్దీగా బరువు తగ్గాలా?.. ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.