ETV Bharat / sukhibhava

మీకు నల్ల పసుపు గురించి తెలుసా? - లేదంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే! - Black Turmeric Uses

Black Turmeric Health Benefits : పసుపు మంచి యాంటీ బయాటిక్​గా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే పసుపు అంటే ఎల్లో కలర్​లో ఉండేదే మనకు తెలుసు. కానీ పసుపులో ఇంకో కలర్​ కూడా ఉంది. అదే బ్లాక్​​. పచ్చ పసుపు అందించే ప్రయోజనాలకు మించిన ఆరోగ్య ప్రయోజనాలను ఈ నల్ల పసుపు అందిస్తుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..

Black Turmeric
Black Turmeric
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 5:27 PM IST

Health Benefits of Black Turmeric : పసుపులో ఎన్నో జౌషధ గుణాలుంటాయని మనందరికీ తెలిసిన సంగతే. దీంతో ఎన్నో రకాల వ్యాధులు, ఇన్​ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే అందరం డైలీ వండే అన్ని రకాల వంటకాల్లో పసుపును యూజ్ చేస్తుంటాం. ఇది వంటలకు రంగు, రుచిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదే విధంగా పసుపులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో ఇది అనేక వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తోంది. అయితే ఇంత వరకు ఓకే గానీ.. మీరు నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది మామూలు పసుపు(Turmeric) కంటే అధిక కర్‌క్యుమిన్‌ కంటెంట్​తో పాటు అనేక ఔషధ విలువలు కలిగి ఉంది. దీనిని కనుక మీ వంటలో భాగం చేసుకున్నారంటే సాధారణ పసుపు కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Black Turmeric Benefits : సాధారణంగా మనం పసుపును వంటల్లో వేసుకుంటే అది పసుపు రంగులోకి మారుతుంది. అలాగే ఈ నల్ల పసుపు మీ ఆహార పదార్థాల్లో లేదా పాలలో వేసుకున్నప్పుడు అవి నలుపు రంగులోకి కాకుండా ఊదా రంగులోకి మారుతాయి. పేరుకే నలుపు కానీ.. దాని కలర్​ ఊదా రంగులో ఉంటుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్​లో ఈ నల్ల పసుపును పండిస్తారు. కర్కుమా సీసియా.. ఈ పసుపు శాస్త్రీయ నామం. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఇప్పుడు బయట మార్కెట్​లో, ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉంది. ఇక దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్ : నల్ల పసుపును యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్​గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది గాయాలు, దెబ్బల వల్ల బాడీలో వచ్చిన వివిధ వాపుల్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి వాటికీ ఈ పసుపు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తంగా దీనిని మంచి సహజ నొప్పి నివారణిగా చెప్పుకోవచ్చు.

మెరుగైన రోగనిరోధక వ్యవస్థ : నల్ల పసుపులోని కర్కుమినాయిడ్స్ రోగనిరోధక కణాల కార్యకలాపాలను ప్రేరేపిస్తాయి. అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడడానికి అవి రక్షణ కవచంగా పనిచేస్తాయి. ముఖ్యంగా నల్ల పసుపును తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు.. వైరస్​లు, బ్యాక్టీరియాలు, ఫంగస్​లు వంటి వాటివల్ల వచ్చే ఇన్​ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది : నల్ల పసుపు తీసుకోవడం ద్వారా మెరుగైన జీర్ణ వ్యవస్థ మీ సొంతమవుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా అల్సర్లు, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలన్నీ తగ్గి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. పోషకాల శోషణకు సహాయపడుతుంది.

మీరు వంటల్లో వాడుతున్న పసుపు కల్తీ కావొచ్చు - ఇప్పుడే చెక్ చేసుకోండిలా!

మధుమేహాన్ని నియంత్రిస్తుంది : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో నల్ల పసుపు క్రీయాశీలకంగా పనిచేస్తుంది. అదే విధంగా బాడీ వెయిట్​ను నియంత్రించడంలోనూ ఇది సహకరిస్తుంది. అయినప్పటికీ మధుమేహం ఉన్నవారు దీనిని ఉపయోగించే ముందు డాక్టర్​ను సంప్రదించడం చాలా ముఖ్యం. వారి సలహాతో దీనిని యూజ్ చేయడం బెటర్.

చర్మ సంరక్షణ : నల్ల పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వివిధ చర్మ సమస్యలకు సహజ నివారణగా పని చేస్తాయి. ఇది మొటిమలను తగ్గించడానికి, తామర నుంచి ఉపశమనం పొందడానికి, మచ్చలను కూడా పోగొట్టడంలో సహాయపడుతుంది.

జ్ఞాపక శక్తి పెరుగుతుంది : నల్ల పసుపులోని కర్కుమిన్ న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు సంబంధిత అభిజ్ఞా క్షీణత, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులను నివారించడంలోనూ ఇది సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా శ్వాస కోశ వ్యాధులను తగ్గించడంలో నల్ల పసుపు ఎంతో మేలు చేస్తుంది.

ఇక చివరగా నల్ల పసుపు ఒక శక్తివంతమైన మసాలా కాబట్టి దీనిని కొద్దికొద్దిగా యాజ్ చేయడం ప్రారంభించాలి. క్రమంగా పెంచుకోవాలి. అలాగే మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే లేదా గర్భవతిగా లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే.. నల్ల పసుపును ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

బెల్లం పసుపుతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? అస్సలే వదిలి పెట్టరు!

Raw Turmeric Health Benefits : ప‌చ్చి పసుపు తింటే ఎన్ని లాభాలో.. దీర్ఘకాలిక రోగాలూ నయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.