ETV Bharat / sukhibhava

చేతులు పదేపదే కడుగుతున్నారా?

కరోనా నేపథ్యంలో అతిగా చేతులు శుభ్రం చేసుకోవటం, ఎక్కువసార్లు శానిటైజర్లు వినియోగించటం ద్వారా చర్మం పొడిబారి సమస్యలకు దారి తీస్తుంది. శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు పొడిబారితే ఏం చేయాలి? అసలు ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

hand wash
చేతుల పరిశుభ్రత
author img

By

Published : May 5, 2021, 3:59 PM IST

కరోనా వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి ఒకరికి సోకుతూ.. భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్​ సోకకుండా, ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చేతులను శుభ్రంగా కడుక్కోవటం, తరుచుగా ఆల్కహాల్​తో తయారైన శానిటైజర్లను వినియోగించటం ముఖ్యం.

వైరస్​ నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడగాలని చెబుతున్నారు వైద్యులు.

అతి.. అనర్థానికి దారి

చేతులు కడుక్కోవటం ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అది మంచి అలవాటు. కానీ.. అతిగా శుభ్రం చేసుకోవటం కూడా అనర్థాలకు దారితీస్తుంది. చర్మంపై ఉండే సహజసిద్ధమైన నూనెలు తొలగిపోయి పొడిగా మారిపోతాయి. ఆల్కహాల్​తో తయారైన శానిటైజర్లు, సబ్బులతో అతిగా చేతులను శుభ్రం చేసుకుంటే.. చర్మం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది.

చేతులు ఎందుకు పొడిబారతాయి?

నీళ్లు, సబ్బుతో చర్మంపై ఉన్న క్రిములు, దుమ్ము తొలగిపోతుంది. కానీ.. తరచుగా అదే పని చేయటం ద్వారా చర్మంలో ఉండే సహజసిద్ధమైన నూనెలు తొలగిపోయి.. చర్మం పొడిబారుతుంది. దానివల్ల దురద, చర్మ సమస్యలు, దద్దుర్లు, మంట, పగుళ్లు ఏర్పడతాయి.

నీళ్లు, సబ్బు అందుబాటులో లేని సందర్భంలోనే ఆల్కహాల్​తో తయారైన శానిటైజర్లను వినియోగించాలని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) సూచిస్తోంది. చాలా సందర్భాల్లో చేతులపై ఉన్న క్రిములను శానిటైజర్లు త్వరగా తొలగిస్తాయని చెబుతోంది. అయినప్పటికీ.. అవి అన్ని రకాల క్రిములను తొలగించలేవని... సబ్బు, నీళ్లతోనే దుమ్ము, క్రిములు తొలగిపోతాయని అంటోంది.

పొడిబారకుండా ఏం చేయాలి?

చేతులపై పేరుకున్న దుమ్ము, సూక్ష్మక్రిములను తొలగించేందుకు సున్నితమైన, సువాసన లేని సబ్బును ఉపయోగించాలి. చేతులు కడుక్కునేందుకు ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని వినియోగించాలి. చేతులు కడిగిన తర్వాత సున్నితమైన వస్త్రంతో తుడవాలి కానీ.. రుద్దకూడదు. రుద్దితే చర్మ సమస్యలు వస్తాయి. చేతులను తుడుచుకున్న తర్వాత తేమను పట్టి ఉంచేందుకు అవసరమైన క్రీమ్​ను రాసుకోవాలి.

నూనెలతో తయారైన క్రీమ్​లు మంచి ఫలితం ఇస్తాయి. నిద్రపోయే ముందు ఈ క్రీమ్​లను రాసుకుని.. వస్త్రంతో తయారైన​ గ్లౌజ్​ను వేసుకోవాలి. దీని ద్వారా చేతుల్లో తేమ నిలిచి ఉంటుంది.

ఏం చేయాలి?

చర్మంలోని తేమను కాపాడే క్రీములను సహజ సిద్ధమైన వస్తువులతో సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు కలబంద, తేనె, కొబ్బరినూనె, పసుపు కలిపి క్రీము తయారు చేసుకోవచ్చు. దానిని చేతులకు రాసుకొని 15 నిమిషాల తర్వాత తీసివేయాలి. ఇలా చేయటం ద్వారా చేతులు సున్నితంగా, మృదువుగా తయారవుతాయి.

ఇదీ చూడండి: అందరికీ టీకా ఇంకా ఎంత దూరం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.