Hair Growth Tips: సాధారణంగా మహిళ్లలో ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలతుంటుంది. దీంతో పాటు హిమోగ్లోబిన్ కొరత, ఐరన్ కొరత, వంశపారపర్యంగా రావడం, స్ట్రెయిట్నింగ్ చేయడం వంటి కారణాలు ఈ సమస్యకు కారణమవుతాయి. వీటిని పరిశీలించుకుని అదుపులో ఉండేలా చూసుకోవాలి. అయినా జట్టు రాలుతుంటే థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేసుకోవాలి.
ఇవన్నీ లేకపోయినా జట్టు రాలుతుంటే పోషకాహారం తీసుకోవాలి. స్ప్రౌట్స్, డ్రైఫ్రూట్స్, పాలు, డేట్స్, పప్పు ధాన్యాలు, గుడ్లు, బాదం వంటి పోషక విలువల గల ఆహారాన్ని తీసుకోవాలి. కొందరు కెరాటిన్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ ట్రీట్మెంట్, హానికర షాంపూలు ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జుట్టు బలహీనపడి అధికంగా రాలుతుంది. ఇలాంటివి చేస్తుంటే వెంటనే నిలిపివేయాలి.
నూనె.. జుట్టుకు కండీషనర్‌గా మాత్రమే ఉపయోగపడుతుంది. జుట్టు పెరగడం, రాలడాన్ని తగ్గించడం వంటివి జరగవు. తలస్నానం చేయడానికి ముందు నూనె పెట్టకుంటే షాంపూలో ఉండే హానికర పదార్థాల నుంచి రక్షిస్తుంది. పొడి జుట్టును తగ్గించుకోవడం కోసం కండీషనర్‌ను ఉపయోగించాలి. తలస్నానం చేయగానే హెయిర్ బ్లోయింగ్ చేస్తుంటారు. ఇలా కాకుండా కండీషనర్‌ను ఉపయోగిస్తే మంచిది.
వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే డెడ్ స్కిన్, డాండ్రఫ్ లాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. డాండ్రఫ్ ఉంటే రోజు తప్పించి రోజు తలస్నానం చేయడం మంచిది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా జుట్టు రాలడం తగ్గకపోతే వైద్యులను సంప్రందించాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: కామెర్లు ఉన్నవారితో సెక్స్ ప్రమాదకరమా?