ETV Bharat / sukhibhava

కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​ వచ్చినట్లేనా? నిపుణులు ఏమంటున్నారు..? - Gastric Cancer Facts

Gastric Cancer Myths and Facts: క్యాన్సర్ అనేది తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. అయితే ఇందులో అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అందులో ఒకటి గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​. అయితే ఈ క్యాన్సర్​ గురించి చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటికి సమాధానాలను నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం..

Gastric Cancer Myths and Facts
Gastric Cancer Myths and Facts
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 10:46 AM IST

Gastric Cancer Myths and Facts : క్యాన్సర్​.. గుండె జబ్బుల తర్వాత రెండో స్థానంలో ఉన్న ప్రాణాంతక వ్యాధి. అయితే క్యాన్సర్​లో పలు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​. కాగా దీనిపై చాలా మందికి అపోహలు ఉన్నాయి. మరి వాటిలో నిజమెంత..? అసలు గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​ అంటే ఏమిటి..? లక్షణాలు..? తదితర వివరాలు చూద్దాం..

గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​ అంటే..?: గ్యాస్ట్రిక్ క్యాన్సర్​ను కడుపు క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. పొట్టలోని కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. సాధారణంగా, గ్యాస్ట్రోఎసోఫాగియల్ జంక్షన్ క్యాన్సర్ బారినపడే ప్రాంతం. చాలా సందర్భాలలో, క్యాన్సర్ పెరుగుదల కడుపు శ్లేష్మం ఉత్పత్తి చేసే కణాల నుంచి మొదలవుతుంది. దీనిని అడెనోకార్సినోమా అంటారు. WHO అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 72వేల మంది ఈ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. పెద్దపేగు క్యాన్సర్ సాధారణంగా పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ముందు, కడుపు లోపలి గోడలు మారడం ప్రారంభిస్తాయి. వీటి లక్షణాలు గుర్తించలేం. కడుపులో ఏ భాగం ప్రభావితమవుతుందనే దానిపై ఆధారపడి లక్షణాలు మారుతూ ఉంటాయి.​

మొలకలు తింటున్నారా? - ఈ డేంజర్ తెలుసా?

గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​ అపోహలు-వాస్తవాలు:

అపోహ: గ్యాస్ట్రిక్​ క్యాన్సర్ ఎల్లప్పుడూ లక్షణాలను కలిగి ఉంటుంది.

వాస్తవం: కడుపు క్యాన్సర్‌.. దాని ప్రారంభ దశలలో స్పష్టమైన లక్షణాలను చూపించలేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు, స్క్రీనింగ్‌లు ఈ క్యాన్సర్​ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఫ్యామిలిలో ఎవరికైనా ఈ క్యాన్సర్​ లేదా హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వంటి ప్రమాద కారకాలు ఉన్నవారు దీని బారిన పడే అవకాశం ఉంటుంది.

డిప్రెషన్​ సమస్యా? మందులు లేకుండా ఈ పద్ధతులు ఫాలో అవ్వండి!

అపోహ: కారంగా ఉండే ఆహారాలు, ఒత్తిడి కడుపు క్యాన్సర్‌కు కారణమవుతాయి.

వాస్తవం: ఆహారం, ఒత్తిడి అంశాలు ఆరోగ్యంలో పాత్ర పోషిస్తాయి. అయితే అవి కడుపు క్యాన్సర్‌కు ప్రత్యక్ష కారణాలు కాదు. మసాలా ఆహారాలు, ఒత్తిడి తరచుగా కడుపు క్యాన్సర్‌కు కారణమవుతుందని కొంతమేర నిజమైనా.. పూర్తిగా వీటి వల్లనే వస్తుందనేది అపోహ మాత్రమే. జన్యుశాస్త్రం, హెచ్‌పైలోరీ ఇన్‌ఫెక్షన్, ధూమపానం, కొన్ని ఆహార పదార్థాలు వంటి అంశాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం అయితే, సమతుల్య ఆహారం, ఒత్తిడి నిర్వహణ, పొగాకుకు దూరంగా ఉండాలి.

అపోహ: కడుపు క్యాన్సర్ వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

వాస్తవం: కడుపు క్యాన్సర్ అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. కానీ వయసు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. వృద్ధులలో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో కడుపు క్యాన్సర్ సర్వసాధారణం అనేది నిజం అయితే, ఇది ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి నిర్దిష్ట ప్రమాద కారకాలు లేదా ఫ్యామిలిలో ఎవరికైనా ఉంటే.. యువకులు కూడా కడుపు క్యాన్సర్‌తో ఇబ్బందిపడవచ్చు. దీనిని ముందస్తుగా గుర్తించడం, సమర్థవంతమైన చికిత్స కోసం రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు ముఖ్యం.

మహిళలు ఈ లక్షణాలను లైట్​ తీస్కోవద్దు - క్యాన్సర్ కావొచ్చు!

అపోహ: కడుపు నొప్పి ఉంటే అది క్యాన్సర్ కావచ్చు.

వాస్తవం: కడుపు నొప్పి వివిధ పరిస్థితుల వల్ల సంభవించవచ్చు. అయితే అన్ని సందర్భాలు క్యాన్సర్‌కు సంబంధించినవి కావు. కడుపు నొప్పి అనేది అజీర్ణం నుంచి అల్సర్ల వరకు అనేక సమస్యల సాధారణ లక్షణం. నిరంతర లేదా తీవ్రమైన నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. కడుపు క్యాన్సర్ లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి. కచ్చితమైన రోగనిర్ధారణ, సరైన చికిత్స కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం చాలా కీలకం.

ఉదయం టిఫెన్​లో ఇవి తిన్నారంటే - ఆరోగ్యం నాశనమైపోతుంది!

అపోహ: కడుపు క్యాన్సర్ ఎల్లప్పుడూ ప్రాణాంతకం.

వాస్తవం: కడుపు క్యాన్సర్‌కు మనుగడ రేట్లు మారుతూ ఉంటాయి. ముందుగా గుర్తించడం వల్ల వ్యాధి తీవత్రను తగ్గించవచ్చు. కడుపు క్యాన్సర్ తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి అయితే, వైద్య శాస్త్రంలో మెరుగైన చికిత్సలు ఉన్నాయి. అయితే దీనిని మొదట్లోనే గుర్తిస్తే.. తీవ్రతను తగ్గించవచ్చు. రెగ్యులర్ స్క్రీనింగ్‌లు.. కడుపు క్యాన్సర్‌ను గుర్తించడానికి దారితీస్తుంది.

అపోహ: గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​కు నివారణ లేదు.

వాస్తవం: కొన్ని జీవనశైలి ఎంపికలు, రెగ్యులర్ స్క్రీనింగ్‌లు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల కడుపు క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. పొగాకును నివారించడం, పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు హాజరు కావడం వంటివి కడుపు క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు.

ఆకలి లేకున్నా భోజనం! - "చంద్రముఖి"లో రజనీకాంత్ డైలాగ్ గుర్తుందా?

బరువు తగ్గడానికి రొట్టె తింటున్నారా?

మీకు హార్ట్ ఎటాక్ రావొద్దంటే - ఈ 7 ఆహార పదార్థాలను అస్సలు తినొద్దు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.