Foods You Should Not Refrigerate : సాధారణంగా కూరగాయలు, పళ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు వాటిని ఫ్రిజ్లో నిల్వ ఉంచుతుంటారు. అయితే వీటిలో పలు రకాల ఆహారపదార్థాలు, ఫ్రిజ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషకవిలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో నిల్వచేయకూడని పల్లు, కూరగాయలు ఏంటి? వాటిని అలా నిల్వ చేయడం వల్ల నష్టాలేంటి? మొదలైన వివరాలు మీ కోసం.
అరటిపళ్లు
అరటిపళ్లు అతిశీతల వాతావరణాన్ని తట్టుకోలేవు. వీటిని మనం ఫ్రిజ్లో ఉంచినపుడు ఇవి నలుపు రంగులోకి మారిపోతాయి. అరటిపళ్లు ఆకృతి, పక్వత కూడా దెబ్బతింటాయి. ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైములు అవరోధంగా ఉంటాయి. దానివల్ల వాటి రుచి కొల్పోతాయి. అందువల్ల రిఫ్రిజిరేటర్లో అరటిపళ్లు నిల్వఉంచకపోవడమే మంచిది.
వెల్లుల్లి
వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటిలో శిలీంద్రాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వెల్లుల్లిపై మొలకెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీటిని రిఫ్రిజిరేటర్లో నిల్వచేయటం అంత మంచిది కాదు.
ఉల్లి
ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని రిఫ్రిజిరేటర్లో కొందరు నిల్వ చేస్తుంటారు. ఫలితంగా ఉల్లిపాయలో ఉండే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది. దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి. అందువల్ల ఉల్లిని రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు. గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉల్లిని ఉంచడం వల్ల అవి తొందరగా పాడవ్వకుండా ఉంటాయి.
తేనె
తేనెలో నీటి శాతం తక్కువ, ఆమ్లత్వం ఎక్కువ ఉంటుంది. ఫలితంగా తేనెలో అంత తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందదు. కానీ తేనెను ఫ్రిజ్లో ఉంచడం వల్ల అది స్పటికీకరణం చెందవచ్చు. దీనివల్ల తేనె దాని సహాజ గుణాలను కోల్పోతుంది.
బంగాళదుంపలు
బంగాళదుంపల్లో అధికంగా స్టార్చ్ ఉంటుంది. ఇవి చల్లని, చీకటి, పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి. శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. అటువంటి దుంపలను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
టమోటాలు
టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రిఫ్రిజిరేటర్లలో ఉంచడం వల్ల వాటి రుచిని కోల్పోయే అవకాశం ఉంది.
కాఫీ గింజలు
కాఫీ గింజలకు పరిసరాల నుంచి తేమ, వాసనలను గ్రహించే లక్షణం ఉంది. అయితే వాటిని ఫ్రిజ్లో నిల్వచేయడం వీటి రుచిని కోల్పేయే అవకాశం ఉంది. పైన వివరించిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫ్రిజిరేటర్లో ఉంచకపోవడమే మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
పండ్లు, కూరగాయలు ఫ్రిజ్లో ఉంచుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే
ఈ పండ్లను కలిపి తింటే యమ డేంజర్.. అస్సలు తినకూడని కాంబినేషన్లు ఇవే!