కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరం చురుగ్గా కదలాలన్నా, తగినంత ప్రొటీన్ అందాలి. ఎక్కువ మోతాదులో ప్రొటీన్ అందే ఆహారంలో అవిసెగింజలు కూడా ఒకటి. కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. బరువూ అదుపులో ఉంటుంది.
అవిసె గింజల్లోని పీచు జీర్ణక్రియల వేగాన్ని పెంచుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
అవిసెగింజలు హార్మోన్లను సమతులం చేస్తాయి. ఫలితంగా నెలసరులు క్రమం తప్పకుండా ఉంటాయి. అవిసె గింజల్లోని ఒమేగా-3 యాసిడ్లు కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రిస్తాయి.