ETV Bharat / sukhibhava

Fatty Liver Disease Treatment : 'ఫ్యాటీ లివర్' సమస్య వేధిస్తోందా?.. వాటికి దూరంగా.. వీటికి దగ్గరగా ఉంటే చాలు! - what food to eat for fatty liver

Fatty Liver Disease Treatment In Telugu : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో మార్పులు! అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Fatty Liver Disease Guidelines In Telugu
Fatty Liver Disease Full Details In Telugu
author img

By

Published : Aug 19, 2023, 7:49 AM IST

Fatty Liver Disease Treatment In Telugu : శరీరంలో జరిగే జీవక్రియల్లో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే జీవితాంతం పెరిగే ఒకే ఒక అవయవం కూడా కాలేయమే. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండే మృతకణాలను, బ్యాక్టీరియా, హానికర హార్మోన్లను కూడా తొలగిస్తుంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు పలు ఆరోగ్య సమస్యలకు గురవుతు ఉంటుంది. కొన్నిసార్లు మనం తినే ఆహారంలో మార్పుల వల్ల కాలేయం చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ ( Fatty Liver Disease ) అని అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడమే అని అంటున్నారు డాక్టర్లు.

ఫ్టాటీ లివర్​ అంటే ఏంటి..?
What Is Fatty Liver Disease : శరీర కణాలు సంగ్రహించేందుకు అనువుగా ఆహారాన్ని మార్చేందుకు కాలేయం తన విధులను నిర్వర్తిస్తుంది. ఇటీవల చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. లివర్​లో కొవ్వు శాతం కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. అయితే ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.

రెండు రకాలు..
Types Of Fatty Liver Disease : వైద్యపరంగా ఫ్యాటీ లివర్ అని పిలిచే ఈ పరిస్థితి రెండు రకాల కారణాలతో ఏర్పడుతుంది. మొదటిది ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మాత్రం జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి లక్షణాలు అధికమైతే కాలేయం వాపు, హెపటైటిస్‌, సిరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి.

ఇవి కారణాలు..
Reasons For Fatty Liver : కాలేయంలో వచ్చే ప్రధాన సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. శరీరంలోని ప్రతి భాగంలో కొవ్వు అనేది ఉంటుంది. ఎప్పుడైతే కొవ్వు కణజాలాలు పెరుగుతాయో అప్పుడు కాలేయపు కణజాలాలు తగ్గిపోతాయి. దాని వల్ల కాలేయం పనితీరు క్షీణించే అవకాశం ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ ( Fatty Liver Reasons ) డిసీజ్ అని అంటారు. దీనికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన జీవనశైలి. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు ఉండటం, రెడ్ మీట్​ను ఎక్కువగా తీసుకోవడం. మద్యపానం అలవాటు కూడా దీనికి ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు.

ఫ్యాటీ లివర్​ లక్షణాలు..
Fatty Liver Symptoms : ఫ్యాటీ లివర్ తీవ్రత ఎంతనేది నాలుగు దశలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. సమస్య పెరుగుతున్న కొద్దీ కాలేయం పాడైపోవడం, కామెర్లు రావడం, శరీరంలో ప్రొటీన్ తగ్గిపోవడం, కడుపులో నీరు చేరడం, పాదాల్లో వాపులు రావడం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య మరింత ఎక్కువైతే వాంతుల్లో రక్తం రావడం, మలవిసర్జనలో మలినాలు రావడానికి దారితీసే అవకాశం ఉంది. దీన్ని రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా రెగ్యూలర్​గా వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు వైద్యులు.

వీరిలోనూ గమనించవచ్చు..
Effects Of Fatty Liver : ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ.. కాలేయం బరువు కంటే పది శాతం కొవ్వు పెరిగితే అనేక దుష్ఫలితాలు మొదలవుతాయి. ఆల్కహాల్ అధికంగా తీసుకునేవారిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్​ను.. ఆల్కహాల్ అలవాటు లేకపోయినా బరువు అధికంగా ఉండటమో లేదా చక్కెర వ్యాధితో బాధపడేవారిలోనూ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను గమనించవచ్చు.

మద్యం, డ్రగ్స్​కు దూరం..
Fatty Liver Alcohol : ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న కాలేయంపై మరింత భారం వేయకుండా ఉండటం కోసం మితంగా భోజనం చేయండి. తిన్న తర్వాత కొన్ని గంటల పాటు లివర్​కు విశ్రాంతినివ్వాలి. ఈ విరామ సమయం కాలేయం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. కాలేయ సంబంధిత వ్యాధులను ఆరంభ దశలోనే గుర్తించడమే కాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మద్యం, డ్రగ్స్​కు దూరంగా ఉండాలి.

ఆహారంలో ఇవి చేర్చుకోండి..
Fatty Liver Diet : ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం తాగే నీరు, తీసుకునే ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. వెల్లుల్లి, బంగాళదుంప, బీట్ రూట్, క్యారెట్ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అనుకోకుండా జరిగే దాడుల నుంచి రక్షించుకునేందుకు విటమిన్​-సీ అధికంగా లభించే ద్రాక్ష, యాపిల్, నిమ్మరసం ( What Food To Eat For Fatty Liver ) వంటివి తీసుకోవాలి.

వీటికి దూరం..
Avoid Food For Fatty Liver : ప్రతిరోజూ ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి. అలాగే ఆహారంలో కూరగాయలు, పండ్లు, ఫైబర్​ శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే కాలేయంలో అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మద్యం మానేయడం, మసాలాలు, చల్లటి వస్తువులు ( Fatty Liver Treatment ), వేపుళ్లు తినకుండా ఉండటం, పులుపు పదార్థాలు తగ్గించి కూరగాయలు తీసుకోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం లాంటి మార్పులను మన జీవనశైలిలో తెచ్చుకోవాలి. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే వీటికి ఆమడ దూరంలో ఉండండి..!

Vegetarian Tips Protein : వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నారా? పోషకాలన్నీ అందాలంటే ఎలా?

Planning To Conceive : ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఆ మాత్రల విషయంలో జాగ్రత్త!

Skipping Health Benefits : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా?.. రోజూ 'స్కిప్పింగ్'​ చేస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.