ETV Bharat / sukhibhava

ఇంట్లోనే ఉండి వ్యాయామం చేయండిలా..!

author img

By

Published : Aug 26, 2020, 11:54 AM IST

కరోనాతో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. జిమ్‌లు తిరిగి ప్రారంభించినా, బయటకు వెళ్లాలంటే తెలియని బెరుకు. అందుకే ఇంట్లోనే ఉండి ఈ యాప్‌ల సాయంతో వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండొచ్ఛు.

Exercise at home with the help of apps
ఇంట్లోనే ఉండి వ్యాయామం చేయండిలా..!

ఫిట్‌ఆన్‌:

శరీరాకృతిని అందంగా మార్చుకోవాలని కోరుకునేవారికి ఈ యాప్‌ మంచి ఎంపిక. మీ శరీరంలో ఏ భాగంలో కొవ్వుని కరిగించుకోవాలని అనుకుంటున్నారో ఆ భాగానికి సంబంధించిన వ్యాయామాలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు పొట్ట తగ్గించుకోవాలంటే అందుకు సంబంధించిన వ్యాయామాలుంటాయి. ఇవికాకుండా డాన్స్‌, యోగా వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి.

స్ట్రావా:

మీరు ఎంత దూరం పరుగెత్తారు? ఎన్ని కెలొరీలు ఖర్చయ్యాయి? వంటి సమాచారాన్ని కచ్చితంగా అందిస్తుంది. ఈ యాప్‌ సాయంతో నచ్చిన కోచ్‌లతో మాట్లాడి వ్యాయామంలో వచ్చే సందేహాలను తీర్చుకునే సదుపాయమూ ఉంది.

స్వార్‌కిట్‌:

ఈ యాప్‌ ఉంటే మీకు తోడుగా మీ వ్యక్తిగత వ్యాయామ సలహాదారు ఉన్నట్టే. ఇందులో వ్యాయామం ఎలా మొదలుపెట్టాలి. ఎంతసేపు చేయాలి? చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... లాంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటూ, మీరు వ్యాయామం చేయడానికి కావాల్సిన ప్రణాళికలూ సిద్ధంచేసుకోవచ్ఛు మీరు చేయాలనుకున్న వ్యాయామాలకు సంబంధించిన వీడియోలూ అందుబాటులో ఉంటాయి.

ఇదీ చూడండి చైనాకు చెక్​: లద్దాఖ్​కు కొత్త రోడ్డు మార్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.