ETV Bharat / sukhibhava

ఒంట్లో నీటిశాతం తగ్గినా తరచూ మూత్రం! - అతి మూత్రానికి కారణాలు

Excess Urination: ఒంట్లో నీటిశాతం తగ్గినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని తెలుసా? నమ్మబుద్ధి కావటం లేదు కదా! అయితే.. ఎందుకలా అవుతుందో తెలుసుకోండి.

Excess Urination
అతి మూత్రం
author img

By

Published : Feb 8, 2022, 7:01 AM IST

Excess Urination: నీరు, ద్రవాలు అధికంగా తీసుకున్నప్పుడు ఎక్కువసార్లు మూత్రం రావటం మామూలే. అయితే కొన్నిసార్లు ఒంట్లో నీటిశాతం తగ్గినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని తెలుసా? నమ్మబుద్ధి కావటం లేదు కదా. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు మూత్రం చిక్కబడుతుంది. దీంతో మూత్రంలోని లవణాలు, రసాయనాల గాఢత కూడా పెరుగుతుంది. అప్పుడు ఇవన్నీ మూత్రాశయం గోడలను చికాకు పరుస్తుంటాయి. ఫలితంగా మూత్రం వస్తున్న భావన కలుగుతుంది. ఎక్కువసార్లు బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది.

నీరు ఎక్కువగా తాగినా తరచూ మూత్రం వస్తుందనుకోండి. మరి మూత్రం ఎందుకు ఎక్కువగా వస్తోంది? నీటిశాతం తగ్గటం వల్లనా? ఎక్కువవటం వల్లనా? మూత్రం రంగుతో దీన్ని ఇట్టే గుర్తించొచ్చు. తగినంత నీరు తాగితే మూత్రం లేత పసుపు రంగులో వస్తుంది. అదే ముదురు పసుపు రంగులో వస్తుంటే నీటి శాతం తగ్గిందనే అర్థం.

ఇదీ చదవండి: Beauty Tips: చారడేసి కళ్ల కోసం.. మాయ చేసే మేకప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.