ETV Bharat / sukhibhava

Eggs For Weight Loss : వేగంగా బరువు తగ్గాలా?.. కోడి గుడ్లను ఇలా తిని చూడండి!

Eggs For Weight Loss : నేటి కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య బరువు పెరగడం. మారుతున్న జీవనశైలే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకాలు పుష్కలంగా ఉండే గుడ్లను ప్రతి రోజూ ఒక క్రమపద్ధతిలో తింటే.. సులువుగా బరువు తగ్గవచ్చు అని వారు అంటున్నారు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దామా?

Eggs Benefit For Weight loss
గుడ్డు ఆరోగ్య లక్షణాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 2:11 PM IST

Eggs For Weight Loss : ఆరోగ్యకరమైన, అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాలలో గుడ్లు ప్రధానమైనవి. ఈ గుడ్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వాటిని సూపర్ ఫుడ్‌గా అభివర్ణిస్తారు. గుడ్లు మనకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొనలో 50% ప్రోటీన్, పచ్చసొనలో 90% కాల్షియం, ఐరన్​లు ఉంటాయి. (Eggs Health Benefits)

కేలరీలు తక్కువ - పోషకాలు ఎక్కువ!
కోడిగుడ్లు అధిక ప్రోటీన్, తక్కువ కేలరీల కలిగిన ఆహారం. ఇందులో ఇతర పోషకాలు (Nutrients) కూడా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ప్రయోజనకరం. వీటిని తినడం వల్ల ఎవరైనా బరువు తగ్గవచ్చు. ప్రత్యేకించి వీటిని క్యాలరీలు లేని ఆహారంలో చేర్చుకుంటే మంచిది. అల్పాహారం కోసం గుడ్లు తినడం గొప్ప వ్యూహంగా పరిగణించవచ్చు. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి కనుక వ్యక్తులు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. కోడిగుడ్లను ఏ రూపంలో వండుకుని తిన్నా కూడా ఒకే విధమైన ఫలితం ఉంటుంది.

Egg Good for Weight Loss : బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. ఆకలిని నియంత్రించుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్​లు ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఇందుకు సరైన ఆహారం గుడ్లు అని చెప్పవచ్చు. అందుకే బరువు తగ్గాలని ఆశించేవారు పోషకాలకు మూలమైన గుడ్లను తీసుకోవడంలో ఎటువంటి సంకోచం పడాల్సిన అవసరం లేదు. పరిశోధనల ప్రకారం.. గుడ్లు జీవక్రియ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి.

గుడ్డుతో బోలెడు లాభాలు.. రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?

బరువు తగ్గడంలో గుడ్లు ప్రాధాన్యత : గుడ్లలో అధిక శాతం ప్రోటీనులు ఉంటాయి. ఒక పెద్ద గుడ్డులో సుమారు 6 గ్రాముల వరకు ప్రోటీనులు ఉంటాయి. అదే సమయంలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల వ్యక్తులు గుడ్లను తమ సమతుల్య ఆహారంలో చేర్చుకోవాలి. అదే సమయంలో అదనపు కొవ్వు, చక్కెరలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు మాత్రమే వారు తమ బరువును అదుపులో పెట్టుకోగలుగుతారు.

Eggs Benefit For Weight loss : అధికంగా ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల.. ఆహారంలోని థర్మిక్​ ప్రభావాన్ని(Thermic Effect of Food) పెంచవచ్చు. ఇది మన శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఒక బృహత్తర ప్రక్రియ. ఆహారంలోని పోషకాలను జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ కేలరీలను వినియోగించవలసి ఉంటుంది. కనుక శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఈ విధంగా శరీర బరువు తగ్గుతుంది.

నూనెలు తగ్గించాలి!
బరువు తగ్గాలని ఆశించే వారు చిరుతిళ్లకు, వేపుళ్లకు దూరంగా ఉండాలి. అలాగే వెన్న, నూనెలు లాంటి కొవ్వు పదార్థాలతో గుడ్లను వేయించి తినడం మానుకోవాలి. హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినాలి. అదే విధంగా శరీరంలో.. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.