మనకు(skin care tips for men) ఎంత ధనం ఉన్నా అందంగా లేకపోతే పట్టించుకునే వారు ఎక్కువగా ఉండరు! అందమే మనపై ఇతరులు దృష్టి సారించేందుకు ఉపయోగపడుతుంది. మనం చేసే పనుల కన్నా, మాట్లాడే మాటల కన్నా అందమే మనల్ని ముందు వరుసలో నిలబెడుతుంది! చర్మ సౌందర్యం కేవలం ఆడవారికే కాదు.. మగవారికి(skin care easy tips) కూడా అంతే అవసరమని అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇటీవల కాలంలో తెల్లగా కనిపించేందుకు మగవారు కూడా పార్లర్ల చుట్టూ తెగ తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు(skin care tips at home) పాటిస్తే మగవారు తమ చర్మాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..
- ఉదయం నిద్ర లేవగానే ముఖాన్ని చల్లటి నీరుతో కడగాలి.
- బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ మాయిచ్చర్ తప్పనిసరిగా వాడాలి.
- సూర్యరశ్మి, దుమ్ము ధూళి బారిన పడకుండా చూసుకోవాలి.
- మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించాలి. ఇంటికి రాగానే చల్లటి నీళ్లతో ముఖం కడగాలి.
- ప్రతిరోజు సాయంత్రం తలస్నానం చేయాలి.
- నిత్యం ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల మొటిమలు, రాషెస్ రావు.
- సరైన పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఫలితంగా ముఖం కాంతివంతంగా మారుతుంది. డైట్లో ఎక్కువగా పాలకూర తీసుకోవాలి.
- ఆల్కహాల్ లేని స్క్రబర్స్, మాయిచ్చరైజర్ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలి.
- మధ్యాహ్నం పూట ఎక్కువగా తిరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. శరీరం పూర్తిగా కనపడకుండా ఉండే బట్టలు వేసుకోవాలి.
- సిగరెట్‌ను పూర్తిగా మానేయడం వల్ల చర్మం ముడతలు పడవు.
ఇంకా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు ఈ కింద వీడియోలో ఉన్నాయి. చూసేయండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Diet Plan For Weight Loss: ఒంట్లో కొవ్వు కరిగించాలా? ఇవి తినండి...